OG box office collection : నిన్న గాకా మొన్ననే విడుదలైనట్టు అనిపిస్తున్న పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ఓజీ(They Call Him OG) చిత్రం అప్పుడే 18 రోజులు పూర్తి చేసుకొని నాల్గవ వారం లోకి అడుగుపెట్టింది. ఈ సినిమా ఇచ్చిన అనుభూతి ని అభుమానులు జీవితాంతం మర్చిపోలేరు. సినిమా కంటెంట్ పరంగా కానీ, బాక్స్ ఆఫీస్ పరంగా కానీ, వాళ్ళను నూటికి నూరు శాతం సంతృప్తి పరిచిన చిత్రమిది. ఈమధ్య కాలం లో పవన్ కళ్యాణ్ సినిమాకు మూడవ వారం లో కూడా హౌస్ ఫుల్ బోర్డ్స్ పడడం కూడా ఈ చిత్రానికే జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏమిటంటే ఈ చిత్రం నిన్న అనేక చోట్ల రీసెంట్ గా విడుదలైన ‘కాంతారా 2′(Kantara : The Chapter 1) ని కూడా డామినేట్ చేసిందట. విజయవాడ, వైజాగ్ వంటి ప్రాంతాలు అందుకు ఒక ఉదాహరణగా నిలిచాయి. ఓవరాల్ గా చూసుకుంటే ఈ చిత్రానికి నిన్న ఒక్క రోజునే కోటి రిపాయిలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టింది.
కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా మరోయు ఓవర్సీస్ ప్రాంతాలకు కూడా కలిపి ఈ చిత్రానికి 18 వ రోజున రెండు కోట్ల రూపాయికులకు పైగా గ్రాస్ వసూళ్లను నమోదు చేసుకుంది. ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల నుండి 200 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టిన అతి తక్కువ చిత్రాల్లో ఓజీ కూడా ఒకటిగా నిలిచిపోయింది ఇప్పుడు. రాబోయే రోజుల్లో ఇంకా ఎంత పెద్ద రేంజ్ కి వెళ్లబోతుందో చూడాలి. సాధారణంగా ఇలాంటి గ్యాంగ్ స్టర్ తరహా సినిమాలకు ఫ్యామిలీ ఆడియన్స్ లో ఆదరణ ఉండదు. ఫలితంగా లాంగ్ రన్ పెద్దగా ఉండదు, గతం లో మనం ఇలాంటి సందర్భాలను చాలానే చూసాము. అలాంటిది ఓటీటీ కాలం లో ఒక గ్యాంగ్ స్టర్ సినిమాకు ఇంత రన్ రావడం అంటే పవర్ స్టార్ రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు అంటూ సోషల్ మీడియా లో పవన్ ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు.
సంక్రాంతికి కాకుండా, మరో సీజన్ లో ఒక సినిమాకు 300 కోట్ల గ్రాస్ ని కొల్లగొట్టడం అసాధ్యం. అలాంటి అసాధ్యమైన కార్యాన్ని కూడా ఈ చిత్రం నెరవేర్చింది. నిర్మాతలు సరైన ప్లానింగ్ లేకుండా ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లో లెవెల్ లో గ్రాండ్ గా విడుదల చేయలేకపోయారు కానీ, ఒకవేళ చేసుంటే కచ్చితంగా ఈ చిత్రం 400 కోట్ల రూపాయిల గ్రాస్ మార్కుని అందుకొని ఉండేది అంటూ అభిమానులు చెప్పుకొస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే తెలుగు రాష్ట్రాల్లో ఉత్తరాంధ్ర, సీడెడ్ మరియు నెల్లూరు ప్రాంతాల్లో ఈ చిత్రానికి నష్టాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.