spot_img
Homeఎంటర్టైన్మెంట్Ustaad Bhagat Singh Latest Update: ఇద్దరు హీరోయిన్స్ తో పవన్ మాస్ స్టెప్స్..? 'ఉస్తాద్...

Ustaad Bhagat Singh Latest Update: ఇద్దరు హీరోయిన్స్ తో పవన్ మాస్ స్టెప్స్..? ‘ఉస్తాద్ భగత్ సింగ్’ లేటెస్ట్ అప్డేట్ చూస్తే మెంటలెక్కిపోతారు!

Ustaad Bhagat Singh Latest Update: ఈ నెల 26 న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్ ‘(Ustaad Bhagat Singh) చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో విడుదల కాబోతుంది. దాదాపుగా అన్ని ప్రాంతాల్లోనూ ఈ సినిమాకు జరిగిన బిజినెస్ పవన్ కళ్యాణ్ గత చిత్రం ‘ఓజీ’ రేంజ్ లో ఉంది. ఒక కమర్షియల్ సినిమాకు ఈ రేంజ్ బిజినెస్ జరగడం అనేది చిన్న విషయం కాదు. సాధారణంగా కమర్షియల్ సినిమాలు కేవలం సంక్రాంతి సీజన్ లో మాత్రమే బాగా ఆడుతాయి. మిగిలిన సీజన్స్ లో ఈ సినిమాలకు డిమాండ్ ఉండదు అని ట్రేడ్ విశ్లేషకులు అంటుంటారు. కానీ ‘ఉస్తాద్ భగత్ సింగ్ ‘ లెక్క వేరు లాగా ఉంది. అందుకే బయ్యర్స్ చాలా నమ్మకంతో ఈ సినిమాని కొనుగోలు చేస్తున్నారు. వాళ్ళు అలా కొనుగోలు చేయడానికి కూడా ఒక కారణం ఉందట.

Also Read: లోకేష్ కు అలా అవకాశం ఇచ్చిన చంద్రబాబు!

మేకర్స్ బయ్యర్స్ కి ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన 20 నిమిషాల ఫుటేజీ ని చూపించారట. అవి వాళ్లకు విపరీతంగా నచ్చడం తో ఈ చిత్రాన్ని ఆ రేంజ్ రేట్లకు కొనుగోలు చేస్తున్నారట. పవన్ కళ్యాణ్ ని ఇప్పటి వరకు ఎవ్వరూ చూడని యాంగిల్స్ లో డైరెక్టర్ హరీష్ శంకర్ చూపించాడట. ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ తన కెరీర్ మొత్తం మీద ఒక మాస్ సాంగ్ లో ఇద్దరు హీరోయిన్స్ తో డ్యాన్స్ వెయ్యలేదు. అభిమానులకు కనీసం ఊహలో కూడా ఈ ఇలాంటి ఆలోచన వచ్చి ఉండదు. అలాంటిది ఈ సినిమాలో ఆయన శ్రీలీల , రాశీ ఖన్నా
ఖన్నా తో కలిసి ఒక మాస్ బీట్ ఉన్న సాంగ్ లో అదిరిపోయే రేంజ్ స్టెప్పులు వేశాడట. ఈ పాట ఆన్లైన్ లోకి ఎప్పుడు విడుదల అవుతుందో తెలియదు కానీ, విడుదలైన రోజు మాత్రం బ్లాస్టింగ్ రెస్పాన్స్ మామూలుగా ఉండదని అంటున్నారు.

అంతే కాదు మార్చి 4 న ఈ చిత్రానికి సంబంధించిన కంటెంట్ ఒకటి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట. అది పాటనా ?, లేకపోతే సినిమాకు సంబంధించిన టీజర్ నా ? అనేది తెలియాల్సి ఉంది. ట్రైలర్ కి ముందే మేకర్స్ 40 సెకండ్స్ నిడివి ఉన్న ఒక చిన్న బిట్ టీజర్ ని విడుదల చెయ్యాలని అనుకుంటున్నారట . త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు బయటకు రానున్నాయి. మరోపక్క డైరెక్టర్ హరీష్ శంకర్ ప్రొమోషన్స్ కూడా స్టార్ట్ చేసేశాడు. నాన్ స్టాప్ గా రెండు మూడు ఇంటర్వ్యూస్ కూడా ఇచ్చేసాడు. త్వరలోనే ఇవి అందుబాటులోకి రానున్నాయి. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఈ సినిమా మేనియా ఎలా ఉండబోతుంది అనేది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Talliki Vandanam Scheme

Talliki Vandanam Scheme: తల్లికి వందనం అందలేదా.. ఇలా చేయండి!

Talliki Vandanam Scheme: ఏపీ ప్రభుత్వం తల్లికి వందనం పథకం నిధులు విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 65 లక్షల మంది వరకు విద్యార్థుల తల్లుల ఖాతాల్లో పదివేల కోట్ల రూపాయలు జమ కానున్నాయి....
CJP Protests

CJP Protests: సిజెపి ఆందోళనల వెనక ఖలిస్థానీ.. పది కోట్ల ఆఫర్.. వెలుగులోకి కీలక వీడియో

CJP Protests: అనుకున్నదే అయింది. అనుమానిస్తున్నదే జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఊహించిందే చోటుచేసుకుంది. మొత్తానికి కాక్రోచ్ జనతా పార్టీ అసలు బాగోతం బయటపడింది. పేరుకు నీట్ పరీక్షలో అవకతవకులకు పాల్పడిన వ్యక్తులను శిక్షించాలని...
NEET Protest

NEET Protest: నాడు రైతుల ఉద్యమం.. నేడు నీట్ విద్యార్థుల పోరాటం.. నరేంద్ర మోడీ మౌనం అందుకే..

NEET Protest: సరిగ్గా నాలుగు సంవత్సరాల క్రితం కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ చట్టాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతు సంఘాలు ఆందోళన నిర్వహించాయి. ఢిల్లీ సరిహద్దుల్లో తిష్ట వేసుకొని...
Talliki Vandanam:

Talliki Vandanam: తల్లికి వందనం: కూటమి సైలెంట్ వ్యూహం!

Talliki Vandanam: ఏపీలో కూటమి ప్రభుత్వం మరో రికార్డ్ సృష్టించింది. రెండో ఏడాది తల్లికి వందనం సాయం అందజేసింది. దాదాపు 65 లక్షల మంది లబ్ధిదారుల ఖాతాల్లో పదివేల కోట్ల రూపాయలకు పైగా...
Kethireddy Venkatarami Reddy

Kethireddy Venkatarami Reddy: జగన్ ను ఇచ్చి పడేసిన కేతిరెడ్డి.. ఏంటి కథ?!

Kethireddy Venkatarami Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేతల స్వరం మారుతోంది. ఆ పార్టీలో కొందరు నేతలు దూకుడుగా ఉంటారు. దూకుడు వ్యాఖ్యలు చేస్తుంటారు. మరికొందరు ఆలోచనతో మాట్లాడతారు. ఆపై పవర్ఫుల్ గానూ...
Oktelugu Epaper