spot_img
Homeఅంతర్జాతీయంBalochistan Crisis Pakistan: బలూచ్‌ దెబ్బలకు పాకిస్తాన్‌ వీపు వాచిపోయింది.. ఇక కలిసి ఉండడం కష్టమే!

Balochistan Crisis Pakistan: బలూచ్‌ దెబ్బలకు పాకిస్తాన్‌ వీపు వాచిపోయింది.. ఇక కలిసి ఉండడం కష్టమే!

Balochistan Crisis Pakistan: పాకిస్తాన్‌లో అతి పెద్ద రాష్ట్రం.. సుమారు 49 శాతం భూభాగం కలిగిన, రేర్‌ ఎర్త్‌ మినరల్స్‌ ఉన్న, బంగారు నిల్వలు ఉన్న రాష్ట్రం బలూచిస్తాన్‌. దశాబ్దాలుగా ఇక్కడి ప్రజలు, బలూచ్‌ లిబరేషన్‌ ఆర్మీ.. పాకిస్తాన్‌ నుంచి విముక్తి కోసం పోరాడుతున్నాయి. ఈ పోరాటం ఇప్పుడు తుది దశకు చేరింది. ఆపరేషన్‌ హెచాఫ్‌ 2.0 కారణంగా పాకిస్తాన్‌ పాలన బలూచిస్తాన్‌లో దాదాపు కనుమరుగైంది. ప్రభుత్వ ఆదేశాలేవీ ఇక్కడ అమలు కావడం లేదు. మరోవైపు బలూచ్‌ లిబరేషన్‌ ఆర్మీ, ఆత్మాహుతి దళాలు పాకిస్తాన్‌ ప్రభుత్వం ఆస్తులను పెద్ద ఎత్తున ధ్వంసం చేస్తున్నారు. సైనిక స్థావరాలు ధ్వంసం చేస్తున్నారు. ప్రధాన పట్టణాలను స్వాధీనం చేసుకుంటున్నారు.

Also Read: లోకేష్ కు అలా అవకాశం ఇచ్చిన చంద్రబాబు!

ఆపరేషన్‌ హెరాఫ్‌ 2.0..
బలూచ్‌ లిబరేషన్‌ ఆర్మీ (బీఎల్‌ఏ) చేపట్టిన ఆపరేషన్‌ హెరాఫ్‌ 2.0 మంచి ఫలితాలు ఇస్తోంది. దీంతో పాక్‌ పాలన పూర్తిగా బలహీనపడింది. బలూచ్‌లోని కీలక పట్టణాలు అయిన క్వెట్టా, గ్వాదర్, నోష్కీ పట్టణాలు బీఎల్‌ఏ చేతిలోకి వచ్చేశాయి. ఈ మూడు పట్టణాలు పాకిస్తాన్‌కు కీలకమైనవి. అయినా వీటిని బీఎల్‌ఏ స్వాధీనం చేసుకుంది.

రాష్ట్ర రాజధాని క్వెట్టా..
బలూచ్‌ రాష్ట్ర రాజధాని క్వెట్టా చాలా కీకలమైనది. ఇక్కడి నుంచి చాలా ప్రాంతాలకు వెళ్లే రీజనల్‌ జంక్షన్‌. మరో ముఖ్య పట్టణం గ్వాదర్, ఇరాన్‌–ఆఫ్గాన్‌ జంక్షన్‌. మూడో పట్టణం నోష్కీ. ఈ మూడు నగరాలు బీఎల్‌ఏ స్వాధీనంలోకి వచ్చాయి. పాక్‌ సైన్యం వెనుకడుగు వేస్తోంది. రీజనల్‌ కనెక్టివిటీకి కీలకమైన ఈ ప్రాంతాలు ఇరాన్, సౌదీలకు సముద్ర మార్గాలను నియంత్రిస్తాయి. బీఎల్‌ఏ పకడ్బందీ దాడులతో రోడ్లు, రైల్వేలు, కమ్యూనికేషన్‌ వ్యవస్థలను ధ్వంసం చేస్తోంది.

పాకిస్తాన్‌కు కీలకమైన రాష్ట్రం..
బలూచిస్తాన్‌ పాక్‌ ఖనిజ శక్తి 55% కల్పిస్తుంది. క్రోమైట్, కాపర్, గోల్డ్‌ (రెకో డిక్‌లో 5.9 బిలియన్‌ టన్నులు), కోల్‌ (217 మిలియన్‌ టన్నులు) పుష్కలం. చైనా పాకిస్తాన్‌ ఎకనామిక్‌ కారిడార్‌ పెట్టుబడులు గ్వాదర్‌లోనే ఎక్కవ. తాజా ఘర్షణలతో పెట్టుబడిదారులు వెళ్లిపోతున్నారు. ఇక బీఎల్‌ఏ డిజిటల్‌ పోరాటంతో సోషల్‌ మీడియాలో ఫొటోలు, వీడియోలు వైరల్‌ చేస్తూ ప్రజా మద్దతు పెంచుకుంటోంది.

బీఎల్‌ఏ ఏకకాల దాడులు పాక్‌ ఆధిపత్యాన్ని లేకుండా చేస్తున్నాయి. రాజకీయ నాయకుడు అక్తర్‌ మెంగల్‌ ’బలూచిస్తాన్‌ చేజారిపోయింది’ అని ప్రకటించారు. ఇది పాక్‌ విఘటనకు సూచిక. భారత్‌కు పాక్‌ దృష్టి ఆఫ్గన్, బలూచ్‌ సరిహద్దులకు మళ్లడానికి అవకాశం. చైనా ఎకనామిక్‌ కారిడార్‌ ప్రమాదంలో పడింది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Operation Prahaar

Operation Prahaar: ఆపరేషన్ ‘ప్రహార్’.. ఉగ్రవాద అంతంపై మోడీ-షా ల అద్భుత వ్యూహమిదీ

Operation Prahaar: భారతదేశంలో ఉగ్రవాదం ఎప్పుడూ కొత్త సవాలు కాదు. కశ్మీర్‌లో దశాబ్దాలుగా సరిహద్దు ఆవలి నుంచి ప్రోత్సాహం పొందుతున్న ఉగ్రవాదం, పంజాబ్‌లో ఖలిస్తానీ కార్యకలాపాలు, దండకారణ్యంలో నక్సలిజం ఇవన్నీ దేశ భద్రతకు...
Chennai Love Story

Chennai Love Story: ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమాను ఆ మూవీ నుంచి కాపీ చేశారా…ఈ సినిమాలో అసలు...

Chennai Love Story: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనివిని ఎరుగని రీతిలో ఎన్నో ప్రేమ కథ చిత్రాలు వచ్చాయి. ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూ సూపర్ సక్సెస్ గా నిలిచాయి. ఇక ఇలాంటి...
Mega Family

Mega Family: హీరోయిన్ ను పెళ్లి చేసుకోబోతున్న మరో మెగా ఫ్యామిలీ హీరో…

Mega Family: సినిమా ఇండస్ట్రీలో ఉన్న నటీనటులు సినిమాల్లో నటించేటప్పుడు తమ తోటి ఆర్టిస్టులతో చాలా మంచి సాన్నిహిత్యాన్ని మైంటైన్ చేస్తుంటారు. దానివల్ల వాళ్ళకి మరికొన్ని సినిమాల్లో అవకాశాలు...
Balakrishna

Balakrishna: టైర్ వన్ హీరోలు బాలయ్య ను చూసి నేర్చుకోండి….

Balakrishna: నందమూరి నట సింహం బాలయ్య బాబు నుంచి ఒక సినిమా వస్తుందంటే ప్రేక్షకుల్లో విషయమైన అంచనాలు క్రియేట్ అవుతాయి. బాలకృష్ణ మాస్ ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తూ భారీ రికార్డులను బ్రేక్...
Donald Trump

Donald Trump: మరో బాంబు పేల్చిన ట్రంప్‌..

Donald Trump: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ బాధ్యతలు చేపట్టిన తర్వాత అమెరికా ఫస్ట్‌ నినాదంతో ఆ దేశంలో అక్రమంగా ఉంటున్న విదేశీయులను తరిమి కొట్టే పని మొదలు పెట్టారు. తర్వాత...
Oktelugu Epaper