Homeఎంటర్టైన్మెంట్Ustaad Bhagat Singh anthakshari scene: 'ఉస్తాద్ భగత్ సింగ్' లో అంత్యాక్షరి సీన్..? పాపం...

Ustaad Bhagat Singh anthakshari scene: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ లో అంత్యాక్షరి సీన్..? పాపం పవన్ ఫ్యాన్స్ కష్టం పగోడికి కూడా రాకూడదు

Ustaad Bhagat Singh anthakshari scene: ‘ఓజీ’ లాంటి హై స్టాండర్డ్ క్వాలిటీ సినిమాని చూసిన తర్వాత , అభిమానులతో పాటు , ప్రేక్షకులు కూడా పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) నుండి అంతకు మించిన క్వాలిటీ సినిమా కావాలని కోరుకుంటారు. అంత క్వాలిటీ లేకపోయినా , కనీస స్థాయి క్వాలిటీ సినిమా అయినా పవన్ కళ్యాణ్ అందిస్తే అందరు సంతోషిస్తారు . కానీ అలా కాకుండా , మరో 12 సంవత్సరాలు వెనక్కి వెళ్లి […]

Ustaad Bhagat Singh anthakshari scene: ‘ఓజీ’ లాంటి హై స్టాండర్డ్ క్వాలిటీ సినిమాని చూసిన తర్వాత , అభిమానులతో పాటు , ప్రేక్షకులు కూడా పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) నుండి అంతకు మించిన క్వాలిటీ సినిమా కావాలని కోరుకుంటారు. అంత క్వాలిటీ లేకపోయినా , కనీస స్థాయి క్వాలిటీ సినిమా అయినా పవన్ కళ్యాణ్ అందిస్తే అందరు సంతోషిస్తారు . కానీ అలా కాకుండా , మరో 12 సంవత్సరాలు వెనక్కి వెళ్లి పాత కమర్షియల్ సినిమాని అందిస్తే అభిమానులు తట్టుకోగలరా చెప్పండి ?, ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad Bhagat Singh) మూవీ విషయం లో పవన్ అభిమానులకు మింగలేని , కక్కలేని పరిస్థితి. వాళ్ళ పరిస్థితి ని చూసి పగోడికి కూడా ఇలాంటి కష్టం రాకూడదు అంటూ ఇతర హీరోల అభిమానులు కూడా జాలి పడే పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే రీసెంట్ గా ఈ సినిమా నుండి విడుదలైన ‘మెడ ముట్టుకుంటే ..తొడగొట్టినట్టే’ పాట అలాంటిది అన్నమాట.

నాసిరకమైన లిరిక్స్ ని చంద్రబోస్ లాంటి రైటర్ తో రాయించడం , అద్భుతంగా వచ్చింది అంటూ సంబరాలు చేసుకోవడం డైరెక్టర్ హరీష్ శంకర్ కే చెల్లింది. ఈ పాట విన్న తర్వాత సోషల్ మీడియా లో పవన్ కళ్యాణ్ అభిమానులు హరీష్ శంకర్ ని , మూవీ టీం ని ట్యాగ్ చేసి ఒక రేంజ్ లో తిట్టారు. కనీసం ఈ నెగెటివ్ ఫీడ్ బ్యాక్ ని కూడా ఆయన చూడలేదు. ఫ్యాన్స్ , ఆడియన్స్ నుండి బంపర్ రెస్పాన్స్ వచ్చింది అనే భ్రమలో ఉండిపోయాడు హరీష్ శంకర్. ఇది కాసేపు పక్కన పెడితే , హరీష్ శంకర్ ఎంత అవుట్ డేటెడ్ అయిపోయాడు అనేది చెప్పేందుకు ఈ సినిమా నుండి మరో ఆసక్తికరమైన విషయం లీక్ అయ్యింది. అదేమిటంటే 2012 వ సంవత్సరం లో విడుదలై సెన్సేషన్ క్రియేట్ చేసిన ‘గబ్బర్ సింగ్’ సినిమాలో అంత్యాక్షరి సన్నివేశం ఎంత హైలైట్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.

సెకండ్ హాఫ్ ని వేరే లెవెల్ కి తీసుకెళ్లింది ఆ సన్నివేశం. ఈ సినిమాలో సక్సెస్ అయ్యిందని ప్రతీ హీరో అప్పట్లో ఈ సన్నివేశాన్ని అరిగిపోయే రేంజ్ లో రీ క్రియేట్ చేసి జనాలను చావబాదారు. దీంతో అంత్యాక్షరి ట్రెండ్ పైనే ఆడియన్స్ కి చిరాకు కలిగింది. ఇప్పుడు అలాంటి సన్నివేశాన్ని ‘ఉస్తాద్ భగత్ సింగ్’ లో కూడా పెట్టాడట హరీష్ శంకర్ . ఆయనే ఈ ట్రెండ్ కి శ్రీకారం చుట్టి , అవుట్ డేట్ అయిపోయిన అదే సన్నివేశాన్ని మరోసారి తన సినిమా కోసం వాడుతున్నాడు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు , నీ అవుట్ డేటెడ్ ఐడియాలతో ఈ సినిమా ఎలా ఉంటుందో అర్థమై మామూలు ఆడియన్స్ పట్టించుకోవడం మానేశారు. ఇప్పుడు అభిమానులను కూడా థియేటర్ వైపు చూడాలంటే భయపడేలా చేసేలా ఉన్నావ్ అంటూ సోషల్ మీడియా లో విశ్లేషకులు కామెంట్స్ చేస్తున్నారు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper