spot_img
Homeఎంటర్టైన్మెంట్Dhurandhar 2 Allu Arjun update: 'ధురంధర్ 2' కోసం ఐకాన్ స్టార్ అల్లు...

Dhurandhar 2 Allu Arjun update: ‘ధురంధర్ 2’ కోసం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్..ఫ్యాన్స్ కి ఫ్యూజులు ఎగిరే రేంజ్ అప్డేట్!

Dhurandhar 2 Allu Arjun update: వచ్చే నెల 19 వ తారీఖున విడుదల అవ్వబోయే ‘ధురంధర్ 2′(Dhurandhar 2 : The Revenge) చిత్రం కోసం మన తెలుగు ఆడియన్స్ ఎంతలా ఎదురు చూస్తున్నారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. గత అది డిసెంబర్ లో విడుదలైన ‘ధురంధర్’ చిత్రం కేవలం హిందీ వెర్షన్ తోనే 1400 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది . ఈ సినిమాని తెలుగులోకి డబ్ చేస్తే చూడాలని మన ఆడియన్స్ ఎంతగానో కోరుకున్నారు. కానీ సమయం లేకపోవడం తో తెలుగు వెర్షన్ థియేటర్స్ లో విడుదల కాలేదు. రీసెంట్ గానే నెట్ ఫ్లిక్స్ లో తెలుగు వెర్షన్ తో సహా ఇతర ప్రాంతీయ భాషల్లో విడుదల చేశారు. దీనికి మన ఆడియన్స్ నుండి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. ఇది కదరా సినిమా అంటే అంటూ సోషల్ మీడియా లో ప్రతీ ఒక్కరు కామెంట్స్ చేశారు.

అలాంటి క్రేజీ సినిమాకు సీక్వెల్ కాబట్టే ‘ధురంధర్ 2 : ది రివెంజ్’ కోసం మన ఆడియన్స్ అంతలా ఎదురు చూస్తున్నారు. ఒక టాలీవుడ్ స్టార్ హీరో కి సినిమా విడుదలకు ముందు మన తెలుగు ఆడియన్స్ లో ఎంత క్రేజ్ ఉంటుందో , ఈ సినిమాకు కూడా అంతే క్రేజ్ ఉంది. అందుకే సినిమా తెలుగు వెర్షన్ రైట్స్ కోసం మన టాలీవుడ్ కి చెందిన బడా బడా నిర్మాతలు కూడా ఉన్నారు. వారిలో ముఖ్యంగా ముగ్గురు ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ కోసం పోటీ పడుతున్నారు. వాళ్ళు ఎవరెవరంటే గీత ఆర్ట్స్ , అన్నపూర్ణ స్టూడియోస్ , మైత్రీ మూవీ మేకర్స్. ఈ మూడు సంస్థలు ‘ధురంధర్ 2’ తెలుగు వెర్షన్ రైట్స్ కోసం పోటీ పడుతున్నాయ్. ‘మైత్రీ మూవీ మేకర్స్’ నుండి భారీ డీల్ ని ‘ధురంధర్ 2’ మేకర్స్ ముందు పెట్టారు. వాళ్ళకే ఈ సినిమా రైట్స్ ఇక ఖరారు అయిపోబోతుంది అని అంతా అనుకుంటున్న సమయం లో అల్లు అర్జున్(Icon Star Allu Arjun) ఎంట్రీ ఇచ్చాడు.

‘ధురంధర్ 2’ నిర్మాతలతో స్వయంగా ఆయన మాట్లాడి , ఈ సినిమా తెలుగు వెర్షన్ థియేట్రికల్ రైట్స్ ని గీత ఆర్ట్స్ సంస్థకి దక్కేలా చేసాడని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్. అంతే కాదు ఈ సినిమా ప్రొమోషన్స్ కార్యక్రమాల్లో తెలుగు వెర్షన్ వరకు పాల్గొంటానని అల్లు అర్జున్ మాట ఇచ్చాడట . ఆ ఒక్క మాటతోనే గీత ఆర్ట్స్ సంస్థ కి ఈ సినిమా తెలుగు వెర్షన్ థియేట్రికల్ రైట్స్ ని అమ్మేసినట్టు ఇండస్ట్రీ వర్గాల్లో బలంగా ఒక వార్త వినిపిస్తుంది . అయితే గీత ఆర్ట్స్ ఇంతకు ఈ సినిమా రైట్స్ ని కొనుగోలు చేసింది అనేది ప్రస్తుతానికి సస్పెన్స్.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Suvendu Adhikari

Suvendu Adhikari: పశ్చిమ బెంగాల్‌లో అక్రమ వలసలపై సువేందు ఉక్కుపాదం..

Suvendu Adhikari:   గత 45 సంవత్సరాలుగా పశ్చిమ బెంగాల్‌లో అక్రమ వలసదారులకు ఆశ్రయం కల్పించడం, వారికి ఓటు హక్కు, గుర్తింపు పత్రాలు ఇవ్వడం వంటి విధానాలు అమలులో ఉన్నాయని వివరణలు ఉన్నాయి. ఈ...
NTR

NTR: కీలక నిర్ణయం దిశగా జూనియర్ ఎన్టీఆర్!

NTR: తెలుగుదేశంలో చంద్రబాబు తర్వాతే ఎవరూ అంటే మాత్రం చటుక్కున లోకేష్ పేరు వస్తుంది. ప్రస్తుతం ఆయన అనధికార అధినేత తెలుగుదేశం పార్టీకి. పైగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో అన్ని తానై...
Tammineeni Seetharam

Tammineeni Seetharam: ఏపీలో మారిన అరెస్టుల స్టైల్!

Tammineeni Seetharam: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు అరెస్టు భయం వెంటాడుతోంది. ఇప్పటివరకు కూటమి ప్రభుత్వం కేసుల రూపంలో వెంటాడింది. కానీ కొందరు తమ వ్యవహార శైలితో ఏరి కోరి కేసులు తెచ్చుకున్నారు....
Ram Gopal Varma

Ram Gopal Varma: ఆ హీరోను చంపేస్తా…ఆర్జీవీ కి చెప్పిన ఫ్యాక్షనిస్టు…వైరల్ వీడియో…

Ram Gopal Varma: 'శివ' సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీ దశాదిశా మార్చిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ...అప్పటి వరకు తెలుగు సినిమాలు అంటే ఒక మూస ధోరణి కథలతో సాగేవిగా ఉండేవి...కానీ...
YSRCP

YSRCP: వైసీపీలో కాపు నేతల తిరుగుబాటు!

YSRCP: కాపు అస్త్రంతో కూటమిని చీల్చాలని జగన్మోహన్ రెడ్డి భావించారు. ఇప్పుడు అదే కాపు అస్త్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని గుచ్చుకోబోతోంది. కూటమిని ఇరకాటంలో పెట్టేందుకు, కాపు ఓటు బ్యాంకు ను ఆకట్టుకోవడానికి...
Oktelugu Epaper