Homeఎంటర్టైన్మెంట్Ustaad Bhagat Singh advance bookings: హైదరాబాద్ లో మొదలైన 'ఉస్తాద్ భగత్ సింగ్' అడ్వాన్స్...

Ustaad Bhagat Singh advance bookings: హైదరాబాద్ లో మొదలైన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ అడ్వాన్స్ బుకింగ్స్.. వచ్చిన గ్రాస్ ఎంతంటే!

Ustaad Bhagat Singh advance bookings: పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ‘ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad Bhagat Singh) చిత్రం మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రానికి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పటికే ఓవర్సీస్ లో మొదలైంది. కానీ రెస్పాన్స్ చాలా తక్కువగా ఉంది. పవన్ కళ్యాణ్ స్థాయి హీరో కి ఆ గ్రాస్ వసూళ్లు చిల్లరే. కానీ ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ లో మాత్రం ఈ చిత్రానికి అడ్వాన్స్ బుకింగ్స్ భారీ లెవెల్ లోనే జరుగుతున్నాయి. ఇప్పటి వరకు మొదలు పెట్టిన బుకింగ్స్ చాలా లిమిటెడ్ షోస్ వరకే అయినప్పటికీ, అప్పుడే 10 కోట్ల gross వసూళ్లు కేవలం ఈ లిమిటెడ్ షోస్ ద్వారానే వచ్చాయి. హైదరాబాద్ కి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ని నిన్న రాత్రి నుండి మొదలు పెట్టారు. ఇక్కడ మాత్రం సెన్సషనల్ రెస్పాన్స్ వచ్చింది. పవన్ కళ్యాణ్ నైజాం బాక్స్ ఆఫీస్ కి కింగ్ అని అందరూ ఎందుకు పిలుస్తారో ఈ అడ్వాన్స్ బుకింగ్స్ మరోసారి నిరూపించింది.

బుకింగ్స్ ని మొదలు పెట్టిన కాసేపటికే ఈ చిత్రానికి కోటి రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు కేవలం హైదరాబాద్ నుండే నమోదు అవ్వడం విశేషం . అది కూడా కేవలం 140 షోస్ నుండి మాత్రమే. ఈ చిత్రానికి ఆ రేంజ్ అడ్వాన్స్ బుకింగ్స్ జరగడానికి కూడా ఒక కారణం ఉంది. అది ఏమిటంటే టికెట్ రేట్స్ పెంచకపోవడం. తెలంగాణ సర్కార్ ఈ చిత్రానికి టికెట్ రేట్స్ పెంచేందుకు నిరాకరించింది. ఆ కారణం చేత టికెట్స్ హాట్ కేక్స్ లాగా అమ్ముడుపోతున్నాయి. ట్రేడ్ పండితులు అందిస్తున్న విశ్లేషణల ప్రకారం ee చిత్రానికి మొదటి రోజు నైజాం ప్రాంతం నుండి 12 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చే అవకాశం ఉందని. పండగ సెలవులు ఉండడం తో ఈ మార్కుని అందుకోవడం పెద్ద విషయమే కాదని అంటున్నారు విశ్లేషకులు.

Also Read: హీరోలు అభిమానులకు షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడానికి ఇన్ని కారణాలున్నాయా..?

ఇదంతా పక్కన పెడితే ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం చూస్తే ఈ చిత్రానికి మొదటి రోజు 70 నుండి 80 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చే అవకాశం ఉంది. ఓవర్సీస్ ప్రాంతం పెద్ద దెబ్బ వేసింది కానీ, అక్కడ భారీ వసూళ్లు నమోదు అయ్యుంటే మాత్రం కచ్చితంగా ee చిత్రం మొదటి రోజు వంద కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టి ఉండేదానిని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఇక ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వస్తే కచ్చితంగా 300 కోట్ల గ్రాస్ ని అవలీలగా అందుకునే అవకాశం కూడా ఉందని అంటున్నారు. ఎందుకంటే ఒక స్టార్ హీరో కమర్షియల్ సినిమా చేసి చాలా రోజులైంది. ఫ్యామిలీ ఆడియన్స్ స్టార్ హీరోల సినిమాలు చూడడం ఆపేసారు. ఇలాంటి సమయం లో పవన్ కళ్యాణ్ ఇలాంటి మూవీ తో వచ్చాడు, పాజిటివ్ టాక్ వస్తే కచ్చితంగా వేరే లెవెల్ లో వసూళ్లు ఉంటాయని అంటున్నారు ఫ్యాన్స్.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

OG 2 Animation Video

OG 2 Animation Video: ‘ఓజీ 2’ నుండి యానిమేషన్ వీడియో.. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కి ఊహించని...

OG 2 Animation Video: ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో మంచి హైప్ ని క్రియేట్ చేసుకున్న సీక్వెల్స్ లో ఒకటి 'ఓజీ 2'. పవన్ కళ్యాణ్ , సుజిత్ కాంబినేషన్...
KCR And Revanth Reddy

Revanth Reddy And Kcr: వాసాలమర్రి.. కెసిఆర్ వీక్నెస్ తో ఆడుకుంటున్న రేవంత్..

Revanth Reddy And Kcr: భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు.. కెసిఆర్ ఉన్నట్టుండి యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించారు. ఆ జిల్లా పరిధిలో ఉన్న వాసాల మర్రి గ్రామంలో ఒకరోజు మొత్తం...
Siddharth Emotional

Siddharth Emotional: స్టేజి పై వెక్కిళ్లు పెట్టి ఏడ్చేసిన హీరో సిద్దార్థ్..వీడియో వైరల్..అసలు ఏమైందంటే!

Siddharth Emotional: ఒకప్పుడు యూత్ ఆడియన్స్ లో హీరో సిద్దార్థ్ కి ఎలాంటి క్రేజ్ ఉండేదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆరోజుల్లో బాయ్స్, నువ్వొస్తానంటే నేనొద్దంటానా , బొమ్మరిల్లు , కొంచెం ఇష్టం...
Google Employees Protest

Google Employees Protest: ఉద్యోగుల నిరసన.. సుందర్ పిచాయ్ కి వినతి.. ఏఐ వల్ల గూగుల్ లో ఏం...

Google Employees Protest: గూగుల్.. ప్రముఖ సెర్చ్ ఇంజన్ సంస్థ మాత్రమే కాదు.. టెక్నాలజీ.. వినూత్న ఆవిష్కరణలు.. డేటా.. క్లౌడ్ కంప్యూటింగ్.. ఇలా ఎన్నో విభాగాలలో నెంబర్ వన్ సంస్థ. ఈ సంస్థ...
Sun Facts

Sun Facts: ఉదయం నిప్పులు చిమ్మే సూర్యుడు.. రాత్రిపూట ఎక్కడికి వెళ్తాడు..

Sun Facts: ఉదయం సూర్యోదయం అవుతుంది. కాలాలకు అనుగుణంగా సూర్యోదయంలో మార్పులు ఉంటాయి. వేసవికాలంలో అయితే సూర్యుడు తొందరగా ఉదయిస్తుంటాడు. చలికాలం లో అయితే కాస్త ఆలస్యంగా సూర్యోదయం అవుతూ ఉంటుంది. వర్షాకాలంలో...
Oktelugu Epaper