Homeఆంధ్రప్రదేశ్‌AP housing scheme 15 lakh houses: ఏపీలో వచ్చే మూడేళ్లలో 15 లక్షల ఇళ్లు.....

AP housing scheme 15 lakh houses: ఏపీలో వచ్చే మూడేళ్లలో 15 లక్షల ఇళ్లు.. ఒక్కో ఇంటికి రూ.2.39 లక్షలు!

AP housing scheme 15 lakh houses: ఏపీ ప్రభుత్వం( AP government) కీలక నిర్ణయాలు దిశగా అడుగులు వేస్తోంది. ముఖ్యంగా ఎన్నికల హామీలపై దృష్టి పెట్టింది. ప్రతి హామీని నెరవేర్చి ప్రజల అభిమానాన్ని పొందాలని భావిస్తోంది. ఇప్పుడు గృహ నిర్మాణంపై దృష్టి పెట్టింది ఏపీ ప్రభుత్వం. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పేదలందరికీ ఇళ్ల పంపిణీ పై కార్యాచరణ సిద్ధం చేస్తోంది. స్పష్టమైన కాల పరిమితిని పెట్టుకొని పేదల ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని భావిస్తున్నారు సీఎం చంద్రబాబు. ప్రతి మూడు నెలలకు ఒకసారి సామూహిక గృహ ప్రవేశాలు చేసేలా ఒక ప్రణాళిక సిద్ధం చేస్తోంది ఏపీ ప్రభుత్వం. వచ్చే ఉగాది నాటికి అంటే ఏడాది కాలంలో ఐదు లక్షల మంది లబ్ధిదారులకు ఇళ్ల తాళాలు అందించే విధంగా లక్ష్యం నిర్ణయించింది. పెరిగిన గృహ నిర్మాణ భారంతో ఒక్కో యూనిట్ ధరను కూడా పెంచింది. ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వ పరంగా ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ. 1.20 లక్షలు అందిస్తుండగా దానిని..రూ.2.39 లక్షలకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. ఇది నిజంగా నిర్మాణదారులకు గుడ్ న్యూస్.

నెరవేరనున్న హామీ
అర్హులైన పేదలందరికీ ఇళ్లు నిర్మించి ఇస్తామని చంద్రబాబు( CM Chandrababu) హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ పేదలకు శాశ్వత గృహ వసతి కల్పించడమే లక్ష్యమని ఆయన ప్రకటన చేశారు. అయితే ఇప్పుడు ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ 2.0 పథకం కింద మంజూరు అయ్యే ఇంటి యూనిట్ ధరను రూ. 1.20 లక్షల నుంచి రూ. 2.39 లక్షలకు పెంచారు. ఈ మేరకు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో రాష్ట్రంలో గృహ నిర్మాణం వేగవంతం చేసినట్లు అవుతుంది. ఏడాదికి ఐదు లక్షలు అంటే.. వచ్చే మూడేళ్లలో 15 లక్షల ఇళ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇంటి నిర్మాణానికి సంబంధించి అర్హుల నుంచి దరఖాస్తులు కూడా తీసుకున్నారు. ఎట్టకేలకు దీనికి కదలిక వచ్చినట్లు అవుతుంది.

పెరిగిన యూనిట్ ధర..
ప్రజలందరికీ సొంత ఇల్లు నిర్మించాలన్న ప్రణాళికలో భాగంగానే ప్రధానమంత్రి ఆవాస్ యోజన( Prime Minister Aawas Yojana) ప్రవేశపెట్టింది కేంద్ర ప్రభుత్వం. ఈ ఇంటికి సంబంధించి కేంద్ర వాటా రాయితీ కింద రూ.72000.. అంటే 60%.. రాష్ట్ర ప్రభుత్వ వాటా రాయితీ రూ.48,000.. అంటే 40%.. కలిపి మొత్తం రూ.1.20 లక్షలు.. దీనికి జి రామ్ జి కింద 90 రోజుల పని దినాలకు కన్వర్జేన్స్ రూపంలో రూ.27000.. స్వచ్ఛభారత్ మిషన్ కింద రూ.12000… ఎన్ హెచ్ జి లోన్ పై వడ్డీ రాయితీ రూ.80000… కలిపి మొత్తం రూ.2.39 లక్షలు గా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో జమ చేస్తారన్నమాట. మొత్తానికి అయితే ఏపీలో పేదల సొంతింటి కల ఎట్టకేలకు తీరనుందన్నమాట.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Kajal Aggarwal birthday

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
The Odyssey 3 Day Collections

The Odyssey : ‘ది ఒడిస్సీ’ లో క్రేజీ రోల్ ని మిస్ చేసుకున్న మన హీరో.. పెద్ద...

రీసెంట్ గా భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం , బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ వసూళ్ల సునామీ ని సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తుందో మన...
Akhil Lenin Movie Release Date

Lenin Movie : 11వ రోజు ఊహించని రికార్డు నెలకొల్పిన ‘లెనిన్’.. ఇప్పట్లో ఈ సునామీ ఆగేలా లేదు..

Lenin Movie : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన 'లెనిన్' చిత్రం వసూళ్లు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని కైవసం చేసుకున్న...
Team India Bowling

Team India : జింబాబ్వే టూర్ కు టీమిండియా ఇదే.. వాళ్ల మీద మనోళ్ళ రికార్డులు ఎలా ఉన్నాయంటే..

Team India : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలో టి20.. వన్డే సిరీస్ కోల్పోయిన తర్వాత టీమిండియా పూర్తిగా నిరాశలో కూరుకుపోయింది. బౌలింగ్ దారుణంగా ఉంది. బ్యాటింగ్ చెత్తగా ఉంది....
TTD Trust Board Meeting

TTD : చంద్రబాబు జైల్లో చనిపోతే పొట్టేళ్ల విందు.. అటువంటి అధికారికి తిరుమలలో ఏఈఈ పోస్ట్..

TTD : రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తుంటారు. వాళ్లలో వాళ్లకు వ్యూహాలు ఉంటాయి. ఎత్తులు ఉంటాయి. వాటిని చిత్తు చేసే ఎత్తుగడలు కూడా ఉంటాయి. ఇవన్నీ రాజకీయంలో ఒక భాగం. కానీ ఉద్యోగులు...
Oktelugu Epaper