Homeఎంటర్టైన్మెంట్Ustaad Bhagat Singh 4 days collections: 'ఉస్తాద్ భగత్ సింగ్' 4 రోజుల వరల్డ్...

Ustaad Bhagat Singh 4 days collections: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ 4 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ఇంత తక్కువ అసలు ఊహించలేదు!

Ustaad Bhagat Singh 4 days collections: మన టాలీవుడ్ లో మొదటి రోజే 100 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టగలిగే స్టామినా ఉన్న ఇద్దరు ముగ్గురు హీరోలలో ఒకరు పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan). ఆయన గత చిత్రం ‘ఓజీ’ మొదటి రోజు 154 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది. అలాంటి హీరో లేటెస్ట్ సినిమాకు నాలుగు రోజులు పూర్తి అయినప్పటికీ కూడా ఇంకా వంద కోట్ల గ్రాస్ మార్కును అందుకోకపోవడం అంటే ఎంత దురదృష్టకరమో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. పవర్ స్టార్ లాంటి హీరోకి ఇలాంటి పరిస్థితి వస్తుందని అభిమానులు కలలో కూడా ఊహించి ఉండరు. ‘ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad Bhagat Singh) చిత్రానికి అలాంటి దయనీయమైన పరిస్థితి ఏర్పడింది. ఈ చిత్రానికి నాలుగు రోజులకు కలిపి కేవలం 85 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు మాత్రమే వచ్చాయి. దీనిని బట్టీ ఈ సినిమా ఎంత పెద్ద ఘోరమైన డిజాస్టర్ అనేది అర్థం చేసుకోవచ్చు.

ఈ చిత్రం పై అభిమానుల్లో మొదటి నుండి సరైన అభిప్రాయం లేదు. కారణం పాత కాలం కమర్షియల్ మూవీ లాగా అనిపించడం, ఒక్కటంటే ఒక్క పాట కూడా క్లిక్ అవ్వకపోవడమే. ఒక కమర్షియల్ సినిమాకు పాటలు అద్భుతంగా ఉండడం అత్యవసరం. కానీ ఈ చిత్రం లోని పాటలు పదేళ్ల క్రితం లాంటివి లాగా అనిపిస్తాయి. ఓజీ లాంటి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉన్న మూవీ తర్వాత ఇలాంటివి అభిమానులు కలలో కూడా కావాలని కోరుకోరు. ఓజీ కంటే బెటర్ క్వాలిటీ ని ఆశిస్తారు. అదే మొదటి నుండి ‘ఉస్తాద్ భగత్ సింగ్’ లో లోపిస్తూ వచ్చింది. దాని ఫలితమే ఇది. నాలుగు రోజులు పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి ప్రాంతాల వారీగా ఎంత వసూళ్లు వచ్చాయో ఒకసారి చూద్దాం. నైజాం ప్రాంతం లో ఈ చిత్రానికి మొదటి నాలుగు రోజులు కలిపి కేవలం 1444 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే వచ్చింది.

Also Read: ఎన్టీఆర్ కెరియర్ స్టార్టింగ్ లో ఆ స్టార్ డైరెక్టర్ తో సినిమా చేయాలనుకున్నాడా..?

అంటే ‘హరి హర వీరమల్లు’ మొదటి రోజు వసూళ్లతో సమానం అన్నమాట. అదే విధంగా సీడెడ్ ప్రాంతంలో ఈ చిత్రానికి 6 కోట్ల 40 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు, ఉత్తరాంధ్ర ప్రాంతం లో 6 కోట్ల 30 లక్షలు, తూర్పు గోదావరి జిల్లాలో 4 కోట్ల 90 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 3 కోట్ల 40 లక్షలు, గుంటూరు జిల్లాలో 4 కోట్ల రూపాయిలు, కృష్ణా జిల్లాలో 3 ఓట్ల 48 లక్షలు, నెల్లూరు జిల్లాలో కోటి 58 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల నుండి ఈ చిత్రానికి 44 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు రాగా, ఓవరాల్ వరల్డ్ వైడ్ గా 55 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు, 86 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular