Homeఎంటర్టైన్మెంట్NTR Career: ఎన్టీఆర్ కెరియర్ స్టార్టింగ్ లో ఆ స్టార్ డైరెక్టర్ తో సినిమా చేయాలనుకున్నాడా..?

NTR Career: ఎన్టీఆర్ కెరియర్ స్టార్టింగ్ లో ఆ స్టార్ డైరెక్టర్ తో సినిమా చేయాలనుకున్నాడా..?

NTR Career: నందమూరి ఫ్యామిలీ మూడోవతరం హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నటుడు జూనియర్ ఎన్టీఆర్… మొదటి సినిమాతో తడబడినప్పటికి ‘స్టూడెంట్ నెంబర్ వన్’ సినిమాతో భారీ సక్సెస్ ని సాధించాడు. అప్పటినుంచి ఇప్పటివరకు వెనుతిరిగి చూడకుండా వరుస సక్సెస్ లను సాధిస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇక జూనియర్ ఎన్టీఆర్ లాంటి నటుడు ఎలాంటి పాత్రనైనా సరే అలవోకగా చేసి మెప్పించగలుగుతాడు. చిన్నప్పటినుంచే ఆయన క్లాసికల్ డ్యాన్సర్ కావడంతో డ్యాన్స్ లో సైతం వైవిధ్యాన్ని చూపిస్తూ ప్రేక్షకులందరిని […]

NTR Career: నందమూరి ఫ్యామిలీ మూడోవతరం హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నటుడు జూనియర్ ఎన్టీఆర్… మొదటి సినిమాతో తడబడినప్పటికి ‘స్టూడెంట్ నెంబర్ వన్’ సినిమాతో భారీ సక్సెస్ ని సాధించాడు. అప్పటినుంచి ఇప్పటివరకు వెనుతిరిగి చూడకుండా వరుస సక్సెస్ లను సాధిస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇక జూనియర్ ఎన్టీఆర్ లాంటి నటుడు ఎలాంటి పాత్రనైనా సరే అలవోకగా చేసి మెప్పించగలుగుతాడు. చిన్నప్పటినుంచే ఆయన క్లాసికల్ డ్యాన్సర్ కావడంతో డ్యాన్స్ లో సైతం వైవిధ్యాన్ని చూపిస్తూ ప్రేక్షకులందరిని అలరిస్తున్నాడు. ప్రతి పాత్రలో తన మార్కును చూపించే విధంగా తన నటన ఉంటుంది. అందుకే ఆయన సినిమాలంటే ప్రేక్షకులు అమితంగా ఇష్టపడుతుంటారు…ఇక అలాంటి జూనియర్ ఎన్టీఆర్ ఇకమీదట చేయబోతున్న సినిమాల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఇప్పటివరకు ఆయన టాప్ లెవెల్లో ముందుకు దూసుకెళుతున్నప్పటికి పాన్ ఇండియాలో మాత్రం ఆయనకు రావాల్సినంత గుర్తింపు రాలేదు. దాంతో ఇప్పుడు పాన్ ఇండియా మీదనే ఆయన ఎక్కువ ఫోకస్ చేశాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా మీద ఆయన భారీ కసరత్తులైతే చేస్తున్నాడు.

డిఫరెంట్ మేకోవర్ తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు. ఈ సినిమాతో ఎన్టీఆర్ పెను ప్రభంజనాన్ని సృష్టిస్తాడా? లేదా అనేది తెలియాల్సి ఉంది… జూనియర్ ఎన్టీఆర్ కెరియర్ మొదటి నుంచి కూడా తను ఒక స్టార్ డైరెక్టర్ తో సినిమా చేయాలని అనుకుంటున్నాడట.

ఇంతకీ ఆ దర్శకుడు ఎవరు అంటే తమిళ్ స్టార్ డైరెక్టర్ అయిన శంకర్ కావడం విశేషం… ప్రస్తుత శంకర్ అంత మంచి ఫామ్ లో లేడు. కాబట్టి ఇప్పుడు ఆయనతో సినిమా చేయడం కష్టమే కానీ కెరియర్ స్టార్టింగ్ నుంచి అతనితో సినిమా చేయడానికి ఎన్టీఆర్ తీవ్రమైన కసరత్తులైతే చేశారట.

కానీ అది వర్కౌట్ కాలేదు మరి ఇప్పుడు శంకర్ ఎన్టీఆర్ తో సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నప్పటికి ఎన్టీఆర్ ఇప్పుడు ఉన్న బిజీ కమిట్మెంట్ల వల్ల తనతో సినిమా చేసే అవకాశాలైతే లేవు. ఇక దానికి తోడుగా శంకర్ గత సంవత్సరం రామ్ చరణ్ తో చేసిన ‘గేమ్ చేంజర్’ సినిమా డిజాస్టర్ అయింది కాబట్టి అతనితో సినిమా చేయడం కంటే కామ్ గా ఉండడమే బెటర్ అని జూనియర్ ఎన్టీఆర్ భావిస్తున్నారట…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper