Homeఎంటర్టైన్మెంట్Ustaad Bhagat Singh 2 weeks collection: 'ఉస్తాద్ భగత్ సింగ్' 2 వారాల వరల్డ్...

Ustaad Bhagat Singh 2 weeks collection: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ 2 వారాల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ఎట్టకేలకు టార్గెట్ కి అతి చేరువలో..

Ustaad Bhagat Singh 2 weeks collection: ‘ఓజీ'(They Call Him OG) వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) నుండి విడుదలైన ‘ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad Bhagat Singh Movie) చిత్రం , కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ సినిమాకు ఎంత పెద్ద ఫ్లాప్ టాక్ వచ్చినా ఓపెనింగ్స్ తోనే సగానికి పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ ని […]

Ustaad Bhagat Singh 2 weeks collection: ‘ఓజీ'(They Call Him OG) వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) నుండి విడుదలైన ‘ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad Bhagat Singh Movie) చిత్రం , కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ సినిమాకు ఎంత పెద్ద ఫ్లాప్ టాక్ వచ్చినా ఓపెనింగ్స్ తోనే సగానికి పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ ని రీకవర్ చేస్తుంటాడు. అందుకే ఆయన మార్కెట్ హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా, ఇన్ని రోజులు పెరుగుతూనే వచ్చింది కానీ , తగ్గింది లేదు. కానీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం మాత్రం కనీసం ఓపెనింగ్స్ ని కూడా రాబట్టలేకపోయింది. ఫలితంగా 50 శాతం నష్టాలను తెచ్చిపెట్టింది. అయితే ఎట్టకేలకు రెండు వారాల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకున్న ఈ చిత్రం , ప్రాంతాల వారీగా ఎంత షేర్ వసూళ్లను రాబట్టిందో ఒకసారి చూద్దాం.

ఈ చిత్రానికి వచ్చిన ఓపెనింగ్స్ ని చూసి కంగుతిన్న ట్రేడ్ విశ్లేషకులు ఈ సినిమాకు కనీసం క్లోజింగ్ లో 100 కోట్ల గ్రాస్ వసూళ్లు అయినా వస్తుందా ?, ఒక సూపర్ స్టార్ సినిమా ఎంత పెద్ద ఫ్లాప్ అయ్యినప్పటికీ 100 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టడం అనేది సర్వసాధారణం. గత పదేళ్ల నుండి పవన్ కళ్యాణ్ ప్రతీ ఫ్లాప్ సినిమా 120 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టాయి. ‘హరి హర వీరమల్లు’ చిత్రం కూడా దాదాపుగా 130 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ ని రాబట్టింది. అలాంటిది ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి 100 కోట్ల గ్రాస్ కూడా వచ్చే సూచనలు లేవు అనడంతో అభిమానుల్లో తీవ్రమైన అసంతృప్తి నెలకొంది. అయితే ఈ చిత్రం నెమ్మదిగా ఇప్పుడు 100 కోట్ల గ్రాస్ ని అందుకునే దిశగా అడుగులు వేస్తోంది. 2 వారాల్లో దాదాపుగా 98 కోట్ల 50 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది ఈ చిత్రం.

Also Read: ‘ధురంధర్ 2: ది రివెంజ్’ 2 వారాల వరల్డ్ వైడ్ వసూళ్లు..జోరు బాగా తగ్గిపోయిందిగా..

12వ రోజున 40 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు రాగా, 13వ రోజున 45 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు, 14వ రోజున 38 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. రేపు గుడ్ ఫ్రైడే అవ్వడంతో కాస్త మంచి గ్రాస్ నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే విధంగా వీకెండ్ లో కూడా కాస్త డీసెంట్ స్థాయి గ్రాస్ ని ఈ చిత్రం నమోదు చేసుకోగలిగితే, కచ్చితంగా పరువు నిలుస్తుంది. లేదంటే పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఒక మాయని మచ్చ లాగా మిగిలిపోతుంది ఈ చిత్రం. ఇప్పటి వరకు స్టార్ హీరోలలో ఎన్టీఆర్ ‘వార్ 2’ మాత్రమే తెలుగు వెర్షన్ నుండి 100 కోట్ల గ్రాస్ ని రాబట్టలేకపోయింది. మరి ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కూడా అదే కోవలోకి వెళ్లబోతుందా?, లేదా 100 కోట్లు రాబడుతుందా అనేది చూడాలి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper