Homeహెల్త్‌Sleep Talking Causes: నిద్రలో మాట్లాడుతున్నారా..? మీరు జాగ్రత్త పడాల్సిందే!

Sleep Talking Causes: నిద్రలో మాట్లాడుతున్నారా..? మీరు జాగ్రత్త పడాల్సిందే!

Sleep Talking Causes: మానవ ఆరోగ్యానికి నిద్ర చాలా అవసరం. ప్రతిరోజు ఎంతసేపు నిద్రపోయాం అన్నది కాకుండా.. ఎంత ఆరోగ్యంగా నిద్రించామనేది కూడా చాలా ముఖ్యం అని వైద్యులు అంటున్నారు. అయితే కొందరు ఎక్కువసేపు నిద్రపోయినా కూడా కలతతో ఉంటారు. ఇలాంటివారు ఆ తర్వాత మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. అంతేకాకుండా మరికొందరు నిద్రలో మాట్లాడుతూ.. శబ్దాలు చేస్తూ ఉంటారు. ఇది తరచుగా పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంది. కొందరు పెద్దవాళ్లలోనూ ఈ రకమైన పరిస్థితి ఉంటుంది. అయితే అప్పుడప్పుడు ఇలాంటి సమస్య ఉంటే ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కానీ ప్రతిరోజు లేదా గంటల తరబడి ఇలా మాట్లాడడం కూడా ఆరోగ్య సమస్యలు అనుకోవాలి. అసలు ఇలా నిద్రలో మాట్లాడడానికి కారణం ఏంటి? ఈ సమస్య పరిష్కారానికి ఏం చేయాలి..?

నిద్రలో మాట్లాడడాన్ని స్లీప్ టాకింగ్ కా పిలుస్తారు. ఇది సాధారణంగా నిద్రలో తెలియకుండానే మాటలు, శబ్దాలు చేస్తుంటారు. వైద్యుల ప్రకారం ఇది నిద్ర దశల్లో మెదడు పూర్తిగా విశ్రాంతి స్థితిలోకి వెళ్లకపోవడం వల్ల జరుగుతుంది. ఇలాంటి పరిస్థితి రావడానికి అనేక కారణాలు ఉంటాయి. వాటిలో అధికంగా మానసిక ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్, నిద్రలేమి, జ్వరం లేదా అస్వస్థత, మద్యం అధికంగా సేవించడం, అధికంగా అలసిపోవడం, రాత్రి సమయంలో ఎక్కువసేపు మొబైల్ చూడడం వల్ల నిద్రలో శబ్దాలు చేసే అవకాశం ఉంటుంది. తరచుగా ఇది పిల్లల్లో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఉదయం అంతా వారు వివిధ రకాల శబ్దాలు చేస్తుంటారు. అంతేకాకుండా కొత్త కొత్త మనుషులను చూడడం వల్ల వారి మెదడులో ఏర్పడే సంకేతాలే ఈ శబ్దాలకు కారణమని అంటున్నారు.

నిద్రలో మాట్లాడడం ప్రమాదకరమా..? అని కొందరు ఆందోళన చెందుతున్నారు. అయితే ఇది అప్పుడప్పుడు వస్తే ఎలాంటి ప్రమాదం కాదు. కానీ గట్టిగా మాట్లాడడం, కేకలు వేయడం, భయంతో లేచి కూర్చోవడం, నిద్రలో నడవడం వంటి సమస్యలు ఉంటే మాత్రం అనారోగ్యమే అని అంటున్నారు. ఇలాంటి పరిస్థితి ఎక్కువ కాలం కొనసాగితే ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. అయితే ఈ సమస్య నుంచి బయట పడాలంటే కొన్ని చిట్కాలు పాటించాల్సి ఉంటుంది.

ప్రతిరోజు ఒకే సమయంలో నిద్రపోవడం వల్ల ఎలాంటి సమస్యలు ఉండకపోవచ్చు. నిద్రకు ముందు మొబైల్ లేదా టీవీ తగ్గించే ప్రయత్నం చేయాలి. రాత్రి వేళల్లో కాఫీ, టీ తాగడం మానేయాలి. నిద్రపోయే ముందు ధ్యానం, శ్వాస వ్యాయామాలు చేయడం మంచిది. ప్రతిరోజు కనీసం ఏడు నుంచి ఎనిమిది గంటల పాటు నిద్రపోవాలి. మొత్తంగా మెదడుకు ఎక్కువగా విశ్రాంతి ఇస్తే ఎలాంటి ఆలోచనలు లేకుండా ప్రశాంతంగా నిద్రపోగలుగుతారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular