Homeజాతీయ వార్తలుVijay CM Oath Ceremony: త్రిష ఆశల మీద నీళ్లు చల్లిన తమిళనాడు సీఎం విజయ్

Vijay CM Oath Ceremony: త్రిష ఆశల మీద నీళ్లు చల్లిన తమిళనాడు సీఎం విజయ్

Vijay CM Oath Ceremony: తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ప్రమాణ స్వీకారానికి విజయ్ తల్లిదండ్రులు, కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, ఇతర ముఖ్య నేతలు హాజరయ్యారు. ప్రమాణ స్వీకార కార్యక్రమంలో విజయ్ ఉచిత విద్యుత్, మహిళా భద్రత, మాదకద్రవ్యాల నిరోధం వంటి వాటి బిల్లుల మీద కీలకమైన సంతకాలు చేశారు. తద్వారా ప్రజాక్షేమమే తన ప్రధాన కర్తవ్యమని వ్యాఖ్యానించారు. ప్రమాణ స్వీకార కార్యక్రమంలో విజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. […]

Vijay CM Oath Ceremony: తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ప్రమాణ స్వీకారానికి విజయ్ తల్లిదండ్రులు, కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, ఇతర ముఖ్య నేతలు హాజరయ్యారు. ప్రమాణ స్వీకార కార్యక్రమంలో విజయ్ ఉచిత విద్యుత్, మహిళా భద్రత, మాదకద్రవ్యాల నిరోధం వంటి వాటి బిల్లుల మీద కీలకమైన సంతకాలు చేశారు. తద్వారా ప్రజాక్షేమమే తన ప్రధాన కర్తవ్యమని వ్యాఖ్యానించారు.

ప్రమాణ స్వీకార కార్యక్రమంలో విజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అందులో ప్రధానమైనది పవర్ సెంటర్ గురించి. తమిళనాడు ప్రభుత్వంలో తాను ఒక్కడినే పవర్ సెంటర్ గా ఉంటానని.. నా పార్టీలో, ప్రభుత్వంలో మరొక పవర్ సెంటర్ ఉండబోదని విజయ్ వ్యాఖ్యానించాడు. దీంతో విజయ్ చేసిన వ్యాఖ్యలు త్రిష ఆశల మీద నీళ్లు చల్లాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

ఇటీవల త్రిష విజయ్ తో తాను సాగిస్తున్న బంధాన్ని ఓపెన్ గానే బయటపెట్టారు. విజయ్ ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తున్నారు. ఇటీవల ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత విజయ్ కి ఆమె శుభాకాంక్షలు తెలియజేశారు. అంతేకాదు, విజయ్ కి తిరుమల ప్రసాదం కూడా అందించారు. విజయ్ తల్లిదండ్రులతో చాలాసేపు మాట్లాడారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కూడా త్రిష హాజరయ్యారు. అతడు తల్లిదండ్రులతో చాలా సేపు ముచ్చటించారు. త్రిషను విజయ్ తల్లి గట్టిగా ఆలింగనం చేసుకున్నారు..

ప్రమాణస్వీకారం తర్వాత పవర్ సెంటర్ గురించి విజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. విజయ్ ముఖ్య మంత్రి అయిన నేపథ్యంలో.. త్రిష పవర్ సెంటర్ పాత్ర పోషిస్తారని అందరు అనుకున్నారు. కానీ విజయ్ ఆ వ్యాఖ్యలకు ప్రారంభంలోనే చెక్ పెట్టారు. ఫలితంగా త్రిష పాత్ర ఒక స్థాయి వరకే పరిమితం అవుతుందని.. ప్రభుత్వాన్ని, పార్టీని ఆమె ప్రభావితం చేయలేదని స్పష్టం చేశారు. విజయ్ ఆదిలోనే ఇలా మాట్లాడటంతో ఇక త్రిష ఎమ్మెల్యే కాదని.. ఆమె చిరకాల స్వప్నమైన ముఖ్యమంత్రి కూడా కాలేదని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper