Homeక్రీడలుక్రికెట్‌Vaibhav Suryavanshi: ఒరేయ్ వైభవ్.. ఒక్కసారి ఇటు చూడరా..

Vaibhav Suryavanshi: ఒరేయ్ వైభవ్.. ఒక్కసారి ఇటు చూడరా..

Vaibhav Suryavanshi: టీమిండియా తాజా సంచలనం సూర్యవంశీ గురించి మీడియాలో రకరకాల వార్తలు వస్తూనే ఉన్నాయి. ఆ వార్తలు ప్రతి రోజు సంచలనం కలిగిస్తూనే ఉన్నాయి. అయినప్పటికీ అతడి గురించి వార్తలు రాకుండా ఉండడం లేదు. మీడియా అతని మీద ఫోకస్ చేయకుండా ఉండడం లేదు. మీడియాలో అతని గురించి జరుగుతున్న చర్చ మామూలుగా లేదు. అయినప్పటికీ అతని గురించి తెలుసుకోవాలని.. భారతదేశంలో ఉన్న వాళ్ళు మాత్రమే కాదు.. ప్రపంచ దేశంలో ఉన్నవారు సైతం ఆసక్తిని చూపిస్తున్నారు. […]

Vaibhav Suryavanshi: టీమిండియా తాజా సంచలనం సూర్యవంశీ గురించి మీడియాలో రకరకాల వార్తలు వస్తూనే ఉన్నాయి. ఆ వార్తలు ప్రతి రోజు సంచలనం కలిగిస్తూనే ఉన్నాయి. అయినప్పటికీ అతడి గురించి వార్తలు రాకుండా ఉండడం లేదు. మీడియా అతని మీద ఫోకస్ చేయకుండా ఉండడం లేదు. మీడియాలో అతని గురించి జరుగుతున్న చర్చ మామూలుగా లేదు. అయినప్పటికీ అతని గురించి తెలుసుకోవాలని.. భారతదేశంలో ఉన్న వాళ్ళు మాత్రమే కాదు.. ప్రపంచ దేశంలో ఉన్నవారు సైతం ఆసక్తిని చూపిస్తున్నారు.

సూర్య వంశీ కి ఇటీవల జాతీయ జట్టులో చోటు లభించింది. అంతకుముందు జరిగిన ఐపీఎల్ లో అతడు అదరగొట్టాడు. ఆరెంజ్ క్యాప్ దక్కించుకున్నాడు. అయితే సూర్య వంశీ ఆట తీరు మెచ్చిన మేనేజ్మెంట్ అతడికి ఐర్లాండ్ సిరీస్ లో అవకాశం కల్పించింది. కారణం తెలియదు గానీ అతడికి రెండు మ్యాచ్లలో ఆడే అవకాశం లభించలేదు. ఆ సిరీస్ టీమ్ ఇండియా ఓడిపోయింది. ప్రస్తుతం ఇంగ్లాండ్ జట్టుతో టీమిండియా టి20 మ్యాచ్ల సిరీస్ ఆడుతోంది. ఈ సిరీస్ లో కూడా సూర్య వంశీకి చోటు లభించలేదు.

తొలి మ్యాచ్లో సూర్య వంశీ ఎప్పటిలాగే వాటర్ బాయ్ అవతారం ఎత్తాడు. సీనియర్ ప్లేయర్లు ఆడుతుంటే చూస్తూ ఉండిపోయాడు. సంజు శాంసన్ విఫలమవుతున్నప్పటికీ అతడికి మేనేజ్మెంట్ అవకాశాలు ఇస్తూనే ఉంది.. తాజాగా ఇంగ్లాండ్ సిరీస్ లో కూడా అతడికి అవకాశం కల్పించింది. సూర్యవంశీ రిజర్వ్ బెంచుకు మాత్రమే పరిమితమయ్యాడు. ఈ నేపథ్యంలో సూర్య వంశీ మీద రక రకాల కథనాలు మీడియాలో వస్తున్నాయి.

ఇటీవల జరిగిన ఐర్లాండ్ సిరీస్ లో సూర్య వంశీ వాటర్ బాయ్ పాత్రకు మాత్రమే పరిమితమయ్యాడు. ఈ నేపథ్యంలో అతడితో ఫోటో దిగాలని ఓ తెలుగు అభిమాని భావించాడు. అతడిని అనేక సందర్భాల్లో పిలిచినప్పటికీ పలకలేదు..” ఒరేయ్ సూర్య వంశీ ఇటు చూడు.. ఒక ఫోటో తీసుకొని వెళ్ళిపోతాను” అని అతడు అరిచినప్పటికీ సూర్య వంశీ చూడలేదు. సూర్య వంశీ అంటే తనకు అభిమానమని.. అతని గట్టిగా పిలిచింది కూడా ప్రేమతోనేనని.. ఆ తెలుగు అభిమాని క్లారిటీ ఇచ్చాడు. దానికి సంబంధించిన వీడియో అతడు సోషల్ మీడియాలో అందుబాటులో పెట్టాడు. అది కాస్త చర్చకు దారితీస్తోంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper