spot_img
Homeఎంటర్టైన్మెంట్విషాదం: ప్రముఖ హాస్యనటుడు కన్నుమూత

విషాదం: ప్రముఖ హాస్యనటుడు కన్నుమూత

సినీ పరిశ్రమలో మరో విషాదం అలుముకుంది. ఈ మధ్య వరుసగా నటులు, దర్శకులు, సినీ ప్రముఖులు మృత్యువాత పడుతున్నారు. ఇటీవలే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనా కారణంగా అసువులు బాసారు. ఆ విషాదం నుంచి కోలుకోకముందే తాజాగా మరో హాస్యనటుడు కన్నుమూయడం సినీ పరిశ్రమంలో విషాదం నింపింది.

కరొనా వ్యాక్సిన్ తీసుకున్నప్రముఖ తమిళ హాస్యనటుడు వివేక్ కు నిన్న తీవ్రమైన గుండెపోటు వచ్చింది. వెంటనే ఆయనను ఆస్పత్రికి తరలించి ఎక్మో ద్వారా ప్రాణాలు నిలబెట్టేందుకు ప్రయత్నించారు. కానీ అది ఫలించలేదు. ఈరోజు ఉదయం కన్నుమూశారు.

తమిళ సినీ ఇండస్ట్రీలో వివేక్ టాప్ కమెడియన్ గా చాలా కాలంగా ఉన్నారు. డబ్బింగ్ సినిమాల ద్వారా తెలుగులో కూడా పరిచయమే.

అగ్రదర్శకుడు శంకర్ తీసే సినిమాల్లో ఖచ్చితంగా వివేక్ కు కీలక క్యారెక్టర్ ఉంటుంది. మాధవన్ తీసిన ‘రన్’ సినిమా ద్వారా బాగా పేరొచ్చింది. రజినీకాంత్ ‘శివాజీ’ లో ఆయన స్నేహితుడిగా కీలక పాత్రలో వివేక్ నటించారు.రెండు సినిమాల్లో హీరోగానూ చేశారు. ఈ మధ్య హీరోగా పోవడంతో అవకాశాలు తగ్గాయి.

కొద్దిరోజుల క్రితం ధనుష్ హీరోగా వచ్చిన రఘువరన్ బీటెక్ లోనూ వివేక్ కనిపించారు. మళ్లీ సినిమా అవకాశాలు వస్తున్న వేళ హఠాత్తుగా తీవ్రమైన గుండెపోటు రావడంతో అసువులు బాసారు.

2009లో వివేక్ కు కేంద్రప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ఇచ్చి. తమిళనాట బెస్ట్ కమెడియన్ గా ఐదు సార్లు అవార్డు దక్కించుకున్నారు. తమిళనాట ప్రముఖ సేవా కార్యక్రమాల్లోనూ వివేక్ చురుకుగా పాల్గొంటారు. ప్లాస్టిక్ ఫ్రీ ఉద్యమాన్ని నిర్వహిస్తున్నారు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Demolished The Nagalamma Temple

temple pradakshina : దేవాలయాల్లో ప్రదక్షిణలు ఎందుకు.. ఎన్నిసార్లు ప్రదక్షిణలు చేయాలి..

temple pradakshina : చాలామంది దేవాలయాల్లోకి వెళ్లిన తర్వాత కొందరు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. వీరిలో మూడు, 5, 9 సార్లు ప్రదక్షిణలు చేసేవారు ఉంటారు. హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి...
Vaibhav Suryavanshi 94 Runs

Vaibhav Suryavanshi : రికార్డు లెవెల్ లో 50 కొట్టినా.. బుడ్డోడిని ఏడిపించారు.. ఇదేం న్యాయం..

Vaibhav Suryavanshi : వరుసగా ఆరు ఓటముల తర్వాత టీమ్ ఇండియా మళ్లీ విక్టరీ ట్రాక్ ఎక్కింది.. జింబాబ్వే జట్టుతో జరుగుతున్న మూడు టి20 మ్యాచ్ సిరీస్ లో.. తొలి మ్యాచ్లో విజయం...
Men's Mental Health

men’s health : మగవాళ్లు చెప్పుకోలేని ఐదు సమస్యలున్నాయి.. అవేంటో తెలుసా..

men's health : ‘నువ్వు మగాడివి బాస్.. ధైర్యంగా ఉండాలి.. కుటుంబానికి అండగా ఉండాలి..’అని చాలా మంది చెబుతూ ఉంటారు. ఒక కుటుంబంలో ఎవరికి సమస్య వచ్చినా వాటి పరిష్కారానికి తీవ్ర కృషి...

body fat : కొవ్వుతో మెదడుపై ప్రభావం.. ఎలాగో తెలిస్తే షాక్ అవుతారు..

body fat : ప్రస్తుత కాలంలో చాలామంది రకరకాల ఆహారాన్ని తింటూ ఉన్నారు. ముఖ్యంగా ఆయిల్ ఎక్కువగా ఉండే ఫుడ్ తో పాటు ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల శరీరంలో అదనపు...

Wrong Mobile Recharge : తప్పుడు నెంబర్కు రీఛార్జ్ చేశారా.. ఇలా చేస్తే మనీ రిఫండ్..

Wrong Mobile Recharge : మొబైల్ ఉన్న ప్రతి ఒక్కరూ ఇప్పుడు ఎవరికి వారే రీఛార్జ్ చేసుకుంటూ ఉంటున్నారు. అయితే ఈ క్రమంలో ఒక్కోసారి తప్పుడు నెంబర్ పై రీఛార్జ్ అయ్యే అవకాశం...
Oktelugu Epaper