emotional story : కన్నీరే కన్నీరు పెట్టే ఘోరం ఇది. బాధనే బాధ పడే ఉదంతం ఇది. అతడి కథ చదువుతుంటే దుఃఖం ఉబికి వస్తోంది. ఎటువంటి సంబంధం లేకపోయినప్పటికీ వేదన కళ్ళ ముందు కనిపిస్తోంది.. అతడు రాసిన ఒక్కో అక్షరం గుండెను మెలి పెడుతున్నాయి. మనసును కకావికలం చేస్తున్నాయి. ఒక మనిషి ఆవేదన ఈ స్థాయిలో ఉంటుందా.. బతకాలనే కోరిక ఇంత బలంగా ఉంటుందా అనిపిస్తున్నాయి. రెడిట్ లో 21 ఏళ్ళ యువకుడు పెట్టిన పోస్ట్ యావత్ ప్రపంచం మొత్తం కదిలిస్తోంది. కన్నీరు పెట్టిస్తోంది.. ఇంతకీ అందులో ఏముందంటే..
ఆ యువకుడికి 21 సంవత్సరాల వయసు ఉంటుంది. పెద్ద పేగు క్యాన్సర్ సోకడంతో అతడు ఎన్నో ఆసుపత్రులు తిరిగాడు. కుటుంబ సభ్యులు అతనికి వచ్చిన వ్యాధిని నయం చేయించడానికి ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టారు. వైద్యులు కూడా రకరకాలుగా ప్రయత్నించారు. అయినప్పటికీ అతనికి వచ్చిన వ్యాధిని నయం చేయలేకపోయారు. దీంతో అతనికి అంతిమ గడియలు సమీపించాయి. మరి కొద్ది రోజుల్లో అతడు గోడకు వేలాడే ఫోటో కాబోతున్నాడు. తల్లిదండ్రులకు భారమైన జ్ఞాపకంగా మిగిలిపోబోతున్నాడు. అతడు తను అంతిమ రోజులను తలుచుకొని బాధపడుతున్నాడు. కన్నీటి పర్యంతమవుతున్నాడు. జీవితాన్ని అనతి కాలంలోనే కోల్పోతున్న సందర్భాన్ని తలుచుకొని కుమిలిపోతున్నాడు.. తన బాధను వ్యక్తం చేయడానికి అతడు రెడిట్ లో కీలకమైన పోస్ట్ చేశాడు.. అది హృదయాలను బరువెక్కిస్తోంది.
“నాకు 21 సంవత్సరాల వయసు. పెద్దపెగు క్యాన్సర్ సోకింది. ఇక ఈ దీపావళికి నేను భూమి మీద ఉండకపోవచ్చు. ఇప్పటికే దీపావళి సంబరాలు దేశంలో మొదలయ్యాయి. నా పరిస్థితి చూసి మా తల్లిదండ్రులు బాధతో ఉన్నారు. వారిని చూడాలంటేనే ఇబ్బందిగా ఉంది. నాకు కుక్కలను పెంచుకోవడం అంటే చాలా ఇష్టం. ట్రావెలింగ్ అంటే ఆసక్తి. సొంతంగా వ్యాపారం చేయాలని ఆలోచన కూడా ఉంది. ఇకపై ఇవన్నీ మసకబారి పోతాయి. ఎందుకంటే నా అంతిమ రోజులు ఇప్పుడు కనిపిస్తున్నాయి. ఇకపై నేను ఒక జ్ఞాపకంగా మిగిలిపోబోతున్నాను. నా ఫోటో గోడకు వేలాడుతూ ఉంటుంది. అసలు నా బాధను మొత్తం ఇలా ఎందుకు రాస్తున్నానో నాకు అర్థం కావడం లేదు. బహుశా నేను గతించిన తర్వాత ఇవే జ్ఞాపకాలుగా ఉంటాయేమో.. కానీ ప్రతి సందర్భం నాకు అస్పష్టంగా కనిపిస్తోంది. బహుశా భూమి మీద నాకు రూకలు లేవేమో” అని ఆ యువకుడు రాసుకోచ్చాడు. అతని బాధను చూస్తున్న చాలామంది నిర్వేదం వ్యక్తం చేస్తున్నారు. కొందరేమో అద్భుతం జరిగితే బాగుండు అని వ్యాఖ్యానిస్తున్నారు. ఇంకొందరేమో అతని జీవితం ఇలా ముగిసిపోవడం బాధాకరంగా ఉందంటూ కన్నీటి పర్యంతమవుతున్నారు.