Fish Venkat Passed Away: తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు వాళ్ళకంటు ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని సంపాదించుకున్నారు…ఇక హీరోల విషయం పక్కనపెడితే విలక్షణమైన నటులుగా మంచి పేరు సంపాదించుకున్న నటులు కూడా చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళలో ఫిష్ వెంకట్ (Fish Venkat) ఒకరు. 3 వ తరగతి వరకు చదివిన వెంకట్ తన కెరియర్ మొదట్లో ముషీరాబాద్ లో ఫిష్ బిజినెస్ చేసేవాడు. ఇక నటుడు శ్రీహరితో ఉన్న పరిచయం వల్ల ఆయన సినిమా ఇండస్ట్రీ కి వచ్చాడు. ఇండస్ట్రీకి వచ్చాక తన వృత్తినే ఇంటిపేరు గా మార్చుకున్నాడు. వివి వినాయక్ చేసిన ఆది సినిమాలో తొడగొట్టు చిన్న అనే డైలాగ్ తో చాలా ఫేమస్ అయ్యాడు. ఇక ఆ తర్వాత వినాయక్ చేసిన బన్నీ సినిమాలో కామెడీ పాత్రను చేసి నటుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు…ఆ సినిమాతో మంచి పేరు రావడంతో ఆ తర్వాత ఆయన వెనుతిరిగి చూడకుండా వరుస సినిమాలతో కామెడీ ని పండిస్తూ కామెడీ విలన్ గా కూడా రాణించాడు… ఇక ఆయన చాలా రోజుల నుంచి సినిమాల్లో కనిపించడం లేదు. అయితే ఆయన గత కొన్ని రోజులుగా ఆయన కిడ్నీ లివర్ సంబంధించిన అనారోగ్యంతో బాధపడుతున్నాడు. మరి అలాంటి నటుడు నిన్న రాత్రి చందానగర్ లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో తన తదిశ్వాస ను విడిచారు…
Also Read: నువ్వుంటే చాలు అంటూ హీరోయిన్ కోసం అల్లాడిపోతున్న రామ్!
గత కొన్ని రోజులుగా ఆయన ఆరోగ్య పరిస్థితి బాలేదు అంటూ సోషల్ మీడియాలో విపరీతంగా వార్తలు కూడా వచ్చాయి. తన కిడ్నీలు పూర్తిగా చెడిపోవడంతో అతనికి చాలా మంది హీరోలు సహాయం చేయాదానికి ముందుకు వచ్చారు.
కిడ్నీ మార్పిడికి 50 లక్షలు అవుతుంది అని చెప్పినప్పటికీ ఇండస్ట్రీ లో ఉన్న హీరోలు అవి ఇవ్వడానికి సిద్ధమయ్యారు కానీ కిడ్నీ దత్త దొరక్కపోవడంతో ఆయన తిరిగిరాని లోకాలకు అయితే వెళ్లిపోయాడు.ఇక ఫిష్ వెంకట్ మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖుల సంతాపాన్ని తెలియజేస్తున్నారు…
ఇక పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోతో కూడా చాలా మంచి సన్నిహిత సంబంధాలైతే ఏర్పాటు చేసుకున్నాడు. గబ్బర్ సింగ్ (Gabbar Singh) సినిమా సమయంలో పవన్ కళ్యాణ్ తో అతనికి మంచి అనుబంధమైతే ఏర్పడిందట. మరి మొత్తానికైతే ఆయనకు ఆర్థిక సహాయం చేయడానికి చాలామంది హీరోలతో పాటు ప్రభుత్వం కూడా సహకరించినప్పటికి ఆయన ప్రణాళనైతే కాపాడలేకపోయారు…