Top Director in South India: సినిమా ఇండస్ట్రీ అనగానే టాప్ హీరోలు మాత్రమే గుర్తుకొస్తారు. ఇక వాళ్లతో సినిమాలు చేయడానికి టాప్ డైరెక్టర్లు సైతం గొప్ప కథలను రెడీ చేసుకుంటూ సినిమాలు చేయడానికి సిద్ధంగా ఉంటున్నారు… ఇక ఇలాంటి క్రమంలోనే రాజమౌళి లాంటి స్టార్ డైరెక్టర్ పాన్ వరల్డ్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తన వైపు తిప్పుకోవడానికి భారీ సక్సెసుల మీద కన్నేసారు. ప్రస్తుతం స్టార్ డైరెక్టర్స్ సైతం పాన్ ఇండియా నేపథ్యంలో సినిమాలు చేస్తున్నాడు. ఇక సౌత్ సినిమా ఇండస్ట్రీ నుంచి చాలామంది దర్శకులు టాప్ డైరెక్టర్ గా ఎదుగుతున్న విషయం మనకు తెలిసిందే. ఇక ప్రస్తుతం ఎవరు టాప్ పొజిషన్ లో నిలుస్తున్నారు.
రాజమౌళి తర్వాత స్థానాన్ని సంపాదించుకున్న దర్శకుడు ఎవరు అనే విషయం మీదనే చాలా చర్చలైతే నడుస్తున్నాయి… ఇక ప్రస్తుతం ఉన్న దర్శకులలో టాప్ పొజిషన్ లో ఏ దర్శకుడు ఉన్నాడనే విషయాన్ని మనం ఒకసారి తెలుసుకుందాం…
పాన్ ఇండియాలో పెను సంచలనాలను క్రియేట్ చేస్తున్న దర్శకులలో సుకుమార్, సందీప్ రెడ్డి వంగ, నాగ్ అశ్విన్, ప్రశాంత్ నీల్, లోకేష్ కనకరాజ్, నెల్సన్ లాంటి దర్శకులు ఉండడం విశేషం… ఇక ఇప్పటివరకు ఎవరు ఎలాంటి సినిమాలు చేసిన కూడా ఆ సినిమాలు ఆయా హీరోలకు గొప్ప ఇమేజ్ ని తీసుకొచ్చి పెట్టాయి.
సౌత్ లో ఉన్న దర్శకులలో ప్రస్తుతం సుకుమార్ టాప్ పొజిషన్లో ఉన్నాడనే చెప్పాలి. ఆయన చేసిన ‘పుష్ప 2’ సినిమాకి ఇండియా వైడ్ గా భారీ రెస్పాన్స్ దక్కింది. ఇక దాంతో పాటుగా ఈ సినిమా 1950 కోట్లకు పైన కలెక్షన్స్ ను రాబట్టడంతో సుకుమార్ ఒక్కసారి పాన్ ఇండియాలో టాప్ డైరెక్టర్ గా ఎదిగాడు… ఇక ఆయన తర్వాత స్థానం లో ప్రశాంత్ నీల్ ఉన్నాడు. ఆయన చేసిన ‘కేజిఎఫ్ 2’ సినిమాకి 1300 కోట్లకు పైన కలెక్షన్స్ వచ్చాయి. ఇక ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగ, నాగ్ అశ్విన్ ఉండటం విశేషం…