Homeఎంటర్టైన్మెంట్Anand Deverakonda Vaishnavi Chaitanya: 'బేబీ' మూవీ హీరోయిన్ ని పెళ్లాడబోతున్న ఆనంద్ దేవరకొండ..?...

Anand Deverakonda Vaishnavi Chaitanya: ‘బేబీ’ మూవీ హీరోయిన్ ని పెళ్లాడబోతున్న ఆనంద్ దేవరకొండ..? సంచలనం సృష్టిస్తున్న లేటెస్ట్ ఫోటోలు!

Anand Deverakonda Vaishnavi Chaitanya: రీసెంట్ గానే విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) రష్మిక(Rashmika Mandanna) జంట పెళ్లి చేసుకోవడం , అందుకు సంబంధించిన ఫోటోలు , వీడియోలు సోషల్ మీడియా అంతటా బాగా వైరల్ అవ్వడం వంటివి మనమంతా చూస్తూనే ఉన్నాం. ఈ జంటకు సంబంధించిన ఫోటోలను చూసి అభిమానులు ఎంతగానో మురిసిపోతున్నారు. ఒకరి కోసం ఒకరు పుట్టినట్టుగా ఉన్నారు, ఇండియా లోనే మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఎట్టకేలకు 8 ఏళ్ళ సుదీర్ఘ ప్రేమ ప్రస్థానం వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది. ఇదంతా పక్కన పెడితే విజయ్ దేవరకొండ సోదరుడు , ఆనంద్ దేవరకొండ(Anand Devarakonda) కూడా ఒక ప్రముఖ యంగ్ హీరోయిన్ తో ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆ హీరోయిన్ మరెవరో కాదు, షార్ట్ ఫిలిమ్స్ ద్వారా పాపులారిటీ ని సంపాదించుకొని , సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి చిన్న చిన్న క్యారెక్టర్స్ చేస్తూ, ‘బేబీ’ చిత్రం లో హీరోయిన్ గా నటించి ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మారిపోయిన వైష్ణవి చైతన్య(Vaishnavi Chaitanya).

వీళ్లిద్దరు చాలా కాలం నుండి ప్రేమలో ఉన్నట్టు తెలుస్తోంది. రీసెంట్ గా ఆమె ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో అప్లోడ్ చేసిన కొన్ని ఫోటోలు చూసిన తర్వాత , నూటికి నూరు శాతం వీళ్లిద్దరు ప్రేమలోనే ఉన్నారు అనే విషయం నిర్ధారణ అయ్యింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే విజయ్ దేవరకొండ, రష్మిక వివాహానికి మన టాలీవుడ్ కి చెందిన వాళ్ళు హాజరు కాలేదు. ఈ పెళ్ళికి సందీప్ రెడ్డి వంగ వచ్చాడు. అలా విజయ్ దేవరకొండ కుటుంబానికి అత్యంత సన్నిహితంగా ఉండే ఇండస్ట్రీ ప్రముఖులు కొంతమంది వచ్చారు. ఆ ప్రముఖులలో ఒకరు వైష్ణవి చైతన్య. కేవలం పెళ్ళికి హాజరు అవ్వడం మాత్రమే కాకుండా, ఆనంద్ దేవరకొండ తో జంటగా కలిసి విజయ్ దేవరకొండ, రష్మిక జంట తో ఫోటో దిగడం, దానిని ఆమె సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం జరిగింది.

అంటే ఇప్పుడు వాళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నారు, త్వరలో మేమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నాము అనే ఇండికేషన్ ఈ ఫోటో ద్వారా ఇచ్చినట్టు అయ్యింది. ఒక అభిమాని కామెంట్ చేస్తూ ‘తర్వాత జరగబోయేది మీ ఇద్దరి పెళ్లి కదా ‘ అని అనగా, అందుకు వైష్ణవి చైతన్య లైక్ కొట్టింది. దీని అర్థం , అవును మేము రిలేషన్ లోనే ఉన్నాము అని చెప్పడమే కదా అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఆమె ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ ని మీరు కూడా చూసేయండి. ప్రస్తుతం వీళ్లిద్దరు కలిసి ‘ఎపిక్ – ది ఫస్ట్ సెమిస్టర్’ అనే సినిమాలో నటిస్తున్నారు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular