Homeఎంటర్టైన్మెంట్Srinu Vaitla fraud case complaint details: మోసానికి గురైన డైరెక్టర్ శ్రీను వైట్ల.. పోలీస్...

Srinu Vaitla fraud case complaint details: మోసానికి గురైన డైరెక్టర్ శ్రీను వైట్ల.. పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు నమోదు..

Srinu Vaitla fraud case complaint details: సామాన్యులు మాత్రమే కాదు , ఈమధ్య కాలం లో సినీ సెలబ్రిటీలు కూడా మోసాలకు గురి అవుతున్నారు. రీసెంట్ గానే ప్రముఖ డైరెక్టర్ తేజ కుమారుడు పెట్టుబడుల పేరుతో కోట్ల రూపాయిలు ఒక జంట నా చేత ఖర్చు చేయించి మోసం చేసారని పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ప్రముఖ డైరెక్టర్ శ్రీనువైట్ల కూడా ఇలాంటి మోసానికి గురయ్యాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే తెలంగాణ ప్రాంతం లోని వికారాబాద్ జిల్లా పరిధిలో ఒక వ్యవసాయ భూమిని కొనుగోలు చేయడానికి నిందితులు ఒప్పందం చేసుకున్నారట. అందుకోసం శ్రీనువైట్ల సుమారుగా కోటి రూపాయిల వరకు నిందితులకు ఇచ్చారు. అయితే ఈ భూమి చాలా కాలం నుండే వివాదం లో ఉంది, కోర్టు లో దీనిపై విచారణ కూడా జరుగుతోంది. రీసెంట్ గానే ఈ వివాదం పై కోర్టు తుది తీర్పుని ఇస్తూ ఆ భూమి వేరే వ్యక్తులకు చెందినదిగా చెప్పుకొచ్చింది.

ఈ విషయాన్ని తెలుసుకున్న శ్రీను వైట్ల, తానూ కొన్న భూమి నిందితులది కాదని, మోసపోయానని , తనకు ఎలా అయినా న్యాయం చెయ్యాలంటూ శ్రీనువైట్ల హైదరాబాద్ CCS పోలీసులకు ఫిర్యాదు చేశాడు . ఈ మేరకు పోలీసులు కేసు ని నమోదు చేసి దర్యాప్తు మొదలు పెట్టారు. ప్రస్తుత మార్కెట్ వేల్యూ ప్రకారం చూస్తే ఈ భూమి విలువ అక్షరాలా 7 కోట్ల రూపాయిల వరకు ఉంటుందని తెలుస్తోంది. మరి శ్రీనువైట్ల కి పోలీసులు, కోర్టు న్యాయం చేస్తుందా లేదా అనేది చూడాలి. కోటి రూపాయిలు తీసుకున్న నిందితులు ఇప్పుడు కనీసం తనకు స్పందించడం లేదని శ్రీను వైట్ల ఫిర్యాదు లో పేర్కొన్నాడట. ఒక స్థలం కొనుగోలు చేసేటప్పుడు ముందు వెనుక అన్ని విధాలుగా విచారించి కొనుగోలు చెయ్యాలి కానీ , అంత పెద్ద మొత్తం డబ్బులు ఎలా ఇలాంటి వివాదాస్పద భూముల్లో పెట్టగలిగారు అంటూ సోషల్ మిడియా లో నెటిజెన్స్ ప్రశ్నిస్తున్నారు.

Also Read: ‘వారణాసి’ మూవీ కోసం రాజమౌళి రెమ్యూనరేషన్ మళ్ళీ పెంచాడు..జక్కన్న ముందు స్టార్ హీరోలు కూడా పనికిరారుగా…

ఇక శ్రీను వైట్ల కెరీర్ విషయానికి వస్తే, ఒకప్పుడు టాలీవుడ్ లో అందరి స్టార్ హీరోలతో పని చేసి , సెన్సేషనల్ బ్లాక్ బస్టర్స్ ని మన ఆడియన్స్ కి అందించిన శ్రీను వైట్ల, ఇప్పుడు ఫేడ్ అవుట్ స్థాయిలో ఉన్నాడు. ఆయన చివరి చిత్రం గోపీచంద్ తో తీసిన ‘విశ్వం’ కమర్షియల్ గా యావరేజ్ రేంజ్ లో ఆడింది. ఇప్పుడు ప్రస్తుతం ఆయన శర్వానంద్ తో ఒక సినిమా చేయడానికి రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. ఒకప్పుడు స్టార్ హీరోలందరూ శ్రీను వైట్ల తో ఒక్క సినిమా ఛాన్స్ కోసం క్యూలు కట్టేవారు. అలాంటి డైరెక్టర్ కి ఇప్పుడు మీడియం రేంజ్ హీరోలు కూడా అవకాశాలు ఇవ్వడానికి భయపడుతున్నారు. భవిష్యత్తులో అయినా శ్రీను వైట్ల కం బ్యాక్ ఇస్తాడో లేదో చూడాలి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Christopher Nolan

Christopher Nolan: ది గ్రేట్ క్రిస్టోఫర్ నోలన్ కు నచ్చిన భారతీయ దర్శకుడు ఎవరో తెలుసా…

Christopher Nolan: క్రిస్టోఫర్ నోలన్.. ఈ పేరు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతుంది. ప్రముఖ దర్శకుడిగా తనదైన శైలిలో చిత్రాలను ప్రేక్షకులకు అందించాడు. అందులో భాగంగా ఇటీవల విడుదలైన 'ది ఒడిస్సీ'...
Dhanush

Dhanush: విజయ్ సీఎం అయ్యాడని.. అందరూ అయిపోతారా..వీడియో వైరల్

Dhanush: తమిళనాడులో మరో సినిమా నటుడు రాజకీయాల్లోకి వస్తున్నాడా..? అనే చర్చ హాట్ టాపిక్ అయింది. ఇటీవల ప్రముఖ నటుడు ధనుష్ చేసే కొన్ని కార్యక్రమాలను భట్టి చూస్తే ఆయన కూడా త్వరలో...
Nagendra Sai

Nagendra Sai: ఏడాదిలో 13 కొలువులు.. ఈ కడప యువకుడికి ఎలా సాధ్యమైంది.. చేసిన కృషి ఏంటి

Nagendra Sai: ఈ రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ రావడమే కష్టంగా ఉంది.. నోటిఫికేషన్లు వచ్చిన కాంపిటీషన్ చాలా ఎక్కువ. ఈ పరిస్థితులు పోటీపడి కొలువు పుట్టడం అంత సులభం కాదు. లక్షల...
Vaibhav Suryavanshi

Vaibhav Suryavanshi: తెలుగు గడ్డకు.. సూర్య వంశీకి ఏంటి సంబంధం.. వీవీఎస్ లక్ష్మణ్ చెప్పిన నిజం..

Vaibhav Suryavanshi: యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్య వంశీ జింబాబ్వే సిరీస్లో అదరగొట్టాడు. టీ మీడియా సాధించిన విజయాలలో ముఖ్యపాత్ర పోషించాడు. రెండు హాఫ్ సెంచరీలు చేసి అదరగొట్టాడు. తద్వారా తన మీద...
Hydra Ranganath

Hydra Ranganath: హైడ్రా రంగనాథ్ కూడా మనిషే.. అతడికీ కోపం ఉంటుంది..

Hydra Ranganath: ఆవుల వెంకట రంగనాథ్.. అలియాస్ హైడ్రా రంగనాథ్.. గడిచిన రెండు సంవత్సరాలుగా రేవంత్ రెడ్డి కంటే ఎక్కువగా ఈ పేరు తెలంగాణ రాజకీయాలలో వినిపిస్తోంది. ముఖ్యంగా భారత రాష్ట్ర...
Oktelugu Epaper