Homeహాలీవుడ్Met Gala 2024: మెట్ గాలా లో తారల హొయలు

Met Gala 2024: మెట్ గాలా లో తారల హొయలు

Met Gala 2024: కళ్ళు చెదిరిపోయే విద్యుత్ దీపాల వెలుగులు.. ఆ వెలుగుల మధ్యలో దేవకన్యల లాగా అందంగా ముస్తాబైన సినీ తారలు.. వారిని క్లిక్ మనిపించే కెమెరాలు.. ఒకరా, ఇద్దరా.. అందం మొత్తం అక్కడే పోత పోసినట్టు ఉంది. ప్రతి ఏడాది మే మొదటి సోమవారం న్యూయార్క్ లోని మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్ లో మెట్ గాలా నిర్వహిస్తారు.. ఈసారి కూడా అదే స్థాయిలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న చిత్ర పరిశ్రమల నుంచి అందమైన నటీమణులు హాజరయ్యారు. మెట్ గాలా లో ఈసారి “స్లీపింగ్ బ్యూటీస్..రేవాకనింగ్ ఫ్యాషన్ అండ్ డ్రెస్ కోడ్” అనే తీమ్ తో కార్యక్రమం నిర్వహించారు. మెట్ గాలాకు హాజరైన నతీమణుల్లో ఎవరెవరు ఎలాంటి దుస్తులు ధరించారో ఈ కథనంలో తెలుసుకుందాం.

జెన్నీఫర్ లోపేజ్

ఈ హాలీవుడ్ నటిమణి ఈసారి తెలుపు, మేఘం రంగు కలబోసిన దుస్తులను ధరించింది. స్కీయా పరెల్లి అనే పాట వినిపిస్తుండగా.. హొయలు ఒలికిస్తూ అభిమానులను అలరించింది.

jennifer lopez
jennifer lopez

జెండయా..

ఈ హాలీవుడ్ అందం.. అచ్చం నెమలి పించం రంగులను పోలి ఉన్న దుస్తులు ధరించింది. అక్కడక్కడ తన దేహంపై సీతాకోకచిలుకలను (ఆర్టిఫిషియల్) అలంకరించుకుంది.

 

zendaya
zendaya

కార్డ్ బీ టల్లే

నలుపు రంగు కలిగిన గౌన్ ధరించింది. ఆ డ్రెస్ చూసేందుకు భారీ ట్రైన్ ను తలపించింది. డ్రెస్ కు తగ్గట్టే ఆమె ఆభరణాలు ధరించింది. తలకు తలపాగా చుట్టుకుంది.

Cardi-B

కిమ్ కర్దాషియాన్

భుజాల వరకు లంపి గ్రే స్వెట్టర్ వేసుకుంది. మై సన్ మార్గిలా లీఫ్ తో అలంకరించిన సిల్వర్ కలర్ కార్సెట్ ను ధరించి దేవత లాగా మెరిసిపోయింది.

Kim-Kardashian

క్రిస్ హెమ్ వర్త్

ఈ హాలీవుడ్ అందగాడు తెలుపు, గోధుమ రంగులో ఉన్న ట్రామ్ ఫోర్డ్ సూట్ వేసుకొని ఆకట్టుకున్నాడు. హెయిర్ స్టైల్ కూడా ఆ డ్రెస్ కు తగ్గట్టే ఉంది.

Chris-Hemsworth

పెనో లోప్ క్రజ్

నలుపు, నీలం రంగు కలబోతతో రూపొందించిన గౌన్ ధరించి ఆకట్టుకుంది. దానిపై తెలుపు రంగు ఎంబ్రాయిడరీ సరికొత్త అందాన్ని తీసుకొచ్చింది.

Pene-lope-Cruz

సెరేనా విలియమ్స్

ఈ వెటరన్ టెన్నిస్ దిగ్గజం మెటాలిక్ గోల్డ్ కలర్లో షోల్డర్ స్టేట్మెంట్ ను డ్రెస్ ధరించి ఆకట్టుకుంది. రెండు చేతులకు హాఫ్ హ్యాండ్ బ్లాక్ గ్లవ్స్ ధరించింది.

సారా జెస్సికా పార్కర్

అద్భుతమైన శిల్పాలు పొదిగినట్టుగా ఉన్న తెలుపు రంగు గౌన్ ధరించి అలరించింది.

Sarah-Jessica-Parker

ఆరియానా గ్రాండే

తెలుపు రంగు స్లీవ్ లెస్ గౌన్ తో అభిమానులను అలరించింది. తన రెండు కనురెప్పలపై త్రీడీలో రూపొందించిన రెక్కలను జతచేసుకుంది.

Ariana-Grande

ఆషర్

నల్లటి బ్రూచ్ ధరించి ఆకట్టుకున్నాడు. చేతిలో గులాబీ పువ్వుతో అలరించాడు. తలపై క్యాప్ ధరించి సిసలైన రోమన్ లాగా దర్శనమిచ్చాడు.

Usher

అయ్యో ఎడబెరి

ఈ అమెరికన్ హాస్యనటి తన ఒంటిపై పూల తోటను ప్రదర్శించింది. అందమైన పూలను ఎంబ్రాయిడరింగ్ చేసిన డ్రెస్ ధరించి అభిమానులను సమ్మోహనులను చేసింది.

డ్యూ యా లిపా

“రాక్ ఎన్ రోల్” మాదిరి నలుపు రంగు డ్రెస్ ధరించి అదరగొట్టింది. మధ్య మధ్యలో మెరిసిపోతున్న చంకీలు ఆమెకు సరికొత్త అందాన్ని తీసుకొచ్చాయి.

డేమి మూర్ హరీస్

నలుపు, గులాబీ రంగుతో రూపొందించిన దుస్తులను ధరించింది. ఆ దుస్తులకు రెక్కలను రూపొందించుకొని.. మరింతగా ఆకట్టుకుంది.

కెండల్ జన్నర్

నలుపు రంగు డ్రెస్సులో ఆకట్టుకుంది. ఈ గీవెన్చి లుక్ ఆమెను మరో స్థాయికి తీసుకెళ్లింది.

ఆలియా భట్

సంక్లిష్టంగా అల్లిన చిన్న చిన్న జడలతో ఆలియా ఆకట్టుకుంది. గార్డెనింగ్ థీమ్ లో భాగంగా ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించి అలరించింది. ఈ ఫోటోలను తన ఇన్ స్టా ద్వారా అభిమానులతో పంచుకుంది.

alia bhatt
alia bhatt

సుధా రెడ్డి

మెఘా కంపెనీ గ్రూప్ డైరెక్టర్ సుధా రెడ్డి మెట్ గాలాలో సందడి చేశారు. అత్యంత విలువైన “అమోర్ ఎటర్నో” రకానికి చెందిన180 క్యారెట్ల డైమండ్ నెక్లెస్ ధరించి ఆకట్టుకున్నారు. భారతీయ సంస్కృతి ని ప్రతిబింబించేలా ఆమె డ్రెస్ వేసుకున్నారు.

ఈషా అంబానీ

ముఖేష్ అంబానీ కూతురు ఈషా అంబానీ కూడా మెట్ గాలా లో మెరిసింది. గార్డెన్ థీమ్ ను ప్రతిబింబించే విధంగా గౌన్ వేసుకొని అలరించింది. లేత ఆకుపచ్చ రంగులో ఉన్న ఆ గౌను పై అక్కడక్కడ త్రీడీలో రూపొందించిన సీతాకోకచిలుకలు, వివిధ రకాల పుష్పాల చిత్రాలు ఆకట్టుకున్నాయి.

Esha Ambani
Esha Ambani
Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular