Homeఅంతర్జాతీయంEpstein Files revelations impact: ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌ ప్రకంపనలు.. రాజీనామా బాటలో దిగ్గజాలు

Epstein Files revelations impact: ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌ ప్రకంపనలు.. రాజీనామా బాటలో దిగ్గజాలు

Epstein Files revelations impact: జెఫ్రీ ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌తో ప్రపంచ వ్యాప్తంగా వ్యాపారులు, రాజకీయ నాయకులు, దేశాల అధ్యక్షులు, కంపెనీల అధినేతలు వణికిపోతున్నారు. ఎప్పుడు ఎవరి బాగోతం బయట పడుతుందో అర్థం కాని పరిస్థితి. ఇప్పటికే మైక్రోసాఫ్ట్‌ అధినేత బిల్‌గేట్స్‌ ఇప్పటికే తప్పు అంగీకరించాడు. ఇక డొనాల్డ్‌ ట్రంప్‌ కూడా ఇందులో ఉన్నాడు. అయితే తాజాగా బయటపడిన ఈ ఫైల్స్‌ కారణంగా పలు కంపెనీల దిగ్గజాలు కూడా ఉన్నారు. వీరు రాజీనామా బాట పడుతున్నారు. తాజాగా వరల్డ్‌ […]

Epstein Files revelations impact: జెఫ్రీ ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌తో ప్రపంచ వ్యాప్తంగా వ్యాపారులు, రాజకీయ నాయకులు, దేశాల అధ్యక్షులు, కంపెనీల అధినేతలు వణికిపోతున్నారు. ఎప్పుడు ఎవరి బాగోతం బయట పడుతుందో అర్థం కాని పరిస్థితి. ఇప్పటికే మైక్రోసాఫ్ట్‌ అధినేత బిల్‌గేట్స్‌ ఇప్పటికే తప్పు అంగీకరించాడు. ఇక డొనాల్డ్‌ ట్రంప్‌ కూడా ఇందులో ఉన్నాడు. అయితే తాజాగా బయటపడిన ఈ ఫైల్స్‌ కారణంగా పలు కంపెనీల దిగ్గజాలు కూడా ఉన్నారు. వీరు రాజీనామా బాట పడుతున్నారు. తాజాగా వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం (డబ్ల్యూఈఎఫ్‌) సీఈవో బోర్జ్‌ బ్రెండే తన పదవికి రాజీనామా చేశారు, దవోస్‌ సమ్మిట్‌ల సంస్థకు ఇది భారీ దెబ్బ. హార్వర్డ్‌ యూనివర్సిటీ మాజీ అధ్యక్షుడు లారెన్స్‌ సమ్మర్స్, నోబెల్‌ బహుమతి విజేత రిచర్డ్‌ ఆక్సెల్‌ కూడా బాధ్యతల నుంచి వైదొలిగారు. ఈ ముగ్గురూ ఎప్‌స్టీన్‌ ఈవెంట్స్‌లో పాల్గొన్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

వీళ్లు కూడా రాజీనామా..
వాల్‌ స్ట్రీట్‌ జెయింట్‌ గోల్డ్‌మన్‌ సాక్స్‌లో చట్టపరమైన విభాగం హెడ్‌ క్యాథీ రూమ్లెర్, హయాత్‌ హోటల్స్‌ వారసుడు థామస్‌ ప్రిట్‌జ్కర్‌ తమ స్థానాలు వదులుకున్నారు. గ్లోబల్‌ పోర్ట్‌ ఆపరేటర్‌ డీపీ వరల్డ్‌ చైర్మన్‌ సుల్తాన్‌ అహ్మద్‌ బిన్‌ సులాయెం, నార్వే అంబాసిడర్‌ మోనా జుహానీ కూడా రాజీనామా చేశారు. ఈ లిస్ట్‌ రోజుకొకకొనసాగుతోంది, ఫైనాన్షియల్‌ మార్కెట్లలో అనిశ్చితి పెరుగుతోంది.

Also Read: పెప్పుడు కుక్క అని ముద్దు చేసింది.. కాళ్లు చేతులు కోల్పోయింది!

ఎప్‌స్టీన్‌ నెట్‌వర్క్‌ నేపథ్యం
ఎప్‌స్టీన్‌ డాక్యుమెంట్స్‌లో 170+ ప్రముఖుల పేర్లు వచ్చాయి. ఇందులో పాలిటీషియన్లు, బిజినెస్‌ టైకూన్లు, సైంటిస్టులు ఉన్నారు. ఈ ఆరోపణలు సెక్సువల్‌ ట్రాఫికింగ్, ఇన్‌ఫ్లుయెన్స్‌ ఫెడ్లింగ్‌కు సంబంధించినవి. ఫైనల్‌ కోర్ట్‌ ఆర్డర్‌తో ఈ ఫైల్స్‌ పబ్లిక్‌ డొమైన్‌లోకి వచ్చాయి, సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

ఈ రాజీనామాలు #MeToo ఉద్యమం తర్వాత ఎలైట్‌ అకౌంటబిలిటీకి కొత్త ఎపాక్‌ను ప్రారంభిస్తున్నాయి. డబ్ల్యూఈఎఫ్‌ విశ్వసనీయత క్షీణించడంతో గ్లోబల్‌ పాలసీ చర్చలు ప్రభావితమవుతాయి. హార్వర్డ్‌లో నాయకత్వ షేకప్‌ విద్యా రంగంలో పరిణామాలకు దారితీస్తుంది. ఫైనాన్షియల్‌ రంగంలో గోల్డ్‌మన్‌ సాక్స్‌ షేర్లు 5 శాతం పడిపోయాయి, మార్కెట్‌ అనిశ్చితి పెరిగింది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper