Homeఎంటర్టైన్మెంట్Tollywood Star Heroines: స్టార్ హీరోయిన్ గా వెలుగొంది.. క‌నుమ‌రుగైపోయిన భామ‌లు వీరే..

Tollywood Star Heroines: స్టార్ హీరోయిన్ గా వెలుగొంది.. క‌నుమ‌రుగైపోయిన భామ‌లు వీరే..

Tollywood Star Heroines: సినిమా రంగంలో చాలామంది త‌మ టైమ్ వ‌చ్చిన‌ప్పుడు ఓ వెలుగు వెలుగుతారు. అదే ఛాన్సులు రాక‌పోతే క‌నుమ‌రుగైపోతారు. ఇలా క‌నుమ‌రుగైపోయిన వారిలో ఎక్కువ‌గా హీరోయిన్లే ఉంటారు. మ‌రి టాలీవుడ్ లో స్టార్ స్టేట‌స్ వ‌చ్చిన త‌ర్వాత క‌నుమ‌రుగైపోయిన వారెవ‌రో ఇప్పుడు చూద్దాం. ఇలా చూసుకుంటే ఓ ప‌ది మంది వ‌ర‌కు ఉన్నారు.

నాగార్జున హీరోగా రాఘవేంద్ర రావు ద‌ర్శ‌కత్వంలో వ‌చ్చిన మూవీ మ‌న్మ‌థుడు. ఈ మూవీ ప్లాష్ బ్యాక్‌లో అల‌రించిన అన్షు ఆ త‌ర్వాత మాత్రం క‌నిపించ‌కుండా పోయింది.

Tollywood Star Heroines
Tollywood Star Heroine Anshu

ఇక మ‌న్యం పులి, గోవిందుడు అందరివాడేలే, రామాచారి, ఆనంద్ లాంటి సినిమాల‌తో మంచి గుర్తింపు తెచ్చుకుంది కమలినీ ముఖర్జీ. ఇప్పుడు ఆమె ఇండ‌స్ట్రీకి దూరంగా ఉంటుంది. ఎక్క‌డ ఉంటుందో కూడా తెలియ‌దు.

Tollywood Star Heroines
Kamalinee Mukherjee

యువసేన, వీడు మామూలోడు కాదు, విజేత 2007 లాంటి సినిమాల‌తో పేరు తెచ్చుకున్న పెండ్లి త‌ర్వాత మాత్రం సినిమాలకు దూరమయింది.

రాంబాబు గాడి పెళ్లాం, భద్రాది, మ‌నీ మనీ మోర్ మనీ సినిమాల‌తో గుర్తింపు తెచ్చుకుంది గ‌జాల‌. ఈమె స్టూడెంట్ నెంబ‌ర్ 1 సినిమాలో కూడా న‌టించింది. కానీ ఆ త‌ర్వాత వెండి తెరకు పూర్తిగా దూరమైపోయింది.

Tollywood Star Heroines
Gajala

అందరివాడు, జగపతి, ఆంధ్రావాలా, నిజం లాంటి సినిమాల‌తో స్టార్ హీరోయిన్ మారిన రక్షిత.. పెండ్లి త‌ర్వాత సినిమాల‌కు దూరంగా ఉంటుంది.

Tollywood Star Heroines
Rakshita

అల్లాడిస్తా, నీకు నాకు, ఒక్కడు చాలు వంటి మూవీల‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ రంభ‌. ఈమె 90వ దశకంలో స్టార్ హీరోయిన్ గా వెలుగొందింది. కానీ పెండ్లి త‌ర్వాత మాత్రం ఇండ‌స్ట్రీకి దూరంగా ఉంటుంది.

Tollywood Star Heroines
Ramba

బంగారం, చిత్రం సినిమాల‌తో ఆద‌ర‌ణ తెచ్చుకుంది రీమా సేన్. కానీ ప్ర‌స్తుతం ఆమె వెండితెర‌కు దూరంగా ఉంటుంది.

Tollywood Star Heroines
Reema Sen

హ్యాపీడేస్, చిన్ని చిన్ని ఆశలు నాలో రేగెనే, మిస్టర్ మన్మథ, దూకుడు సినిమాల్లో న‌టించి ప‌ర్వాలేద‌నిపించుకుంది సోనియా దీప్తి. కానీ ఆ త‌ర్వాత మాత్రం సిని ఇండ‌స్ట్రీకి దూర‌మైంది.

Tollywood Star Heroines
Sonia Deepti

చెప్పవే చిరుగాలి, ధర్మ లాంటి సినిమాల‌తో అషిమా భల్లా మంచి గుర్తింపు తెచ్చుకుంది. కానీ స‌డెన్ గా ఆమె వెండితెర‌కు దూర‌మైంది.

Tollywood Star Heroines
Ashima Bhalla
Mallesh
Malleshhttps://oktelugu.com/
Mallesh is a Political Content Writer Exclusively writes on Telugu Politics. He has very good experience in writing Political News and celebrity updates.
RELATED ARTICLES

Most Popular