Homeఎంటర్టైన్మెంట్RRR New Party: 'ఆర్ఆర్ఆర్' కొత్త పార్టీ.. ఎన్టీఆర్ పై త్రివిక్రమ్ షాకింగ్ కామెంట్స్...

RRR New Party: ‘ఆర్ఆర్ఆర్’ కొత్త పార్టీ.. ఎన్టీఆర్ పై త్రివిక్రమ్ షాకింగ్ కామెంట్స్ !

RRR New Party: ‘ఆర్ఆర్ఆర్’ సృష్టిస్తున్న రికార్డుల దెబ్బకు సినీ లోకమంతా.. సంతోషంతో సంబరాలు జరుపుకుంటోంది. ముఖ్యంగా ‘ఆర్ఆర్ఆర్’ టీం పార్టీలు చేసుకుంటుంది. ఈ నేపథ్యంలో తాజాగా నిన్న నైట్ ఈ చిత్ర యూనిట్ సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించింది. ఈ వేడుకకు రాజమౌళితో పాటు ఎన్టీఆర్, రామ్ చరణ్, అలాగే స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ తో సహా మిగతా ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ సభ్యులు అంతా హాజరై ఆర్ఆర్ఆర్ విజయాన్ని ఆస్వాదించారు.

RRR New Party
RRR New Party

ప్రస్తుతం ఈ పార్టీ ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ప్రపంచ సినీ లోకాన్ని ‘ఆర్ఆర్ఆర్’ భారీ స్థాయిలో ఓ ఊపు ఊపేస్తోందని.. కలెక్షన్ల విషయంలో సునామీ సృష్టిస్తోందని.. తెలుగు సినిమా ఖ్యాతిని దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ స్థాయిలో ఈ చిత్రం నిలబెట్టింది అని త్రివిక్రమ్ పార్టీలో రాజమౌళి గురించి మాట్లాడినట్లు తెలుస్తోంది.

RRR New Party
RRR Team Party

అలాగే త్రివిక్రమ్.. ఎన్టీఆర్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఎన్టీఆర్ లా నటించగలిగే నటుడు ప్రస్తుత జనరేషన్ లో దేశంలోనే లేరని త్రివిక్రమ్ అన్నారు. ఎన్టీఆర్ నటనకి ఎవరైనా దాసోహం అవ్వాల్సిందే అని త్రివిక్రమ్ అన్నారు. ఏది ఏమైనా ఒక సౌత్ సినిమా కేవలం పది రోజుల్లోనే రూ.900 కోట్ల గ్రాస్ సాధిస్తోందని ఏ నిర్మాత కలలో కూడా ఊహించలేదు. పైగా నేటితో ఈ చిత్రం రూ.1000 కోట్ల మార్క్ ను కూడా దాటేస్తోంది.

RRR New Party
RRR New Party

ఇప్పటికే నిర్మాత దిల్ రాజు ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ కు హైదరాబాద్ లో గ్రాండ్ గా ఓ పార్టీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ పార్టీకి చరణ్, ఎన్టీఆర్ సతీసమేతంగా రావడం విశేషం.

RRR New Party
RRR Team

Also Read: పుట్టినరోజుకు అందాల ఆరబోత.. హాట్ యాంకర్ రచ్చ !

అలాగే రాజమౌళి పార్టీకి రాజమౌళితో పాటు ‘ఆర్ఆర్ఆర్’ యూనిట్ సభ్యులందరూ హాజరయ్యారు. ఈ పార్టీలో కూడా ఆసక్తికర సంఘటన జరిగింది. ఈ పార్టీలో రాజమౌళి అదిరిపోయే స్టెప్ లు వేశారు.

RRR New Party
Rajamouli, Ramcharan and NTR

డైరెక్టర్ అనిల్ రావిపూడితో కలిసి రాజమౌళి ‘నాటు నాటు’ సాంగ్ కి డాన్స్ చేసి ఆశ్చర్యపరిచారు. రాజమౌళి స్టెప్స్ చూసి ఎన్టీఆర్ తో సహా అక్కడున్న వారంతా చప్పట్లు కొడుతూ తెగ సంబర పడిపోయారు. సోషల్ మీడియాలో ఈ వీడియో తెగ వైరల్ అయ్యింది. ప్రస్తుతం నిన్న రాత్రి జరిగిన పార్టీకి సంబంధించి ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

Also Read: పవన్ ఫ్యాన్స్ కు శుభవార్త.. దసరాకి మళ్లీ జాతరే !

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

3 COMMENTS

  1. […] Pawan Kalyan- Bandla Ganesh: పవర్ స్టార్ ప‌వ‌న్ కళ్యాణ్ కు తాను పరమభక్తుడిని అని సగర్వంగా చాటి చెప్పుకునే నిర్మాత బండ్ల గ‌ణేష్, ప్రస్తుతం పవర్ స్టార్ ఫోటోలు పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా షూటింగ్ మళ్లీ మొదలైంది. పవన్ కళ్యాణ్ సెట్స్లో కసరత్తులు చేస్తూ కనిపించారు. […]

Comments are closed.

RELATED ARTICLES

Most Popular