Homeఎంటర్టైన్మెంట్Namrata Mahesh Birthday : నేడు నమ్రత బర్త్ డే... మహేష్ కంటే వయసులో ఆమె...

Namrata Mahesh Birthday : నేడు నమ్రత బర్త్ డే… మహేష్ కంటే వయసులో ఆమె ఎంత పెద్దదో తెలుసా?

Namrata Mahesh Birthday : మహేష్ బెటర్ హాఫ్ నమ్రత శిరోద్కర్ బర్త్ డే నేడు. 1972 జనవరి 22న జన్మించిన ఆమె 51వ ఏట అడుగు పెట్టారు. ఈ సందర్భంగా మహేష్ ఆమెకు స్పెషల్ బర్త్ డే విషెస్ తెలియజేశారు. హ్యాపీ బర్త్ డే ఎన్ ఎస్ జి. పరిస్థితులు చక్కబెట్టి నా సక్సెస్ లో భాగమైన నీకు ధన్యవాదాలు, అని కామెంట్ చేశాడు. తన సక్సెస్ ఫుల్ కెరీర్లో నమ్రతకు మహేష్ క్రెడిట్ ఇచ్చారు. ఆమె కారణంగానే ఉన్నత శిఖరాలకు చేరుకున్నట్లు అభివర్ణించాడు. ఇక నమ్రతను ఆయన షార్ట్ కట్ లో ఎన్ ఎస్ జి అని పిలిచారు. మహేష్ ఇంట్లో ముద్దుగా భార్య నమ్రతను అలానే పిలుస్తారేమో.

ఆసక్తికర విషయం ఏమిటంటే నమ్రత వయసులో మహేష్ కంటే పెద్దది. 1975లో జన్మించిన మహేష్ వయసు 47 మాత్రమే. దాదాపు నాలుగేళ్లు ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఉంది. సాధారణంగా భార్య కంటే భర్త వయసు ఎక్కువగా ఉంటుంది. నమ్రత-మహేష్ విషయంలో అది ఉల్టా అయ్యింది. ప్రేమ వివాహం కావడంతో అవేమీ పరిగణలోకి తీసుకోకుండా ఒక్కటయ్యారు.

ఇక సినిమాకు మించిన నాటకీయత మహేష్-నమ్రతల లవ్ స్టోరీలో ఉంది. దర్శకుడు బి గోపాల్ వంశీ చిత్రంలో మహేష్ కి జంటగా నమ్రతను ఎంపిక చేశారు. ఆ చిత్ర షూట్లో ఇద్దరి మనసులు కలిశాయి. వంశీ చివరి షెడ్యూల్ కోసం యూనిట్ విదేశాలకు వెళ్లారు. పాటలు చిత్రీకరిస్తున్నారు. ఇద్దరికీ ఒకరిపై మరొకరికి లవ్ ఉంది. అది ఎలా బయట పెట్టాలో తెలియని పరిస్థితి.

షూటింగ్ చివరి రోజు ధైర్యం చేసి మహేష్ మనసులో మాట నమ్రతకు చెప్పేశాడట. అప్పటికే మహేష్ ని మనసు నిండా నింపుకొని ఆరాధిస్తున్న నమ్రత ఎస్ చెప్పేసిందట. 2000లో వీరి లవ్ స్టోరీ మొదలైంది. ఐదేళ్లు రహస్యంగా ప్రేమించుకున్నారు. 2005 ఫిబ్రవరి 10న మహేష్-నమ్రత అత్యంత సన్నిహితుల మధ్య నిరాడంబరంగా వివాహం చేసుకున్నారు. అప్పట్లో ఈ వార్త సంచలనం రేపింది. ఎలాంటి ప్రకటన లేకుండా మహేష్ పెళ్లి జరిగింది. గత 17 ఏళ్లుగా బెస్ట్ కపుల్ గా మహేష్, నమ్రత ఉన్నారు. వీరికి గౌతమ్, సితార పిల్లలు. కొడుకు గౌతమ్ వయస్సు 16 ఏళ్ళు కాగా, సితారకు 10 ఏళ్ళు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Kajal Aggarwal birthday

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
The Odyssey 3 Day Collections

The Odyssey : ‘ది ఒడిస్సీ’ లో క్రేజీ రోల్ ని మిస్ చేసుకున్న మన హీరో.. పెద్ద...

రీసెంట్ గా భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం , బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ వసూళ్ల సునామీ ని సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తుందో మన...
Akhil Lenin Movie Release Date

Lenin Movie : 11వ రోజు ఊహించని రికార్డు నెలకొల్పిన ‘లెనిన్’.. ఇప్పట్లో ఈ సునామీ ఆగేలా లేదు..

Lenin Movie : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన 'లెనిన్' చిత్రం వసూళ్లు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని కైవసం చేసుకున్న...
Team India Bowling

Team India : జింబాబ్వే టూర్ కు టీమిండియా ఇదే.. వాళ్ల మీద మనోళ్ళ రికార్డులు ఎలా ఉన్నాయంటే..

Team India : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలో టి20.. వన్డే సిరీస్ కోల్పోయిన తర్వాత టీమిండియా పూర్తిగా నిరాశలో కూరుకుపోయింది. బౌలింగ్ దారుణంగా ఉంది. బ్యాటింగ్ చెత్తగా ఉంది....
TTD Trust Board Meeting

TTD : చంద్రబాబు జైల్లో చనిపోతే పొట్టేళ్ల విందు.. అటువంటి అధికారికి తిరుమలలో ఏఈఈ పోస్ట్..

TTD : రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తుంటారు. వాళ్లలో వాళ్లకు వ్యూహాలు ఉంటాయి. ఎత్తులు ఉంటాయి. వాటిని చిత్తు చేసే ఎత్తుగడలు కూడా ఉంటాయి. ఇవన్నీ రాజకీయంలో ఒక భాగం. కానీ ఉద్యోగులు...
Oktelugu Epaper