Mahesh And Rajamouli: #RRR వంటి గ్లోబల్ హిట్ తర్వాత రాజమౌళి(SS Rajamouli) మహేష్ బాబు(Super Star Mahesh Babu) తో ఒక భారీ బడ్జెట్ ఫారెస్ట్ అడ్వెంచర్ సినిమా పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ కోసం ఎదురు చూస్తున్న మహేష్ ఫ్యాన్స్ కి, నవంబర్ నెలలో మీ ఎదురు చూపులకు తెర దించుతామని రాజమౌళి ఆగస్టు 9 న అధికారిక ప్రకటన చేసాడు. అంతే కాకుండా మహేష్ బాబు ప్రీ లుక్ ని కూడా ఆరోజు విడుదల చేసాడు. నవంబర్ లో రివీల్ చేయబోయే అప్డేట్ కి ప్రపంచం మొత్తం మన టాలీవుడ్ వైపు మరోసారి చూస్తుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్. అంతలా ఏమి చేయబోతున్నారు అనేది వివరాలు బయటకు రాలేదు కానీ, ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ ని మాత్రం మూవీ టీం ఫిక్స్ చేసినట్టు విశ్వసనీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం.
కథ రీత్యా ఈ సినిమా మొత్తం వారణాసి చుట్టూ తిరుగుతుంది కాబట్టి, ఈ చిత్రానికి ‘వారణాసి’ అనే టైటిల్ ని ఖరారు చేశారట. ముందుగా ‘జెన్ 65’ లాంటి పేర్లను పరిశీలించారు కానీ, చివరికి ‘వారణాసి’ టైటిల్ ని లాక్ చేశారట. అంతర్జాతీయ స్థాయిలో తెరకెక్కుతున్న ఒక సినిమాకు ఇలాంటి టైటిల్ ఫిక్స్ చేశారేంటి అని కొంతమంది నిరాశ వ్యక్తం చేస్తే, మన దేశం లోని ఒక సిటీ పేరు ప్రపంచం మొత్తం మారుమోగిపోయేలా చేయబోతున్న రాజమౌళి ని అభినందించాల్సిందే అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. రాజమౌళి చర్యలు ఎప్పుడూ ఊహాతీతంగానే ఉంటాయి. ఆయన సినిమా టైటిల్స్ కూడా అంచనాలకు అందని విధంగా ఉంటాయి. మొదటి సినిమా నుండి ఇదే జరుగుతూ వస్తుంది. ఇప్పుడు కూడా అదే జరిగింది. మహేష్ బాబు కూడా ఈ టైటిల్ పట్ల సంతృప్తి వ్యక్తం చేసాడట. హైదరాబాద్ లో వారణాసి కి సంబంధించిన సెట్స్ భారీ ఖర్చు తో నిర్మించారట.
ఈ సెట్స్ లో చాలా సన్నివేశాలు చిత్రీకరించినట్టు తెలుస్తుంది. ఇకపోతే ఈ సినిమాలో మలయాళం స్టార్ హీరో పృథ్వీ రాజ్ సుకుమారన్, బాలీవుడ్/ హాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా విలన్ క్యారెక్టర్స్ చేస్తున్నారు. హీరోయిన్ ఎవరు అనేది మాత్రం ఇప్పటికీ సస్పెన్స్ గానే ఉంది. అసలు ఈ సినిమాలో హీరోయిన్ ఉంటుందా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఇలాంటి భారీ బడ్జెట్ ఇంటర్నేషనల్ సినిమాల్లో హీరోయిన్ ఉన్నా లేకపోయినా పెద్దగా పట్టించుకోరు ఆడియన్స్. కేవలం కథ ని మాత్రమే చూస్తారు కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. ఇక పోతే ఈ సినిమా రామాయణం కనెక్షన్ తో తెరకెక్కుతుంది. శ్రీరాముడి వంశానికి చెందిన వాడిగా ఇందులో మహేష్ బాబు కనిపించబోతున్నాడు. అంతే కాదు కొన్ని షాట్స్ లో ఆయన శ్రీరాముడిగా కూడా కనిపిస్తాడట. రాబోయే రోజుల్లో ఇంకా ఈ చిత్రం గురించి ఆసక్తికరమైన విషయాలు తెలియనున్నాయి.