Mahesh Babu And Prabhas: స్టార్ హీరోలుగా వాళ్ల కంటు ఒక ఐడెంటిటి క్రియేట్ చేసుకున్న వాళ్లలో ప్రభాస్, మహేష్ బాబులు మొదటి స్థానంలో ఉంటారు. వీళ్లిద్దరు తమ సత్తా చాటుకుంటూ గొప్ప సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే కెరియర్ స్టార్టింగ్ లో వీళ్ళిద్దరిని పెట్టి ఒక భారీ సినిమాని చేయడానికి కొంతమంది దర్శక నిర్మాతలు ఇంట్రెస్ట్ చూపించారు. ముఖ్యంగా ఎమ్మెస్ రాజు లాంటి ప్రొడ్యూసర్ వీళ్ళిద్దరితో సినిమాలను చేసి చేరో బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందించాడు. కాబట్టి ఆయన సురేష్ కృష్ణ డైరెక్షన్ లో ఒక కథని కూడా ఫైనల్ చేశారు.ఆ కథకి మహేష్ బాబు – ప్రభాస్ ఇద్దరు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే వార్తలు కూడా వచ్చాయి. అయినప్పటికి ఆ సినిమా కార్యరూపం దాల్చలేదు. కారణం ఏదైనా కూడా ఈ ఇద్దరు స్టార్ హీరోలు ఒక సినిమాలో నటిస్తే చూడాలని ఇప్పటికి వాళ్ళ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా వీళ్ళిద్దరి కాంబినేషన్లో సినిమా వస్తే యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న అన్ని రికార్డులు బ్రేక్ అయిపోతాయని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక రాజమౌళి డైరెక్షన్లో జూనియర్ ఎన్టీఆర్ – రామ్ చరణ్ కలిసి ‘త్రిబుల్ ఆర్’ సినిమా చేసిన విషయం మనకు తెలిసిందే.
ఇక ఇప్పటివరకు ఇండియాలో అత్యంత బిగ్గెస్ట్ మల్టీస్టారర్ సినిమా ఏదైనా ఉంది అంటే త్రిబుల్ ఆర్ సినిమా అనే చెబుతున్నారు. ప్రభాస్ మహేష్ బాబు కాంబినేషన్లో సినిమా వస్తే ఈ సినిమా కూడా అతిపెద్ద మల్టీస్టారర్ సినిమాగా మారే అవకాశాలైతే ఉన్నాయి.
ఇక ఈ మధ్యకాలంలో వీళ్ళిద్దరి కాంబినేషన్లో సినిమా వచ్చే అవకాశాలైతే లేవు. ప్రస్తుతం హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ సినిమా చేశాడు. ఇక ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్లో ఉంది. అలాగే సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ప్రభాస్ ‘స్పిరిట్’ అనే సినిమా చేస్తున్నాడు. ఇక రీసెంట్ గా ఈ సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ అయింది. వీళ్ళిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కబోయే ఈ సినిమాకి భారీ ఎత్తున రెస్పాన్స్ వస్తోంది.
మరి ఈ సినిమాతో వీళ్ళు ప్రేక్షకులను ఎలా మెప్పిస్తారు. లేకపోతే ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో వీళ్ళకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ చేసుకుంటారా? లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇక ప్రస్తుతం మహేష్ బాబు మాత్రం రాజమౌళి దర్శకత్వంలో వారణాసి అనే సినిమా చేస్తున్నాడు…ఈ సినిమాను 2027 వ సంవత్సరంలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు…