Mahesh Babu And Namrata: సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నటుడు మహేష్ బాబు…ఆయన చాలా తక్కువ సమయంలోనే తండ్రికి తగ్గ తనయుడిగా ఎదిగాడు. తన తోటి హీరోయిన్ అయిన నమ్రత ను ని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం మనకు తెలిసిందే. ఇక అప్పటి నుంచి మహేష్ బాబు ఎలాంటి సినిమాలు చేయాలనే విషయంలో నమ్రత చాలా కేర్ ఫుల్ గా వ్యవహరిస్తోంది. తను సినిమా ఫైనల్ చేసిన తర్వాత మహేష్ బాబు ఆ కథలను విని వాటి గురించి ఆలోచిస్తాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాతో మంచి విజయాన్ని సాధించిన మహేష్ బాబు ఆ సినిమాతో ఫ్యామిలీ ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. ఆ చనువుతో శ్రీకాంత్ అడ్డాల తో బ్రహ్మోత్సవం అనే సినిమా చేశాడు.
ఈ సినిమా భారీ డిజాస్టర్ ను మూటగట్టుకుంది. నిజానికి మొదట నమ్రత ఈ సినిమా చేయడానికి వీలు లేదని మహేష్ బాబుతో చెప్పిన కూడా మహేష్ బాబు తన మాట వినకుండా ఈ సినిమాను చేశాడు. దాని ద్వారా మహేష్ బాబు తన కెరీర్ లోనే ఒక భారీ డిజాస్టర్ ను చవి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఇక అప్పటి నుంచి నమ్రత మహేష్ బాబు విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటుంది. మహేష్ సైతం తను ఉన్న సినిమాల బిజీలో స్టోరీలను విని జడ్జ్ చేసే కంటే నమ్రత కి సినిమాల మీద మంచి అవగాహన ఉంది కాబట్టి ఆమె కథలను విన్న తర్వాత ఫైనల్ గా మహేష్ బాబు వింటున్నాడట.
ఇక ఏది ఏమైనా కూడా మహేష్ బాబు తన భార్య మాటలను కాదని చేసిన బ్రహ్మోత్సవం సినిమా ఫ్లాప్ అవ్వడంతో మహేష్ తో పాటు అతని అభిమానుకు సైతం నిరాశ చెందరనే చెప్పాలి…ఇక ప్రస్తుతం మహేష్ రాజమౌళి డైరెక్షన్ లో వారణాసి సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పాన్ వరల్డ్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్న విషయం మనకు తెలిసిందే…