Bloody Romeo Movie: ‘ప్యారడైజ్’ వంటి భారీ డిజాస్టర్ ఫ్లాప్ తర్వాత నేచురల్ స్టార్ నాని ‘ఓజీ’ డైరెక్టర్ సుజిత్ తో ‘బ్లడీ రోమియో’ అనే చిత్రం చేయబోతున్న సంగతి తెలిసిందే. అయితే మధ్యలో ‘ఓజీ 2’ ప్రకటన రావడం తో ‘బ్లడీ రోమియో’ ఆగిపోయిందేమో అని అంతా అనుకున్నారు. కానీ కట్ చేస్తే నేడు ఈ చిత్రానికి సంబంధించి ఒక బ్లాస్టింగ్ అప్డేట్ వచ్చింది. ఈ నెల 17 నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలు కాబోతుంది అట. మొదటి షెడ్యూల్ హైదరాబాద్ లోనే ఉంటుందట, మిగిలిన షెడ్యూల్స్ మొత్తం లండన్ లోనే ఉంటుందట. డిసెంబర్ వరకు నాన్ స్టాప్ గా ఈ షెడ్యూల్స్ ని పూర్తి చేసి , సినిమాని వచ్చే ఏడాది మార్చి నెలలో విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నాడట సుజిత్. వచ్చే ఏడాది సమ్మర్ నుండి ఆయన తన ఫోకస్ ని పూర్తిగా ‘ఓజీ 2’ వైపు షిఫ్ట్ చేయబోతున్నాడు.
కాసేపటి క్రితమే డైరెక్టర్ సుజిత్ ఈ చిత్రానికి సంబంధించి నాని మేకోవర్ వీడియో ని సోషల్ మీడియా లో అప్లోడ్ చేయగా , అది ఇప్పుడు బాగా వైరల్ అయ్యింది. ఇప్పటి వరకు ఎవ్వరూ చూడని లుక్ లో నాని ఈ చిత్రం లో కనిపించబోతున్నాడు. అంతే కాకుండా ఆయన క్యారెక్టరైజేషన్ కూడా చాలా కొత్తగా , పవర్ ఫుల్ గా ఉండబోతుంది అట. ఈ చిత్రం లో వయొలెన్స్ ఉంటుంది కానీ , అది పూర్తి స్థాయిలో ఉండదని , ఇప్పటి వరకు ఎవ్వరూ చూడని సరికొత్త జానర్ ని ఈ చిత్రం ద్వారా ఇండియన్ సినిమాకు పరిచయం చేయబోతున్నామని డైరెక్టర్ సుజిత్ రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు. ఇకపోతే ఈ చిత్రం లో ఇద్దరు హీరోయిన్స్ ఉంటారట. ఒక హీరోయిన్ గా ఇప్పటికే బ్లాస్ట్ ఫేమ్ ప్రీతీ ముకుందం ఎంపికైనట్టు సమాచారం.
మరో హీరోయిన్ కి సంబంధించిన అప్డేట్ త్వరలోనే రానుంది. అదే విధంగా ఈ చిత్రం లో విలన్ క్యారెక్టర్ కోసం మలయాళం స్టార్ హీరో పృథ్వి రాజ్ సుకుమారన్ ని సంప్రదించాడట సుజిత్. త్వరలోనే ఆయన షూటింగ్ సెట్స్ లోకి అడుగుపెడుతాడట. నాని ఈ చిత్రం కోసం 100 రోజుల కాల్ షీట్స్ ని కేటాయించాడట. ఈ చిత్రం తో ఎలా అయినా కుంభస్థలం బద్దలు కొట్టాలని నిర్ణయించుకున్నాడట నాని. ‘ది ప్యారడైజ్’ చిత్రానికి ఫ్లాప్ టాక్ వచ్చినప్పటికీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద 180 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. నైజాం ప్రాంతం లో బ్రేక్ ఈవెన్ మార్కుని కూడా అందుకుంది ఈ చిత్రం. దీన్ని బట్టీ చూస్తే ప్రస్తుతం నాని టైం పీక్ రేంజ్ లో నడుస్తుంది అనుకోవచ్చు. ఇలాంటి సమయం లో ‘బ్లడీ రోమియో’ బాగా తీస్తే 300 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను అవలీలగా అందుకుంటుందని అంటున్నారు మేకర్స్.