spot_img
Homeఎంటర్టైన్మెంట్Ari Movie : అన‌సూయతో ‘పేపర్ బాయ్’ దర్శకుడి `అరి`

Ari Movie : అన‌సూయతో ‘పేపర్ బాయ్’ దర్శకుడి `అరి`

Ari Movie :  యాంకర్ అనసూయ కొత్త చిత్రం లాంఛ్ అయ్యింది. పేపర్ బాయ్ మూవీ దర్శకుడు జయశంకర్ తన రెండో చిత్రంగా ‘అరి’ని తీస్తున్నారు. అనసూయ ప్రధాన పాత్రలో ఈసినిమా తెరకెక్కుతోంది. జ‌య‌శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త‌లు శేషు మారం రెడ్డి, శ్రీ‌నివాస్ రామిరెడ్డి సంయుక్తంగా.. ఆర్వి రెడ్డి, సమర్పణ లో `అరి` సినిమా ని నిర్మిస్తున్నారు. అన‌సూయ భ‌ర‌ద్వాజ్‌, సాయికుమార్‌, వైవాహ‌ర్ష‌, శుభ‌లేఖ సుధాక‌ర్ త‌దిత‌రులు న‌టిస్తున్న ఈ చిత్రం టైటిల్ లోగో విడుద‌ల‌యింది. శుక్ర‌వారం గ‌చ్చిబౌలిలో రేడిస‌న్ హోట‌ల్‌లో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో హుజూర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి, అఖండ నిర్మాత మిర్యాల ర‌వీంద‌ర్ రెడ్డి సంయుక్తంగా ఆవిష్క‌రించారు.

Ari Movie
Anasuya Bharadwaj, Ari Movie team

అనంత‌రం ఎమ్మెల్యే సైదిరెడ్డి మాట్లాడుతూ ద‌ర్శ‌కుడు జ‌య‌శంక‌ర్ పేప‌ర్ బాయ్‌ను అందిరికీ న‌చ్చేవిధంగా తీశాడు. అనసూయ రంగ‌స్థ‌లం సినిమాకు ముందు వేరేగా వుండేది. ఆ సినిమా చూశాక ఆమెలో ప్ర‌తిభ వుంద‌ని అంద‌రికీ తెలిసింది. ఈ సినిమాకు న‌టీన‌టులే బ‌లం. టైటిల్‌లోనే కొత్త ద‌నం వుంది. నా చేయికూడా మంచిది. ఏది చేసినా స‌క్సెస్ అవుతుందని అంద‌రూ అంటుంటారు. ద‌క్షిణాది సినిమా హాలీవుడ్‌ను శాసించే స్థాయిలో వుంది. అందిరికీ ఆల్‌ది బెస్ట్ తెలిపారు.

Also Read: Balakrshina : స్టార్ హీరో నందమూరి బాలకృష్ణకు కరోనా.. ఆందోళనలో ఫ్యాన్స్

అఖండ నిర్మాత మిర్యాల ర‌వీంద‌ర్ రెడ్డి మాట్లాడుతూ, ఆర్‌.వి. సినిమాస్ `అరి`. నో బ‌డీ నోస్‌.. అనే టైటిల్ చాలా వెరైటీగా వుంది. పోస్ట‌ర్‌లో లైబ్ర‌రీతోపాటు కొన్ని వున్నాయి. ఇవి చూస్తుంటే ఇంటిలిజెంట్ మూవీలా అనిపిస్తుంది. ద‌ర్శ‌కుడు జ‌య‌శంక‌ర్ పేప‌ర్ బాయ్ సినిమాను చాలా అందమైన ప్రేమ‌క‌థ‌గా చూపించాడు.ఈ సినిమాతో క‌మ‌ర్షియ‌ల్ బ్రేక్ రావాల‌ని కోరుకుంటున్నాను అన‌సూయ న‌టిగానే కాదు. సోష‌ల్ ఎవేర్‌నెస్‌కూడా ఆమెలో క‌నిపిస్తుంది. రంగ‌మ్మ‌త్త‌కు ముందు ఆ త‌ర్వాత అన్న‌ట్లు ఆమెకు వ‌చ్చిన అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకుంటుంది.

Ari Movie
Anasuya Bharadwaj, Ari Movie team

చిత్ర ద‌ర్శ‌కుడు జ‌య‌శంక‌ర్ మాట్లాడుతూ, నిర్మాత‌కు క‌థ‌ను చెప్పి ఒప్పించ‌గ‌లిగాను. కానీ `అరి` అనే టైటిల్‌ను చెప్ప‌డానికి చాలా క‌ష్ట‌ప‌డ్డాను. `అరి` అనేది సంస్కృత‌ప‌దం. శ‌త్రువు అని అర్థం. అది ఏమిటి? అనేది సినిమాలో చెప్పాను. ఈరోజే టైటిల్‌లోగో విడుద‌ల‌చేశాం. మ‌రిన్ని ఫంక్ష‌న్లు వుంటాయి. అప్పుడు సినిమా గురించి మ‌రింత‌గా వివ‌రిస్తాను. అన‌సూయ‌గారు క‌థ చెప్ప‌గానే అంగీక‌రించారు. సాయికుమార్‌, శుభలేఖ సుధాక‌ర్‌.. ఇలా అంద‌రూ ముందుకువ‌చ్చారు. అనూప్‌గారికి క‌థ చెప్ప‌గానే వెంట‌నే చేస్తున్నా అన్నారు. మూడు మంచి ట్యూన్స్ ఇచ్చారు. పేప‌ర్‌బాయ్ కంటే ఈ సినిమాకు మరింత పేరు వ‌స్తుంద‌నే న‌మ్మ‌క‌ముంది అన్నారు.

Also Read: Pawan Kalyan Remuneration: రోజుకు రెండున్నర కోట్ల రెమ్యూనరేషన్… ఇది పవన్ రేంజ్ అంటే!

మైత్రీమూవీస్‌ ర‌విశంక‌ర్ మాట్లాడుతూ, రంగ‌స్థ‌లం చిత్రం మాకు మెమొర‌బుల్‌. అన‌సూయ‌కు అంతే. పుష్ప‌లో కూడా చేసింది. రెండో భాగంలోనూ చేయ‌బోతోంది. ఈ సినిమా కూడా ఆమెకు మంచి స‌క్సెస్ రావాల‌ని ఆశిస్తున్నాను.

Anasuya Bharadwaj
Anasuya Bharadwaj, Ari Movie team

నిర్మాత శేషు మాట్లాడుతూ, మ‌నిషి ఎలా బ‌త‌కాలో అనేది ఇంత‌కుముందు సినిమాలు చూపించాయి. కానీ మా సినిమా మ‌నిషి ఎలా బ‌త‌క‌కూడ‌దో చూపిస్తుంది. మంచి విజ‌న్ వున్న ద‌ర్శ‌కుడు జ‌య‌శంక‌ర్‌. పేప‌ర్ బాయ్‌క‌న్నా వంద‌రెట్లు ఈ సినిమా వుంటుంది. అనూప్ మంచి ట్యూన్స్ ఇచ్చాడు. అనూప్ లేక‌పోతే ఈ సినిమా వుండేదికాదు అని తెలిపారు.

మ‌రో నిర్మాత శ్రీ‌నివాస‌రెడ్డి మాట్లాడుతూ, ఆర్విరెడ్డి గారు యు.ఎస్‌.లో వుంటారు. ఆయ‌న శేషుతోలిపి ఆర్‌.వి. బేన‌ర్ స్థాపించారు. ప‌లు ప్ర‌య‌త్నాలు చేసి ఫైన‌ల్‌గా అరి అని పెట్టాం. ఆర్‌.వి. రెడ్డిగారు కాలేజీలో న‌వ‌ల‌లు, క‌థ‌లు రాసేవారు. ఇండ‌స్ట్రీలో ఎంతో మంది ప్ర‌తిభావంతులు వున్నారు. వారిని గుర్తించి వెలుగులోకి తెచ్చేందుకు ఈ బేన‌ర్ స్థాపించాం. ఈ సినిమాలో మంచి కామెడీ వుంటుంది. మ‌ళ్ళీ మ‌ళ్ళీ చూసే విధంగా సినిమాను తీశారు. అనూప్ రూబెన్స్ రావ‌డంతో ఈ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ అవుతుంద‌నే న‌మ్మ‌కం క‌లిగింద‌ని చెప్పారు.

అనసూయ మాట్లాడుతూ ద‌ర్శ‌కుడు క‌థ చెప్పిన‌ప్పుడే చాలా కుతూహ‌లం క‌లిగింది. జూమ్‌లో నేను లాక్‌డౌన్‌లో క‌థ విన్నాను. నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్‌లో అద్భుత‌మైన కంటెంట్‌ల‌తో సినిమాలు వ‌స్తున్నాయి. మ‌న‌కెందుకు రావ‌ని చూసిన‌ప్పుడు అనిపించేది. ఈ క‌థ విన్నాక మ‌నం కూడా తీయ‌గ‌లం అనిపించింది. చిత్ర నిర్మాత‌ల‌కు ధ‌న్య‌వాదాలు తెలియ‌జేసుకుంటున్నా. రంగ‌స్థ‌లంలో రంగ‌మ్మ‌త్త‌గా చేశాక ఇంత పేరు వ‌స్తుంద‌ని అనుకోలేదు. ఈ జ‌న్మ‌కు చాలు అన్న‌ట్లు అనిపించింది. ఆ త‌ర్వాత రెండేళ్ళ‌పాటు అవ‌కాశాలు రాలేదు. ఇప్పుడిప్పుడే వ‌స్తున్నాయి. ల‌క్కీగా ఫీల‌వుతున్నాను. నాకోసం కేరెక్ట‌ర్లు రాస్తున్నారు. పుష్ప చాలా సంతృప్తినిచ్చింది. రెండో భాగంలో మంచి పాత్ర వుంది. `అరి` సినిమాలో హ్యూమానిటీతోపాటు ఎంట‌ర్‌టైన్‌మెంట్ కూడా వుంది. ఎలా బ‌త‌క‌కూడ‌ద‌నే అనే విష‌యాన్ని ఎంట‌ర్‌టైన్‌గా ద‌ర్శ‌కుడు చూపించారు. అంద‌రికీ న‌చ్చుతుంది. అనూప్‌రూబెన్స్ సంగీతం అన‌గానే హ‌మ్మ‌య్య‌.. అనిపించింది. అలాగే ఇత‌ర న‌టీన‌టులుకు అంద‌రూ చ‌క్క‌గా న‌టించారు అని చెప్పారు.

ఇంకా ఈ సినిమాలో శ్రీ‌కాంత్ అయ్యంగార్‌, సుర‌భి, శ్రీ‌నివాస్ రెడ్డి, చ‌మ్మ‌క్ చంద్ర‌, శ‌శాంక్ మౌళి, పావ‌నిరెడ్డి త‌దిత‌రులు న‌టిస్తున్నారు.

Also Read: Pawan Kalyan- Puri Jagannadh: పవన్ కళ్యాణ్ ను సీఎం చేసేందుకు స్క్రిప్ట్ రెడీ చేస్తున్న పూరి జగన్నాథ్

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Azim Premji : జీవితానికి సంబధించి అజీమ్ ప్రేమ్ జీ చెప్పిన 5 సూత్రాలివే..

Azim Premji : భారతదేశ ప్రముఖ పారిశ్రామికవేత్త అజీమ్ ప్రేమ్‌జీ వ్యాపార రంగంలో ఎన్నో విజయాలు సాధించారు. ఆయన ధనవంతుడైనప్పటికీ సాదాసీదా జీవనశైలి, క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. యువతకు, వ్యాపారవేత్తలకు స్ఫూర్తినిచ్చేలా...

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...
Jana Nayagan OTT release

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...
Infosys : ఇన్ఫోసిస్‌లో కొత్త 20 వేల ఉద్యోగాలు... వారికి మాత్రమే ఛాన్స్‌..

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...
Oktelugu Epaper