తెలుగు బుల్లితెర పై జబర్దస్త్ కు ఉన్న క్రేజ్ మరో ఏ షోకు లేదు, గత ఎనిమిదేళ్లుగా జబర్దస్త్ రారాజుగా వెలిగిపోతుంది. అందుకే జబర్దస్త్ కు ఆ షోలో చేసే నటీనటులతో పాటు యాంకర్స్ కు కూడా ప్రత్యేకమైన స్థానం ఉంది. కేవలం ఈ షోతో లైఫ్ లో సెటిల్ అయినవాళ్లు పదుల సంఖ్యలో ఉన్నారు. ఈ రోజు నాగబాబు ఆర్థికంగా బలపడటానికి కారణం ఈ షోనే.
మరి ఎన్నో ఏళ్లుగా విజయవంతంగా అత్యధిక టీఆర్పీలతో దూసుకుపోతున్న ఈ కామెడీ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ కావడానికి కారణాన్ని రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు ఓ కమెడియన్. జబర్దస్త్ మొదలైనప్పటి నుండి రాకెట్ రాఘవ టీమ్ లీడర్ గా కొనసాగుతున్నాడు. పైగా ఎంతో మంది ఈ షోలోకి వచ్చి వెళ్లిపోయారు కానీ, రాకెట్ రాఘవ మాత్రం ఇప్పటికీ ఈ షోలోనే పాతుకుపోయాడు.
అయితే జబర్దస్త్ విజయ రహస్యంతో పాటు ఈ షోలో తనకున్న సుదీర్ఘ అనుభవాల గురించి రాఘవ తనదైన శైలిలో నసుగుతూ ఏమి చెబితే ఏమవుతుందో అని భయపడుతూ మొత్తానికి కొంత మ్యాటర్ ను అయితే చెప్పుకొచ్చాడు. జబర్దస్త్ స్కిట్స్ పై అప్పట్లో నాగబాబుగారు ప్రత్యేక శ్రద్ధ తీసుకునే వారని, ఎప్పుడైనా స్కిట్ సరిగా లేకపోతే పర్సనల్ గా రూమ్ లోకి పిలిచి మరీ నాగబాబుగారు క్లాస్ తీసుకునే వారని తెలియజేశాడు.
అయితే, ఎప్పుడు నాగబాబు ఎవర్నీ తిట్టేవారు కాదు అట. అంతంత రెమ్యునరేషన్లు తీసుకుంటారు కదా స్కిట్ సరిగా చూసుకోవద్దా అని మాత్రం మందలిస్తారని రాఘవ సెలవిచ్చాడు. ఇక ప్రస్తుతం ఈ షోలో తన జర్నీ గురించి చెబుతూ గతంలో నేను సీనియర్స్ నుండి నేర్చుకున్నట్లు గానే, ఇప్పుడొస్తున్న కొత్త తరం వారి నుండి కూడా చాల విషయాలను నేర్చుకున్నట్లు రాఘవ చెప్పుకొచ్చాడు. ఏది ఏమైనా జబర్దస్త్ లో మాత్రం తాను ఇలాగే కొనసాగుతాను అన్నట్టు ఉంది రాఘవ వ్యవహారం.