pavithra lokesh old pics viral : పవిత్రా లోకేష్.. ఇప్పుడీ అందమైన ఆంటీ గురించే అందరినోటా.. అందరూ ఈమె గురించే చర్చించుకుంటున్నారు. ఎందుకంటే ఇన్నాళ్లు సినిమాల్లో తల్లిగా, అక్కగా పద్ధతి అయిన పాత్రల్లో నటించిన పవిత్రా లోకేష్ ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ కానీ ఒకప్పుడు హీరోయిన్ అన్న సంగతి ఎవరికీ తెలియదు. ఆమె కన్నడ నాట కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా చేసింది. అక్కడ హాట్ హాట్ అందాలు ఆరబోసింది. ఆ పాత ఫొటోలు ఇప్పుడు బయటకు తీసి జనాలు వైరల్ చేస్తున్నారు.

దీనికంతటికి కారణం టాలీవుడ్ నటుడు నరేశ్. ఈయన పవిత్రా లోకేష్ తో ప్రస్తుతం సహజీవనం చేస్తున్నాడు. పవిత్రా లోకేష్ సైతం భర్తను వదిలేసి ఈయనతో కలిసి ఉంటున్నాడు. పవిత్రాను నరేశ్ 4వ పెళ్లి చేసుకుంటాడని.. ప్రస్తుతం 3వ భార్యకు విడాకులు ఇచ్చే పనిలో బిజీగా ఉన్నాడు. నరేశ్ మూడో భార్య రమ్య ఊరుకోవడం లేదు. ఇప్పటికే నరేశ్-పవిత్రా మైసూర్ లో ఒక హోటల్ లో కలిసి ఉండగా పట్టుకొని రచ్చ చేసింది.
ఇక పవిత్రా లోకేష్ భర్త కూడా ఈ వివాదంలోకి లాగారు. ఆయన కూడా తాము విడిపోలేదని.. పవిత్రతో తన బంధం ఇంకా కొనసాగుతోందని మీడియాకు ఎక్కి రాద్ధాంతం చేస్తున్నాడు. ఈ రెండు వివాదాలతో పవిత్రాలోకేష్ పేరు సోషల్ మీడియాలో ఇప్పుడు ట్రెండింగ్ గా మారింది. పవిత్ర లోకేష్ గురించి ఇప్పుడు అందరూ ఆరా తీస్తున్నారు. పవిత్రా హీరోయిన్ గా ఉన్న పాత ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఆమె కెరీర్ ఆరంభంలో హీరోయిన్ గా కొన్ని సినిమాలు చేసింది.
పాత సినిమాల్లో హీరోయిన్ బోల్డ్ అండ్ గ్లామరస్ పాత్రల్లో నటించింది. ఇంటర్నెట్ లో ఇవే హల్ చల్ చేస్తున్నాయి. హీరోలకు తల్లి పాత్రల్లో నటిస్తున్న పవిత్రా లోకేష్ నాడు ఇంత బోల్డ్ గా నటించిందా? అని అందరూ ఆశ్చర్యపోతున్నారు.
పవిత్రా లోకేష్ కన్నడలో 2006 కు అటూ ఇటుగా సినిమాలు చేసింది. ‘నాయి నీరాలు’ సినిమా ఆమెకు హీరోయిన్ గా మంచి గుర్తింపు తీసుకొచ్చింది. అయితే ఎంతో అందం ఉన్నా.. సరిగ్గా పట్టించుకోక.. ఇండస్ట్రీ లో నిలుదొక్కుకోలేక పవిత్ర లోకేష్ స్టార్ హీరోయిన్ కాలేకపోయింది. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీగా మారింది.
Recommended Videos
[…] […]