Movie Stars Two Or three Marriages: సీనియర్ నటుడు నరేష్, క్యారెక్టర్ ఆర్టిస్టు పవిత్ర లోకేష్ వ్యవహారం ప్రస్తుతం పరిశ్రమలో సంచలనంగా మారింది. వారిద్దరు కలిసి సహజీవనం చేయడం అందరిలో ఆసక్తి రేపుతోంది. ఈ నేపథ్యంలో వారు ఓ హోటల్ లో ఉన్న సందర్భంగా నరేష్ మూడో భార్య రమ్య వారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడంతో అందరిలో ఆశ్చర్యం కలుగుతోంది. దీంతో వీరిద్దరి కలయికపై రకరకాల సందేహాలు వస్తున్నాయి. తామిద్దరం కలిసి జీవిస్తున్నామని చెబుతున్నా ఇందులో అభ్యంతరమేమిటనే వార్తలు వస్తున్నాయి. కానీ ఇప్పుడు వారి ప్రేమపై పలు రకాల కథనాలు వినిపిస్తున్నాయి. పవిత్ర భర్త తనకు విడాకులు ఇవ్వకుండానే అతడితో ఎలా సహజీవనం చేస్తుందని ప్రశ్నిస్తున్నారు.

సినిమా పరిశ్రమలో ఒక పెళ్లి కాదు రెండు మూడు పెళ్లిళ్లు చేసుకున్న వారే ఎక్కువగా ఉన్నారు. అలనాటి నటుల నుంచి తీసుకుంటే ఇప్పటి వరకు చాలా మంది రెండు, మూడో పెళ్లి చేసుకుని అందరిలో అనుమానాలు కలిగిస్తున్నారు. సీనియర్ ఎన్టీఆర్ లక్ష్మీపార్వతి ని రెండో వివాహం చేసుకున్నారు. అలాగే నాగార్జున కూడా మొదటి భార్య వెంకటేశ్ చెల్లెలు లక్ష్మికి విడాకులు ఇచ్చి అమలను రెండో పెళ్లి చేసుకున్నారు. నాగచైతన్య లక్ష్మి కొడుకు కావడం గమనార్హం.

మరో నటుడు పవన్ కల్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకున్నారు. మొదటి భార్య నందిని. రెండో భార్య రేణుదేశాయ్ ని వివాహం చేసుకున్నారు. రేణుదేశాయ్ బద్రి సినిమాలో ఇద్దరు కలిసి నటించారు. ఆమెకు విడాకులు ఇచ్చి మూడో పెళ్లి చేసుకున్నారు. రష్యన్ మోడల్ ను మూడో పెళ్లి చేసుకుని ప్రస్తుతం ఆమెతో కలిసి ఉంటున్నారు. సీనియర్ నటుడు శరత్ బాబు సైతం తనకంటే పెద్దదైన రమాప్రభను వివాహం చేసుకున్నా విడాకులు ఇచ్చి స్నేహలతా దీక్షిత్ ను రెండో వివాహం చేసుకున్నారు. ఇప్పుడు వాళ్లు కూడా కలిసి లేకపోవడం గమనార్హం.

Also Read: Kishan Reddy- Pawan Kalyan: కిషన్ రెడ్డి పిలిచినా పవన్ వెళ్లలేదా? కారణమేంటి?
శరత్ కుమార్ కూడా రాధికను పెళ్లి చేసుకున్నారు. వారికి వరలక్ష్మి శరత్ కుమార్ జన్మించింది. ఆమె కూడా హీరోయిన్ గా నటిస్తోంది. మోహన్ బాబు సైతం తన మొదటి భార్య విద్యాదేవి చనిపోవడంతో రెండో భార్యగా నిర్మల దేవిని వివాహం చేసుకున్నారు. మొదటి భార్యకు విష్ణు, మనోజ్, లక్ష్మీప్రసన్న జన్మించిన సంగతి తెలిసిందే. కమల్ హాసన్ కూడా మొదటి భార్యకు విడాకులిచ్చి సాగరికతో సహజీవనం చేశాడు. తరువాత నటి గౌతమితో కూడా కొన్నాళ్లు కలిసి ఉన్నారు.

ఇలా సినిమా పరిశ్రమలో ఎవరి చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం. రెండు మూడు పెళ్లిళ్లే తప్ప ఒక్క పెళ్లితో ముడిపడిన జంటలు తక్కువే. దీంతో టాలీవుడ్ లో కూడా ఇంకా పెళ్లి కాని వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. ఈ నేపథ్యంలో రెండు మూడు పెళ్లిళ్లు చేసుకుని వారి జీవితాలు సుఖంగా ఉండాలని కోరుకుంటున్నా అది సాధ్యం కావడం లేదు.
Also Read: Sreeleela: రాఘవేంద్రరావు రుణాన్ని తీర్చుకోలేదట.. కుర్ర భామ కొత్త కబుర్లు