Malli Pelli (Telugu) Trailer Review : సెలబ్రిటీల జీవితాలు వెండితెరపైకి రావడం వెరీ కామన్. అయితే దీనికి కొందరు అంగీకరించరు. ఉన్నవి ఉన్నట్లు చెప్పినా లేనిపోనివి కల్పించి చెప్పినా ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది. అలాగే వ్యక్తిగత జీవితంలోని కోణాలు బయటపెట్టాలని ఎవరూ కోరుకోరు. నటుడు నరేష్ దీనికి భిన్నమైన వాడిగా నిరూపించుకున్నాడు. ఆయన లైఫ్ లోని అతిపెద్ద కాంట్రవర్సీగా ఉన్న మూడో భార్య వ్యవహారం వెండితెర మీద ఆవిష్కరిస్తున్నారు. రమ్య రఘుపతి అనే మహిళను నరేష్ మూడో పెళ్లి చేసుకున్నారు. ఆమెతో ఒక అబ్బాయికి తండ్రి అయ్యారు. అనంతరం మనస్పర్థలు తలెత్తాయి. విడాకులు కావాలని నరేష్ కోర్టుకు వెళ్లారు.
రమ్య రఘుపతి విడాకులు వద్దని పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు నడుస్తుండగా నరేష్ నటి పవిత్ర లోకేష్ కి దగ్గరయ్యారు. ఐదేళ్లుగా నరేష్-పవిత్ర లోకేష్ కలిసి జీవిస్తున్నారు. గత ఏడాది వీరి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. పవిత్ర లోకేష్ ని నరేష్ వివాహం చేసుకోబోతున్నాడని వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో రమ్య రఘుపతి సీన్లోకి వచ్చారు. నరేష్ క్యారెక్టర్ పై నీచమైన కామెంట్స్ చేశారు. నరేష్ కూడా తగ్గలేదు. రమ్య తిరుగుబోతు, తాగుబోతు అని మీడియా ముందు రెచ్చిపోయారు.
ఈ ఫ్యామిలీ డ్రామాను మక్కీకి మక్కీ మళ్ళీ పెళ్లి సినిమాగా నరేష్ తెరకెక్కించారు. దర్శకుడు ఎం ఎస్ రాజు రూపొందించారు. ఈ చిత్ర ట్రైలర్ నేడు విడుదల కాగా మరింత కాంట్రవర్సియల్ గా ఉంది. పవిత్ర లోకేష్, రమ్య రఘుపతితో కృష్ణ, విజయ నిర్మల సాన్నిహిత్యం, వారిద్దరితో పేరెంట్స్ ఎలా ఉండేవారో కూడా చెప్పబోతున్నాడు. కృష్ణగా శరత్ బాబు నటించారు. ఇక విజయనిర్మల పాత్రను జయసుధ చేశారు. అన్నపూర్ణ ఓ కీలక రోల్ చేశారు. ట్రైలర్ గమనిస్తే నరేష్ క్యారెక్టర్ నెగిటివ్ షేడ్స్ కలిగి ఉంది. భార్యను హింసించినట్లు, పవిత్ర లోకేష్ కి అట్రాక్ట్ అయినట్లు చూపించారు.
అయితే అసలు సినిమాలో ట్విస్ట్ వేరే ఉంటుంది. అసలు రమ్య రఘుపతి నిజ స్వరూపం భయటపెట్టాలనే నరేష్ ఈ మూవీ చేశారు. మళ్ళీ పెళ్లి ట్రైలర్ లో డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉన్నాయి. అలాగే కొన్ని బోల్డ్ సన్నివేశాలు కూడా ఉన్నాయి. మొత్తంగా ట్రైలర్ తో మళ్ళీ పెళ్లి చిత్రం మీద అంచనాలు మరో స్థాయికి తీసుకెళ్లాడు. ఈ మూవీకి మంచి ఓపెనింగ్స్ రావడం ఖాయంగా ఉంది. నరేష్ స్వయంగా నిర్మించారు. వనిత విజయ్ కుమార్ కీలక పాత్ర చేశారు. మే 26న మళ్ళీ పెళ్లి విడుదల కానుంది.