Thammidikunta Lake: ఒకప్పుడు వ్యర్ధాలు.. ముక్కు మూసుకొని పోయే పరిస్థితులు.. బయో వేస్ట్ అక్కడే డంప్ చేసేవారు. పైగా ఆక్రమణలు దర్జాగా సాగిపోయేవి. ఒక పేరు పొందినటుడు అక్కడ కన్వెన్షన్ సెంటర్ కూడా ఏర్పాటు చేశారు. ఇలా చెప్పుకుంటూ పోవాలి గాని తమ్ముడి కుంట దరిద్రాలు ఒక పట్టాన అర్థంకాదు. అసలే మాదాపూర్ ప్రాంతం.. అక్కడ చదరపు గజం బంగారంతో తూగుతోంది. ఇలాంటి సమయంలో తమ్ముడి కుంట ను బాగు చేయడానికి.. పూర్వరూపం అందించడానికి ప్రభుత్వం రంగంలోకి దిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రూపొందించిన హైడ్రా వ్యవస్థ ఈ చెరువుకు జీవం పోసేందుకు ప్రణాళిక రూపొందించింది. హైడ్రా అధినేత రంగనాథ్ తమ్మిడి కుంట విషయంలో చొరవ తీసుకున్నారు.
తమ్మిడి కుంటను బాగు చేసిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ప్రారంభించబోతున్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది. తమ్మిడి కుంట ఇప్పుడు సరికొత్తగా దర్శనమిస్తోంది. ఆక్రమణలు తొలగిపోయి.. నిండుగా నీటితో ఆహ్లాదంగా కనిపిస్తోంది. ఇంతకీ ఈ చెరువు ఇలా ఎలా మారింది.. దీని వెనక హైడ్రా అధినేత రంగనాథ్ ఎదుర్కొన్న సభలు ఏ విధంగా ఉన్నాయి.. న్యాయపరమైన చిక్కులు ఎలా అధిగమించగలిగారు.. వీటన్నిటిని ఈ కథనంలో తెలుసుకుందాం.
ఓ సినీ నటుడికి చెందిన కన్వెన్షన్ సెంటర్ ను ఈ చెరువు పక్కన నిర్మించారు. దానిని 2024 ఆగస్టు 24న కూల్చివేశారు. ఇది కాస్త దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. ఆ నిర్మాణం చెరువు భూమిని ఆక్రమించి చేసిందని హైడ్రా పేర్కొంది. ఈ వ్యవహారంతో తమ్మిడి కుంట చెరువు పునరుద్ధరణకు విస్తృత ప్రచారం లభించింది. ఈ చెరువులో ఆక్రమణలు తొలగించడం ఒక ఎత్తయితే.. చెరువులోకి చేరుతున్న మురుగునీటిని అడ్డుకోవడం మరొక పెద్ద సవాలు. చెరువు పరిసర ప్రాంతాల నుంచి మురుగు.. ప్లాస్టిక్ వ్యర్ధాలు.. ఇతర చెత్త పేరుకుపోవడంతో నీటి నాణ్యత దెబ్బతీయనే పరిస్థితి ఏర్పడింది. ఈ సమస్యను పరిష్కరించడానికి రంగనాథ అధికారులకు అనేక రకాలుగా సూచనలు చేశారు. చెరువులో పేరుకుపోయిన బయో వేస్ట్.. మురుగును తొలగించారు.
మురుగునీరు చెరువులోకి చేరకుండా పైప్ లైన్ ఏర్పాటు చేశారు. వర్షపు నీరు మాత్రమే చెరువులోకి చేరే విధంగా ఇన్ లెట్ లను అభివృద్ధి చేశారు. మురుగునీటి శుద్ధి కోసం ఎస్ టి పి ఏర్పాటుకు ప్రతిపాదన రూపొందించారు. చెరువు పరిసర ప్రాంతాలలో ప్లాస్టిక్ వ్యర్ధాలను సేకరించి.. వేరు చేసే కేంద్రాలు కాలుష్యానికి కారణమవుతున్న నేపథ్యంలో.. వాటిని అక్కడి నుంచి తొలగించారు. రంగనాథ్ దృష్టిలో చెరువు పునరుద్ధరణ అంటే కేవలం నీటిని నిల్వ చేయడం మాత్రమే కాదు.. నగర ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించేలా అభివృద్ధి చేయడం కూడా.. ఈ చెరువు చుట్టూ 1.25 కిలోమీటర్ల పొడవు వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేశారు. రోజ్ గార్డెన్ ఏర్పాటు చేశారు. రెండు గెబీబో లు ఏర్పాటు చేశారు. ఓపెన్ జిమ్ లు నిర్మించారు. పిల్లలకు ఆట స్థలాలు ఏర్పాటు చేశారు. సందర్శకులు కూర్చోవడానికి విశ్రాంతి ప్రాంతాలు నిర్మించారు. చెరువు చుట్టూ పచ్చదనం నిర్మించే విధంగా చర్యలు చేపట్టారు. ఈ పనుల కోసం హైడ్రా 20 కోట్లు ఖర్చు చేసింది.
ఈ చెరువు చుట్టూ మాదాపూర్ శిల్పారామం.. మెటల్ చార్మినార్ ప్రాంతాలలో వర్షాకాలంలో నీరు నిలిచిపోవడం కూడా ఒక సమస్య. కాబట్టి చెరువు సుందరి కరణతో పాటు వర్షం నీటి ప్రవాహానికి సరైన మార్గాలు ఏర్పాటు చేయడంపై రంగనాథ్ దృష్టి పెట్టారు. వర్షపు నీరు చెరువులోకి చేరే విధంగా ఇన్ లెట్ లు ఏర్పాటు చేశారు. చెరువు నుంచి అదనపు నీరు బయటకు వెళ్ళేందుకు అవుట్ లెట్ పైప్ లైన్ నిర్మించారు. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చే వరద నీటిని చెరువులోకి మళ్లించే ఏర్పాటు చేశారు. కిందివైపు ఉన్న ముండ్ల కత్వ చెరువుతో నీటి ప్రవాహ అనుసంధానాన్ని మెరుగుపరిచారు. 2026 ఏప్రిల్ లో హైడ్రా.. సైబరాబాద్ మునిసిపల్ అధికారులు సమీకంగా పరిశీలన జరిపారు. వరద నీటి మళ్లింపు వ్యవస్థను మరింత మెరుగుపరిచారు.
అనేక సవాళ్లు
తమ్మిడి కుంట చుట్టూ ఆక్రమణలు తొలగింపు అత్యంత చర్చకు దారి తీసింది. ముఖ్యంగా ఒక సినీ నటుడి కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతతో ఈ వ్యవహారం రాజకీయంగా.. సామాజికంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఆక్రమణలు తొలగించిన తర్వాత చెరువు పరిశుభ్రంగా మారలేదు. మురుగునీరు.. ప్లాస్టిక్.. బయో వేస్ట్.. మళ్లీ చేరుకుండా హైడ్రా రంగనాథ్ చర్యలు తీసుకున్నారు. చెరువు ఎఫ్ టి ఎల్.. బఫర్ జోన్ల పరిధిలో ఉన్న భూముల విషయంలో యాజమాన్య హక్కులు.. నోటీసులు.. కోర్టు ఆదేశాలు వంటివి కీలకంగా మారాయి. హైడ్రా చర్యలపై కొంతమంది భూ యజమానులు న్యాయస్థానాలను ఆశ్రయించారు. 2025 నవంబర్లో ఖానామెట్ ప్రాంతంలో తమ్మిడికుంటకు సంబంధించిన ప్రైవేట్ భూములపై చర్యలు.. కోర్టు స్టేటస్కు ఉత్తర్వుల అమలు అంశంపై తెలంగాణ హైకోర్టు హైడ్రాను ప్రశ్నించింది. చట్టపరమైన విధానాలను పాటించాల్సిన అవసరాన్ని న్యాయస్థానం స్పష్టం చేసింది.
చెరువును అందంగా బాగు చేయడం ఒక భాగమైతే.. భవిష్యత్తులో మళ్ళీ ఆక్రమణలు చోటు చేసుకోకుండా చూడడం.. చెత్త పేరుకుపోకుండా పర్యవేక్షించడం.. మురుగునీరు చేరకుండా అడ్డుకోవడం అసలైన పరీక్ష. దీనికోసం రంగనాథ్ చెరువు చుట్టూ కంచె నిర్మించారు.. ఇప్పుడు చెరువు విస్తీర్ణం సుమారు 30 ఎకరాలకు పెరిగింది. గతంలో మిగిలిన విస్తీర్ణం 14 ఎకరాలు మాత్రమే ఉండేది. ఇక వాకింగ్ ట్రాక్ 1.25 కిలోమీటర్ల మేర ఏర్పాటు చేశారు. అభివృద్ధి కోసం 20 కోట్లు ఖర్చు చేశారు.
View this post on Instagram