India Today Exit Poll: నిన్న తమిళ నాడు, వెస్ట్ బెంగాల్ రాష్ట్రాల్లో ఎన్నికల పోలింగ్ శాతం చూసి రాజకీయ విశ్లేషకులు సైతం నోరెళ్లెబెట్టారు. ఈ రేంజ్ హిస్టారికల్ ఓటింగ్ ని ఇప్పటి వరకు చూడలేదని , కచ్చితంగా ఎదో మ్యాజిక్ జరగబోతుందని కామెంట్స్ చేశారు. తమిళనాడు ఎన్నికల్లో సూపర్ స్టార్ విజయ్ పార్టీ పోటీ చేయడం వల్ల, యూత్ ఓటర్లు బారులు తీసి మరీ ఓట్లు గుద్దారని , విజయ్ గేమ్ చేంజర్ గా ఈ ఎన్నికల్లో నిలుస్తాడని , ఆయనకు 15 నుండి 20 శాతం ఓటింగ్ వస్తుందని , 7 నుండి 10 సీట్లు వస్తాయని , ఇలా ఎన్నో రకాల విశ్లేషణలు వచ్చాయి. కానీ ఈ ఎన్నికల ఓటింగ్ శాతం పెరగడం లో విజయ్ వేవ్ ప్రమేయం ఏమి లేదని రాజకీయ విశ్లేషకులు చెప్తున్న మాట. పూర్తి వివరాల్లోకి వెళ్తే ఈ స్థాయి ఓటింగ్ శాతం పెరగడానికి ముఖ్య కారణం ‘sir’ ప్రక్రియే అని అంటున్నారు విశ్లేషకులు.
ఈ ప్రక్రియ ద్వారా ఫేక్ ఓటర్ల జాబితాని తొలగించారు. చాలా మంది చనిపోయినప్పటికీ , పక్క రాష్ట్రాలకు , పక్క దేశాలకు శాశ్వతంగా వలస వెళ్ళిపోయినప్పటికీ , వాళ్ళ పేర్లు ఓటర్ల జాబితాలో ఉండడం , అదే విధంగా అక్రమ ఓటర్లు కూడా ఉండడాన్ని గమనించి ఈ ప్రక్రియ ద్వారా తమిళనాడు , వెస్ట్ బెంగాల్ రాష్ట్రాల్లో చెరో కోటి ఓట్లను తొలగించారు. అలా తొలగించడం వల్లే ఈ రేంజ్ ఓటింగ్ శాతం నమోదు అయ్యిందని, కానీ ఓట్ల సంఖ్య గత ఎన్నికల తో పోలిస్తే కేవలం 20 లక్షలు మాత్రమే పెరిగిందని, ఇది చాలా సాధారణం అంటూ చెప్పుకొచ్చారు విశ్లేషకులు. ఇదంతా పక్కన పెడితే ఇండియా టుడే ఎన్నికలు ముగిసిన తర్వాత చేసిన ఎగ్జిట్ పోల్ సర్వే లో DMK పార్టీ రెండవ సారి అధికారం చేపట్టబోతున్నట్టు తెలుస్తోంది.
ఈ పార్టీ కి దాదాపుగా 150 కి పైగా స్థానాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అదే విధంగా NDA కూటమికి 70 కి పైగా స్థానాలు వచ్చే అవకాశం ఉందని , కానీ విజయ్ TVK పార్టీ కి సున్నా నుండి 1 స్థానం వచ్చే అవకాశాలు ఉన్నాయని , ఓటింగ్ శాతం TVK పార్టీ కి 9 నుండి 11 శాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇదే ఇండియా టుడే సర్వే ఎన్నికల ముందు TVK పార్టీ కి 12 నుండి 15 శాతం ఓట్లు నమోదు అవుతాయని చెప్పుకొచ్చింది. కానీ ఎన్నికలు పూర్తి అయ్యాక లెక్కలు ఎలా మారిపోయాయి చూడండి. మరి రాబోయే రోజుల్లో ఎగ్జిట్ పోల్స్ సర్వేలు ఏమి చెప్పబోతున్నాయో చూడాలి.