Homeఎంటర్టైన్మెంట్Tamannaah Bhatia Mysore Sandal Soap Ad: షాకింగ్.. మైసూర్ శాండిల్ సోప్ యాడ్ కి...

Tamannaah Bhatia Mysore Sandal Soap Ad: షాకింగ్.. మైసూర్ శాండిల్ సోప్ యాడ్ కి తమన్నా తీసుకుంటున్న రెమ్యూనరేషన్ తో ఒక సినిమా తీయొచ్చు తెలుసా!

Tamannaah Bhatia Mysore Sandal Soap Ad: పాన్ ఇండియా లెవెల్ లో మంచి క్రేజ్ ని సొంతం చేసుకున్న స్టార్ హీరోయిన్స్ లో ఒకరు తమన్నా. తెలుగు, తమిళ భాషల్లో వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తూ టాప్ స్టార్ గా ఎదిగిన రష్మిక, ఇప్పుడు బాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ గా గడుపుతోంది. అప్పుడప్పుడు ఈమె సౌత్ సినిమాల్లో కూడా సందడి చేస్తోంది. కేవలం గ్లామర్ రోల్స్ కి మాత్రమే పరిమితం అవ్వకుండా నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు మాత్రమే ఈమె చేస్తోంది. అయితే తమన్నా తన కెరీర్ ప్రారంభం నుండి ఇప్పటి వరకు ఎన్నో కమర్షియల్ యాడ్స్ లో నటించి ఉంటుంది. ఒక్కో యాడ్ కి ఆమె అప్పట్లో కోటి నుండి రెండు కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ తీసుకునేది. కానీ రీసెంట్ గానే ఆమె ఒప్పుకున్న మైసూర్ శాండిల్ సోప్ యాడ్ కు అందుకున్న రెమ్యూనరేషన్ ఇప్పుడు ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ గా మారింది, ఈ డబ్బుతో ఒక సినిమా తీసేయొచ్చు కదరా అంటూ సోషల్ మీడియా లో నేటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే మైసూర్ శాండిల్ సోప్ ని కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం చాలా కాలం నుండి రన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రోడక్ట్ ని దేశం మొత్తం వ్యాపించేలా కొత్త రకమైన మైసూర్ శాండిల్ సోప్స్ ని ప్రభుత్వం తయారు చేయించింది. దీనికి ప్రచారకర్తగా ప్రభుత్వం తమన్నా ని ఎంచుకుంది. ఒక్క యాడ్ వీడియో చేయడం కోసం ప్రభుత్వం ఆమెకు అక్షరాలా 6.2 కోట్ల రూపాయిలు రెమ్యూనరేషన్ ఇచ్చినట్టు తెలుస్తోంది. రెండేళ్ల పాటు ఆమె ఈ ప్రోడక్ట్ కి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహారించేబోతుంది. తమన్నా ప్రస్తుతానికి ఒక్కో సినిమాకు 3 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ తీసుకుంటుంది. అలాంటిది ఆమెకు ఒక చిన్న యాడ్ కోసం డబుల్ రెమ్యూనరేషన్ ఇవ్వడం ఇప్పుడు కర్ణాటక రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది.

ప్రతిపక్షాలు ప్రభుత్వం తమన్నా ని మైసూర్ శాండిల్ సోప్ కి ప్రచారకర్త గా ఎంచుకోవడంపై తీవ్రమైన అభ్యంతరం వ్యక్తం చేసింది. కర్ణాటక రాష్ట్రం లో ఎంతో మంది స్టార్ హీరోయిన్లు ఉండగా, వాళ్ళను వదిలేసి నార్త్ ఇండియా కి చెందిన తమన్నా, ప్రజా దనాన్ని రెమ్యూనరేషన్ గా ఇచ్చి ఇక్కడికి తీసుకొని రావడం ఏంటి?, కాంగ్రెస్ పార్టీ కి ప్రాంతీయ భావం అసలు లేదంటూ పెద్ద ఎత్తున రచ్చ చేస్తున్నారు. ఇది ఏమైనా తమన్నా మాత్రం బంపర్ ఛాన్స్ కొట్టేసింది అనే చెప్పాలి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular