Tamannaah Bhatia: మిల్కీ బ్యూటీగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న నటి తమన్న… గత 20 సంవత్సరాల నుంచి సినిమా ఇండస్ట్రీలో తన సత్తా చాటుతూ ముందుకు సాగుతోంది. చాలామంది హీరోయిన్లు తనకు పోటీగా వచ్చినప్పటికి తన అందంతో అభినయంతో ప్రేక్షకులను ఎప్పటికప్పుడు ఎంటర్ టైన్ చేస్తూ తనకు ఎవరూ పోటీ లేరు, పోటీ రారు అనే రేంజ్ లో ముందుకు దూసుకెళ్తోంది… రీసెంట్ గా జరిగిన న్యూ ఇయర్ వేడుకల్లో ఆరు నిమిషాలకు 6 కోట్ల రూపాయలను చార్జ్ చేసింది అంటూ బాలీవుడ్ మీడియా కోడై కూస్తుంది. ఇక విషయంలోకి వెళ్తే న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా గోవాలోని ఒక రెస్టారెంట్లో న్యూ ఇయర్ వేడుకలను చాలా గ్రాండ్ గా నిర్వహించారు… అందులో ఆరు నిమిషాల పాటు ఆడి పాడిన తమన్నా ఆరు కోట్ల రూపాయలను తీసుకుందని నిమిషానికి కోటి రూపాయల చొప్పున ఛార్జ్ చేసింది అంటూ సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు.
ఒక నిమిషానికి కోటి రూపాయలు అంటే మామూలు విషయం కాదు. మిల్క్ బ్యూటీ తన అంద చెందాలను ఆరబోస్తూ 6 నిమిషాల్లో 6 కోట్లు తీసుకోవడం అంటే చాలా గ్రేట్ అంటూ చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. ఇక తమన్నా కొన్ని సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేసింది. వాటికి సైతం భారీగా రెమ్యునరేషన్స్ ను చార్జ్ చేసింది. రజనీకాంత్ హీరోగా వచ్చిన ‘జైలర్’ సినిమాలో ‘కావాలయ్యా’ అనే సాంగ్ చేసింది.
అయితే ఈ ఐటెం సాంగ్ ఆమె 2 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ ను తీసుకుందట. ఇక ఏది ఏమైనా కూడా ఆ సాంగ్ తోనే ఆమె నార్త్ లో సైతం పాపులారిటిని సంపాదించుకుంది. ఇక స్త్రీ2 సినిమాలో ఆజ్ రాత్ అనే సాంగ్ లో ఆడి పాడింది. దాంతో ఆమె ఇండియా వైడ్ గా పాపులారిటిని సంపాదించుకుంది…
ఆరు నిమిషాలకు 6 కోట్లు ఇచ్చి మరి తనని ఆ ఈవెంట్ లో భాగం చేసి ఆ వేడుకను సక్సెస్ ఫుల్ గా నిలిపారు… ప్రస్తుతం తమన్నా సీనియర్ హీరోల సినిమాల్లో మాత్రమే హీరోయిన్ గా చేస్తోంది. తనని యంగ్ హీరోలు పట్టించుకోవడం లేదు. ఏది ఏమైనా కూడా ప్రస్తుతం ఆమె 20 సంవత్సరాలకు పైన ఇండస్ట్రీలో కొనసాగుతుందంటే నిజంగా చాలా గ్రేట్ అనే చెప్పాలి…