Odela 2 Movie : తమన్నా(Tamannaah Bhatia) ప్రధాన పాత్రలో సంపత్ నంది(Sampath Nandi) దర్శకత్వం లో తెరకెక్కిన ‘ఓదెల 2′(Odela 2 Movie) చిత్రం ఇటీవలే భారీ అంచనాల నడుమ విడుదలై మొదటి ఆట నుండే డివైడ్ టాక్ ని తెచ్చుకొని బాక్స్ ఆఫీస్ వద్ద కమర్షియల్ ఫెయిల్యూర్ గా నిల్చిన సంగతి తెలిసిందే. లాక్ డౌన్ సమయం లో ఓటీటీ లో విడుదలైన ‘ఓదెల రైల్వే స్టేషన్’ అనే చిత్రానికి సీక్వెల్ ఇది. హెబ్బా పటేల్ ప్రధాన పాత్ర పోషించిన ఆ చిత్రం అప్పట్లో ఒక సెన్సేషన్ సృష్టించింది. థియేటర్స్ లో ఈ సినిమా విడుదల అయ్యుంటే కచ్చితంగా ఇండస్ట్రీ లో బాక్స్ ఆఫీస్ వద్ద సంచలన వసూళ్లు నమోదు అయ్యేవి అంటూ అప్పట్లో రివ్యూయర్స్ కూడా కితాబిచ్చారు. అలాంటి సినిమాకు సీక్వెల్, పైగా తమన్నా లాంటి లేడీ సూపర్ స్టార్ అందులో హీరోయిన్ అంటే, కచ్చితంగా అంచనాలు భారీగా ఉండడం సహజం.
ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమా నాన్ థియేట్రికల్ బిజినెస్, థియేట్రికల్ బిజినెస్ భారీ రేట్ కి జరిగింది. ఈ చిత్రం కోసం ఖర్చు చేసిన బడ్జెట్ మొత్తం విడుదలకు ముందే రీ కవర్ అయిపోయింది అనేది మామూలు విషయం కాదు. అదే విధంగా విడుదలకు ముందు ప్రమోషనల్ కంటెంట్ కూడా ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంది. అయినప్పటికీ సినిమాలో అందుకు తగ్గ విషయం లేకపోవడం తో కమర్షియల్ గా ఫెయిల్ అయ్యింది. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ని అమెజాన్ ప్రైమ్ సంస్థ ఏకంగా 15 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. ఈ సినిమా ఓటీటీ విడుదల కోసం ప్రేక్షకులు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నారు. అలా ఎదురు చూస్తున్న వారికి ఇప్పుడు ఒక శుభవార్త. ఈ నెల 17 వ తారీఖు నుండి ఈ సినిమా తెలుగు తో పాటు ఇతర ప్రాంతీయ భాషల్లో కూడా అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులోకి రానుంది.
థియేటర్స్ లో మిశ్రమ స్పందన దక్కించుకున్న ఈ చిత్రానికి కనీసం ఓటీటీ లో అయినా మంచి రెస్పాన్స్ వస్తుందో లేదో చూద్దాం. ఇంతకీ ఈ చిత్రం కథ ఏమిటంటే, ఊర్లో అమ్మాయిలపై అరాచకాలు చేసే ఒక మృగాడిని, అతని భార్య (హెబ్బా పటేల్) నరికేస్తుంది. ఆ తర్వాత ఆ మృగాడి ఆత్మ ప్రేతాత్మ గా మారి ఊర్లో ఎన్నో అరాచకాలు చేస్తూ ఉంటుంది. అప్పుడు లేడీ అఘోరీ గా ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ తమన్నా, ఆ ప్రేతాత్మ ని ఎలా అంతం చేసింది అనేదే స్టోరీ. మొదటి 20 నిమిషాలు సినిమా చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ తర్వాత మాత్రం రొటీన్ అనిపిస్తుంది. కానీ ఇలాంటి జానర్ సినిమాలను ఇష్టపడే వాళ్ళు ఉంటారు. టాక్ వల్ల వాళ్ళు థియేటర్స్ లో ఈ సినిమాని చూసి ఉండకపోయి ఉండొచ్చు కానీ, కచ్చితంగా ఓటీటీ లో మాత్రం చూస్తారు. మరి వాళ్ళ నుండి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.
Also Read : Also Read : దేవర 2′ టీజర్ విడుదల తేదికి ముహూర్తం ఫిక్స్..ఫ్యాన్స్ కి స్వీట్ సర్ప్రైజ్!