spot_img
Homeఎంటర్టైన్మెంట్Venkatesh-Soundarya: వెంకటేష్ - సౌందర్య హిట్ పెయిర్ లో వచ్చిన సినిమాలు.. అందులో ఏవి హిట్టో...

Venkatesh-Soundarya: వెంకటేష్ – సౌందర్య హిట్ పెయిర్ లో వచ్చిన సినిమాలు.. అందులో ఏవి హిట్టో తెలుసా?

Venkatesh-Soundarya: తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో హిట్ కాంబినేషన్ లు ఉన్నాయి. ఒకసారి ఒక జంట హిట్ కొట్టింది అంటే.. అదే జంటతో మరో సినిమా తీయాలని చూస్తారు దర్శకనిర్మాతలు. రీసెంట్ గా విజయ దేవరకొండ, రష్మిక మందనల కాంబినేషన్ ఏ విధంగా హిట్ అయిందో చెప్పాల్సిన అవసరం లేదు. గతంలో ప్రభాస్, కాజల్ కాంబినేషన్ లో మిస్టర్ పర్వెక్ట్, డార్లింగ్ సినిమాలు వచ్చాయి. ఈ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్నాయి. అయితే గతంలో కూడా ఇదే విధంగా హిట్ కొట్టిన కాంబినేషన్ ఏదంటే.. టక్కున గుర్తు వచ్చే పేరు వెంకటేష్, సౌందర్య. మరి వీరి కాంబోలో వచ్చి హిట్ అయిన సినిమాలు ఏంటో చూసేద్దాం…

1 రాజా..
వెంకీ, సౌందర్య కాంబినేషన్ అనగానే ముందుగా గుర్తుకు వచ్చే సినిమా రాజా. ఈ సినిమాను ఇప్పటికీ ఇష్టపడే ప్రేక్షకులు ఉన్నారు. ఈ తరం వారు కూడా రాజా సినిమాను ఇష్టపడుతారు. రిలీజై కొన్ని సంవత్సరాలు గడుస్తున్న ఈ సినిమాకు ఉన్న క్రేజ్ కొంచెం కూడా తగ్గలేదు. అయితే ముప్పలనేని శివ దర్శకత్వం వహించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుంది.

2 పవిత్ర బంధం..
వెంకటేష్ , సౌందర్య కలిసి చాలా సినిమాల్లో మెప్పించారు. ఈ ఇద్దరి జంటకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఆన్ స్క్రీన్ లో వీరి కెమిస్ట్రీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అలాగే ఈ కాంబోలో వచ్చిన సినిమాల్లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన సినిమా పవిత్ర బంధం. పవిత్ర బంధం సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాలో సౌందర్య నటన ప్రేక్షకులను ఫిదా చేసింది. ఈ మూవీలో వెంకటేష్ కు తండ్రిగా గాన గంధర్వుడు బాలసుబ్రహ్మణ్యం నటించారు. అంతేకాదు ఏకంగా ఆరు భాషల్లో రిలీజ్ అయ్యింది పవిత్ర బంధం. తెలుగులో ఈ సినిమాకు ముత్యాల సుబ్బయ్య దర్శకత్వం వహించారు.

3 ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు..
వెంకటేష్ నటించి మెప్పించిన కామెడీ ఎంటర్టైనర్స్ లో ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు సినిమా ఒకటి. ఈ సినిమా అప్పట్లో మంచి విజయాన్ని అందుకుంది. వెంకటేష్ సరసన ఈ సినిమాలో సౌందర్య నటించింది. ఈ సినిమాకు ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వం వహించారు. ఇది తమిళ చిత్రం తైకులమే తైకులమే కు రీమేక్.

4 పెళ్లి చేసుకుందాం..
పెళ్లి చేసుకుందాం సినిమా 1997లో విడుదలై సూపర్ సక్సెస్ ను సాధించింది. ఈ సినిమాకు ముత్యాల సుబ్బయ్య దర్శకత్వం వహించారు. దీనిని గీతా చిత్ర ఇంటర్నేషనల్ కింద సి. వెంకట్ రాజు మరియు జి. శివరాజు నిర్మించారు. ఇందులో వెంకటేష్ , సౌందర్య, లైలా నటించగా , కోటి సంగీతం సమకూర్చారు.

5 దేవి పుత్రుడు..
విక్టరీ వెంకటేష్, సౌందర్య జంటగా నటించిన దేవి పుత్రుడు బ్లాక్ బస్టర్ హిట్ ను సాధించింది. 2001లో డైరెక్టర్ కోడి రామకృష్ణ తెరకెక్కించిన ఈ సినిమా సెన్సెషన్ సృష్టించింది. ఇందులో అంజలా జవేరి.. సురేష్ ముఖ్య పాత్రలు పోషించారు. ద్యాపర యుగంలో నీట మునిగిన ద్వారక ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈచిత్రంలోని సాంగ్స్ శ్రోతలను ఎంతగానో ఆకట్టుకున్నాయి

6 జయం మనదేరా..
వెంకటేష్ సూపర్ హిట్ ఫిలిం జయం మనదేరా సినిమా గుర్తుందా ? ఈ సినిమాలో వెంకటేష్, సౌందర్య జంటగా నటించగా, 2000 సంవత్సరం లో విడుదలై సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఇక ఈ సినిమాను డి సురేష్ బాబు నిర్మించారు.

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.

Related News

Most Popular

Balakrishna

Balakrishna: బాలయ్య ను కలిసిన కొరటాల శివ…ఆ విషయంలో భరోసా ఇచ్చిన నటసింహం…

Balakrishna: నందమూరి నటసింహం బాలయ్య బాబు కి రీసెంట్ గా షూటింగ్ స్పాట్లో గాయమైన విషయం మనందరికీ తెలిసిందే. తన మజిల్ కి ఇంజురీ అవ్వడం వల్ల సర్జరీ చేసిన డాక్టర్లు అతనికి...
Thalapathy Vijay

Thalapathy Vijay: దళపతి విజయ్ ఆ విషయంలో తేలిపోయాడు…

Thalapathy Vijay: తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన 'జన నాయకుడు' సినిమా రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే ఈ సినిమా తెలుగులో బాలయ్య బాబు...
Anil Ravipudi

Anil Ravipudi: అనిల్ రావిపూడి మామూలోడు కాదుగా…

Anil Ravipudi: సినిమా ఇండస్ట్రీలో కమర్షియల్ సినిమాలను చేసి సూపర్ సక్సెస్ ని సాధించడం అనేది అంత ఆషామాషీ వ్యవహారం కాదు. ప్రయోగాత్మకమైన సినిమాలను చేస్తే సక్సెస్ లు వచ్చే అవకాశం ఎక్కువగా...
Venu Swamy Bigg Boss Remuneration

Venu Swamy Prediction : కాక్రోచ్ జనతా పార్టీ భవిష్యత్తుపై వేణుస్వామి హాట్ కామెంట్స్.. వీడియో వైరల్..

Venu Swamy Prediction : ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి ఒకప్పుడు ఎలాంటి వివాదాస్పద జాతకాలు చెప్పేవాడో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆయన చెప్పే జాతకాలు కారణంగా సోషల్ మీడియా లో తీవ్రమైన...

Narendra Modi : వెన్నుచూపని మోడీ తగ్గాడా.. కాక్రోచ్ ల చేతిలో ఓడిపోయాడా

Narendra Modi : అవి అసాంఘిక శక్తులని తెలుసు. అవి చేస్తున్న ఉద్యమం సో కాల్డ్ అని కూడా తెలుసు. దానిని ఎలా వంచాలో కూడా తెలుసు. అయినప్పటికీ నరేంద్ర మోడీ బయపడ్డారు....
Oktelugu Epaper