Tollywood: ఒక సినిమాకు కథ ఎంతో ముఖ్యం. కథ నటీనటులు, స్టార్ ఫేస్ లు కూడా ఎంతో ముఖ్యం. ఇలా సినిమాకు ప్రతి ఒక్క భాగం ప్రాణం పోస్తుంది. అంతేకాదు టైటిల్ కూడా సినిమాకు ప్రాణం పోస్తుంది. సినిమా టైటిల్ ఇంట్రెస్ట్ గా లేకపోతే ఆ సినిమా ఫెయిల్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. అందుకే ఒక సినిమా టైటిల్ ను నిర్ణయించటానికి దర్శకనిర్మాతలు తలలు బద్దలు కొట్టుకుంటారు. అందుకే టైటిల్ విషయంలో కొంచెం కూడా రాజీ పడరు మేకర్స్. అయితే సినిమా కథకు తగిన టైటిల్ ను పెట్టేందుకు కొన్ని కొన్ని సార్లు దర్శకనిర్మాతలు పాత సినిమాల టైటిల్స్ ను కూడా ఎంచుకుంటారు. అలా గతంలో ఉన్న సినిమా టైటిల్స్ ప్రస్తుతం కూడా రిపీట్ అవుతుంటాయి. అందులో కొన్ని మనం ఇప్పుడు చూసేద్దాం..
ఒకే సినిమా టైటిల్ తో ఒకటి రెండు కాదు కొన్ని సార్లు మూడు సినిమాలు కూడా రిలీజ్ అయ్యాయి. ఇందులో ముఖ్యంగతా చిరంజీవి హీరోగా వచ్చిన ఖైదీ సినిమా ఆయన కెరీర్ నే మలుపు తిప్పింది.ఆ తర్వాత ఖాదీ నెంబర్ 150 కూడా చిరంజీవే చేశారు. కానీ ఇదే టైటిల్ లో కార్తీ కూడా మూడో సినిమాలో నటించారు. అలా ఒకే టైటిల్ తో మూడు వేరువేరు సినిమాలు వచ్చాయి. కానీ మూడు భిన్నమైన సినిమాలు.
చిరంజీవి హీరోగా వచ్చిన మరో సినిమా టైటిల్ కూడా రిపీట్ అయ్యాయి. అదేనండి రాక్షసుడు సినిమా. 1986 లో రిలీజ్ అయినా రాక్షసుడు సినిమా టైటిల్ తో మరో మూడు సినిమాలు వచ్చాయి. తమిళ్ హీరో సూర్య కూడా ఇదే టైటిల్ తో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. రీసెంట్ గా బెల్లంకొండ శ్రీనివాస్ కూడా రాక్షసుడు సినిమా టైటిల్ తో మూడో సినిమా చేశారు.
దేవదాసు సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమా పేరు తీస్తే ముందుగా రామ్ గుర్తుకు వస్తారు. కానీ అంతుకు ముందే 1953 సంవత్సరంలో దేవదాసు సినిమా రిలీజై సంచలనం సృష్టించింది. ఆ తర్వాత 2016 లో ఇదే టైటిల్ తో రామ్ హీరోగా ఎంట్రీ ఇవ్వడమే కాకుండా మంచి హిట్ ను తన ఖాతాలో వేసుకున్నారు. ఇక ఇదే టైటిల్ తో నాగార్జున,నాని కూడా ప్రేక్షకులను అలరించారు.
గతంలో అక్కినేని నాగేశ్వరరావు శ్రీమంతుడు సినిమా తీస్తే.. ఇప్పుడు మహేష్ బాబు అదే టైటిల్ తో ప్రేక్షకులను ఏడిపించాడు. ఎమోషన్, లవ్ వంటి సీన్స్ తో సినిమా అదిరిపోయింది. వెంకటేష్, నితిన్ కూడా శ్రీనివాస కళ్యాణం అనే ఒకే టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇక మహేష్ బాబు నటించిన మహర్షి సినిమా కూడా ముందుగానే వచ్చింది. ఈ సినిమా టైటిల్స్ తో రెండు సినిమాలు వచ్చాయి. ఇక పవన్ కళ్యాణ్ భూమిక కాంబినేషన్ లో వచ్చిన ఖుషీ సినిమా ఏ రేంజ్ లో హిట్ అయిందో తెలిసిందే. ఇదే టైటిల్ తో రీసెంట్ గా సమంత విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో ఖుషీ సినిమా వచ్చింది. ఈ సినిమా కూడా సూపర్ హిట్ గా నిలిచింది. వెంకటేష్, రామ్ కూడా గణేష్ అనే టైటిల్ తో సినిమా చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్, వరుణ్ తేజ్ కూడా తొలిప్రేమ అనే టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇక బాలకృష్ణ గారు మరియు కార్తీ సుల్తాన్ అనే ఒకే టైటిల్ తో ప్రేక్షకులను అలరించారు.
ఇలా చాలా సినిమాలు ఒకే పేరుతో రెండు మూడు సార్లు రిపీట్ అయ్యాయి. అందులో చాలా వరకు బ్లాక్ బస్టర్ హిట్ లను సొంతం చేసుకున్నవే.. మరి ఇంతటి సక్సెస్ ను సాదించినా ఆ సినిమాలు కేవలం సినిమా టైటిల్ తోనా? అనే సందేహం మీలో కలగవచ్చు. కానీ కథ, నటన అన్నీ బాగుంటేనే ఒక సినిమా హిట్ అవుతుంది.