Homeఎంటర్టైన్మెంట్Sudigali Sudheer career growth: సుడిగాలి సుధీర్ రాబోయే రోజుల్లో మరో శివ కార్తికేయన్ కాబోతున్నాడా?...

Sudigali Sudheer career growth: సుడిగాలి సుధీర్ రాబోయే రోజుల్లో మరో శివ కార్తికేయన్ కాబోతున్నాడా? ప్లానింగ్ చూస్తే అలాగే ఉంది!

Sudigali Sudheer career growth: మన టాలీవుడ్ లో బుల్లితెర నుండి వెండితెర కి వెళ్లి సక్సెస్ సాధించిన వాళ్ళు చాలా తక్కువ. బాలీవుడ్ లో షారుక్ ఖాన్ బుల్లితెర సీరియల్స్ నుండే సినిమాల్లోకి వచ్చాడు, ఆ తర్వాత కన్నడ లో రాకింగ్ స్టార్ గా పిలవబడే యాష్ కూడా సీరియల్స్ ద్వారానే సినిమాల్లోకి వచ్చి , నేడు పాన్ ఇండియన్ సూపర్ స్టార్ అయ్యాడు. ఇక తమిళం లో శివ కార్తికేయన్ గురించి ప్రత్యేకించి మాట్లాడుకోవాలి. […]

Sudigali Sudheer career growth: మన టాలీవుడ్ లో బుల్లితెర నుండి వెండితెర కి వెళ్లి సక్సెస్ సాధించిన వాళ్ళు చాలా తక్కువ. బాలీవుడ్ లో షారుక్ ఖాన్ బుల్లితెర సీరియల్స్ నుండే సినిమాల్లోకి వచ్చాడు, ఆ తర్వాత కన్నడ లో రాకింగ్ స్టార్ గా పిలవబడే యాష్ కూడా సీరియల్స్ ద్వారానే సినిమాల్లోకి వచ్చి , నేడు పాన్ ఇండియన్ సూపర్ స్టార్ అయ్యాడు. ఇక తమిళం లో శివ కార్తికేయన్ గురించి ప్రత్యేకించి మాట్లాడుకోవాలి. టీవీ షోస్ లో యాంకరింగ్ ద్వారా తమిళ ప్రేక్షకులకు దగ్గరైన ఈయన , ఆ తర్వాత సినిమాల్లోకి కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చి, ఆ తర్వాత హీరోగా మారి నేడు బిగ్గెస్ట్ స్టార్ గా కొనసాగుతున్నాడు. ఇలా మన తెలుగు లో ఇప్పటి వరకు ఎవ్వరూ అవ్వలేదు. చాలా మంది ప్రయత్నాలు చేశారు కానీ, సక్సెస్ అవ్వలేకపోయారు.

కానీ ప్రస్తుతం ఉన్న టీవీ స్టార్ సెలబ్రిటీస్ లో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి సక్సెస్ సాధించేంత కెపాసిటీ కేవలం ఒక్క సుడిగాలి సుధీర్ కి మాత్రమే ఉంది. ఈయన సినిమాలకు జనాలు కదులుతున్నారు. ఇప్పటి వరకు నాలుగు సినిమాలు చేస్తే అన్నిటికి పర్వాలేదు అనే రేంజ్ ఓపెనింగ్స్ వచ్చాయి. ముఖ్యంగా ‘గాలోడు’ చిత్రానికి అయితే మంచి ఓపెనింగ్స్ మాత్రమే కాకుండా, కమర్షియల్ గా కూడా భారీ వసూళ్లు వచ్చాయి. సరైన సినిమాతో వస్తే సుధీర్ పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టే అవకాశం కూడా ఉంది. ఈ నెల 26 న ఆయన హీరో గా నటించిన ‘GOAT ‘ చిత్రం విడుదల కానుంది. ఈ సినిమా ఎప్పుడో నాలుగేళ్ల క్రితం మొదలైంది. కొన్ని అనుకోని సంఘటనల కారణంగా మధ్యలో ఆగిపోవడం , మళ్లీ మొదలు అవ్వడం వంటివి జరగడంతో , ఈ సినిమాపై ఉన్న బజ్ మొత్తం పోయింది.

కానీ పాజిటివ్ టాక్ వస్తే మాత్రం కమర్షియల్ గా ఈ సినిమా దుమ్ము దులిపేస్తుందని అంటున్నారు. ఈ చిత్రం తర్వాత సుడిగాలి సుధీర్ ‘హైలెస్సో ‘ అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ సినిమా కూడా చేస్తున్నాడు. దీనిపై మార్కెట్ లో మంచి బజ్ ఉంది. ఈ సినిమా హిట్ అయితే ఇక సుధీర్ హీరో గా స్థిరపడినట్టే. రాబోయే రోజుల్లో పెద్ద రేంజ్ కి కూడా వెళ్లొచ్చు. పైకి ఎదగాలి అనే కసితో వచ్చిన ప్రతీ అవకాశాన్ని ఉపయోగించుకుంటూ, జబర్దస్త్ ద్వారా కోట్లాది మంది తెలుగు ఆడియన్స్ కి తన కామెడీ టైమింగ్ తో కితకితలు పెట్టిన సుధీర్ , ఇప్పుడు వరుసగా టీవీ షోస్ లో హోస్ట్ గా కొనసాగుతూ , మరోపక్క సినిమాలు చేస్తూ వేరే లెవెల్ కి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. మరి రాబోయే రోజుల్లో ఆయన మరో శివ కార్తికేయన్ లాగా అవుతాడా లేదా అనేది చూడాలి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper