Homeఎంటర్టైన్మెంట్Sudigali Sudheer GOAT movie release date: ఎట్టకేలకు విడుదలకు సిద్దమైన సుడిగాలి సుధీర్ 'GOAT'...

Sudigali Sudheer GOAT movie release date: ఎట్టకేలకు విడుదలకు సిద్దమైన సుడిగాలి సుధీర్ ‘GOAT’ మూవీ.. బంపర్ డేట్ లాక్ చేసుకున్నారుగా!

Sudigali Sudheer GOAT movie release date: బుల్లితెర ద్వారా రెండు తెలుగు ప్రేక్షకుల్లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకొని , తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ఇమేజ్ ని ఏర్పాటు చేసుకున్న సుడిగాలి సుధీర్(Sudigaali Sudheer), వెండితెర పై హీరో గా ఎంట్రీ ఇచ్చి పలు సినిమాలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు ఆయన ‘సాఫ్ట్ వేర్ సుధీర్’, ‘3 మంకీస్’, ‘కాలింగ్ సహస్ర’, ‘గాలోడు’ వంటి చిత్రాల్లో నటించాడు. వీటిల్లో ‘గాలోడు’ […]

Sudigali Sudheer GOAT movie release date: బుల్లితెర ద్వారా రెండు తెలుగు ప్రేక్షకుల్లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకొని , తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ఇమేజ్ ని ఏర్పాటు చేసుకున్న సుడిగాలి సుధీర్(Sudigaali Sudheer), వెండితెర పై హీరో గా ఎంట్రీ ఇచ్చి పలు సినిమాలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు ఆయన ‘సాఫ్ట్ వేర్ సుధీర్’, ‘3 మంకీస్’, ‘కాలింగ్ సహస్ర’, ‘గాలోడు’ వంటి చిత్రాల్లో నటించాడు. వీటిల్లో ‘గాలోడు’ చిత్రం కమర్షియల్ గా హిట్ అయ్యింది. సాధారణంగా సూపర్ హిట్ తర్వాత ఏ హీరో కూడా గ్యాప్ తీసుకోవడానికి ఇష్టం చూపించరు. కానీ సుధీర్ బాగా గ్యాప్ తీసుకున్నాడు. వాస్తవానికి ఆయన గ్యాప్ తీసుకోలేదు, గ్యాప్ వచ్చింది అని చెప్తే బాగుంటుందేమో. చాలా కాలం క్రితమే ఆయన ‘GOAT’ అనే చిత్రాన్ని మొదలు పెట్టి పూర్తి చేసాడు. అయితే ఈ చిత్రం విషయం లో పలు వివాదాలు చేరాయి.

ముందుగా ఈ సినిమాకు నరేష్ కుప్పిలి దర్శకత్వం వహించాడు. కొంత భాగం షూటింగ్ పూర్తి అయ్యాక , ఆయన ఈ సినిమా నిర్మాత తో విభేదించి తప్పుకున్నాడు. సుధీర్ కి నరేష్ తో మంచి సాన్నిహిత్యం ఉంది. నేను ఈ సినిమా చేస్తానని ఒప్పుకున్నదే నరేష్ ని చూసి , ఆయనే వెళ్ళిపోయినప్పుడు ఈ సినిమాని నేనెందుకు చేస్తాను అంటూ సుధీర్ మొదట్లో మొండికేసినప్పటికీ, ఆ తర్వాత నిర్మాత ఎదో విధంగా ఆయన్ని ఒప్పించి , వేదవ్యాస్ ఆకుల అనే కొత్త డైరెక్టర్ తో ఈ సినిమాని పూర్తి అయ్యేలా చేశాడు. గత ఏడాది ఒక ఈవెంట్ ని ఏర్పాటు చేసి ఈ సినిమాని విడుదల చేయబోతున్నామని ఆ చిత్ర నిర్మాత అధికారిక ప్రకటన చేసాడు. టీజర్ ని కూడా అదే ఈవెంట్ లో విడుదల చేశారు. కానీ ఆ టీజర్ కి సుధీర్ డబ్బింగ్ చెప్పలేదు.

Also Read: డబ్బులిచ్చి మరీ నన్ను టార్గెట్ చేస్తున్నారు అంటూ కంటతడి పెట్టుకున్న ‘ఓజీ’ హీరోయిన్!

దీంతో సుధీర్ ఈ సినిమా ప్రొమోషన్స్ లో పాల్గొన్నాడేమో అని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆయన నిర్మాత కోసం ఒక మెట్టు కిందకు దిగొచ్చి డబ్బింగ్ పూర్తి చేసాడు. ప్రొమోషన్స్ లో కూడా ఆయన పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. రీసెంట్ గానే అయన తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా ఈ చిత్రాన్ని మార్చి 26 న విడుదల చేయబోతున్నట్టు చెప్పుకొచ్చాడు. దీనిని బట్టీ చూస్తుంటే సుధీర్ కచ్చితంగా ప్రొమోషన్స్ లో పాల్గొంటాడని తెలుస్తోంది. ఇప్పటి వరకు ఈ చిత్రం నుండి బయటకు వచ్చిన ప్రమోషనల్ కంటెంట్స్ లో , ‘అయ్యో పాపం సారూ ‘ అనే పాటకు బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చింది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ని విడుదల చేసేందుకు సిద్ధం అవుతున్నారు మేకర్స్.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper