Homeఎంటర్టైన్మెంట్Priyanka Arul Mohan emotional statement: డబ్బులిచ్చి మరీ నన్ను టార్గెట్ చేస్తున్నారు అంటూ కంటతడి...

Priyanka Arul Mohan emotional statement: డబ్బులిచ్చి మరీ నన్ను టార్గెట్ చేస్తున్నారు అంటూ కంటతడి పెట్టుకున్న ‘ఓజీ’ హీరోయిన్!

Priyanka Arul Mohan emotional statement: ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలోనే యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ని సంపాదించి తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ఇమేజ్ ని ఏర్పాటు చేసుకున్న హీరోయిన్ ప్రియాంక అరుల్ మోహన్(Priyanka Arul Mohan). తమిళం లో శివ కార్తికేయన్ హీరో గా నటించిన ‘డాక్టర్’ అనే చిత్రం ద్వారా వెండితెర అరంగేట్రం చేసిన ఈమె , ఆ తర్వాత సౌత్ లో ఉన్న స్టార్ హీరోలందరితో నటించి స్టార్ హీరోయిన్ గా మారింది. గత ఏడాది ఈమె పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కలిసి నటించిన ‘ఓజీ ‘ చిత్రం ఎంతటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిల్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ సినిమాతో ఆమె మన టాలీవుడ్ యూత్ ఆడియన్స్ కి కూడా బాగా దగ్గరైంది. ఇప్పుడు లేటెస్ట్ గా ఆమె ‘మేడిన్ కొరియా ‘ అనే చిత్రం లో నటించింది.

డైరెక్ట్ గా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రొమోషన్స్ లో భాగంగా ఆమె ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. ఆమె మాట్లాడుతూ ‘నాపై ట్రోల్స్ , మీమ్స్ చేయడానికి కొంతమంది ప్రత్యేకంగా టీం ని మైంటైన్ చేస్తున్నారు. కేవలం నా ఒక్క దానిపైన మాత్రమే కాదు, పెద్ద పెద్ద హీరోయిన్స్ అందరికీ ఇదే జరుగుతోంది. అయినా ఒకరి మీద ఏడవడానికి ప్రత్యేకంగా డబ్బులిచ్చి చేయించడం ఏంటో అసలు అర్థం అర్థం కావడం లేదు నాకు. నా జీవితంలో అనేక విషయాలు జరిగాయి, వాటి గురించి మాట్లాడిన ఈ ఒక్క ఇంటర్వ్యూ సరిపోదు. అలా జీవితం లో ఎన్నో చూసిన నాకు , ఈ ట్రోలింగ్స్ ఎలాంటి ప్రభావం చూపవు. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు , నేను కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉంటాను’ అంటూ చెప్పుకొచ్చింది.

Also Read: ఉస్తాద్ భగత్ సింగ్ vs దూరంధర్ 2… విజయం సాధించేది ఎవరు..?

ఇంకా ఆమె మాట్లాడుతూ ‘నావరకు అయితే సినీ ఇండస్ట్రీ అనేది ఒక స్థిరత్వం లేని పరిశ్రమ. ఇక్కడ మనం పైకి ఎదుగుతున్న సమయం లో క్రిందకు లాగాలని చూసేవాళ్ళు చాలా మంది ఉంటారు. అలాంటి పరిస్థితులే మనల్ని దృడంగా మారుస్తాయి. వాటిని ఒక్కో మెట్టుగా భావించి పైకి ఎదగడానికి నేను చూస్తుంటాను’ అంటూ చెప్పుకొచ్చింది ప్రియాంక మోహన్. నిజానికి ప్రియాంక పై సోషల్ మీడియా లో జరిగేంత ట్రోలింగ్ , ఏ హీరోయిన్ పై జరగదు అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు. ఆమె ఎక్స్ పేషన్స్ పై, డ్యాన్స్ పై , నటనపై ఎన్నో ట్రోల్స్ ఇన్ స్టాగ్రామ్ , ట్విట్టర్ వంటి మాధ్యమాలలో తరచూ మనం చూసినా ఉంటాము. వీటిని ఆమె బాగానే గమనిస్తుంది ఈ ఇంటర్వ్యూ ద్వారా తెలిసింది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular