Homeఎంటర్టైన్మెంట్Ustaad Bhagat Singh ticket price: ఆంధ్ర ప్రదేశ్ లో 'ఉస్తాద్ భగత్ సింగ్' మూవీ...

Ustaad Bhagat Singh ticket price: ఆంధ్ర ప్రదేశ్ లో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ టికెట్ రేట్స్ ఇవే..ఇంత తక్కువ ఉంటుందని ఊహించలేదు!

Ustaad Bhagat Singh ticket price: సరిగ్గా వారం రోజుల్లో పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) హీరో గా నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad Bhagat Singh) చిత్రం విడుదల కాబోతుంది. గబ్బర్ సింగ్ లాంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత హరీష్ శంకర్ , పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా కావడంతో , ఈ సినిమాపై మొదట్లో భారీ అంచనాలు ఉండేవి. కానీ ఆ తర్వాత షూటింగ్ బాగా ఆలస్యం అవ్వడం […]

Ustaad Bhagat Singh ticket price: సరిగ్గా వారం రోజుల్లో పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) హీరో గా నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad Bhagat Singh) చిత్రం విడుదల కాబోతుంది. గబ్బర్ సింగ్ లాంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత హరీష్ శంకర్ , పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా కావడంతో , ఈ సినిమాపై మొదట్లో భారీ అంచనాలు ఉండేవి. కానీ ఆ తర్వాత షూటింగ్ బాగా ఆలస్యం అవ్వడం తో అంచనాలు తగ్గుతూ వచ్చాయి. మరో వారం రోజుల్లో ఈ సినిమా విడుదల అవ్వబోతున్నప్పటికీ కూడా , ఈ చిత్రం పై రెగ్యులర్ పవన్ కళ్యాణ్ సినిమాకు ఉన్నంత బజ్ , క్రేజ్ మార్కెట్ లో ఏర్పడలేదు. ఆయన గత చిత్రం ఓజీ ఏ రేంజ్ అంచనాల నడుమ విడుదలైందో అందరికీ తెలిసిందే. యూత్ ఆడియన్స్ అయితే మెంటలెక్కిపోయారు. ఆ రేంజ్ హవా మాత్రం ఈ సినిమాకు కనిపించడం లేదు.

బజ్ కి తగ్గట్టే , ఈ సినిమాకు సంబంధించిన టికెట్ రేట్స్ ని నిర్ణయించాలని నిర్మాతలు ఫిక్స్ అయ్యినట్టు తెలుస్తోంది. ఈ చిత్రానికి ప్రీమియర్ షోస్ ఉన్నాయో లేవో అనేది ఇంకా ఖరారు అవ్వలేదు. మేకర్స్ ప్రీమియర్ షోస్ కంటే బెనిఫిట్ షోస్ వైపే ఎక్కువ మొగ్గు చూపుతున్నారట. ఎందుకంటే మార్చి 18 న అమావాస్య కావడం తో ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. అయితే నేడు టికెట్ రేట్స్ కి మేకర్స్ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వద్ద దరఖాస్తు చేసుకున్నట్టు తెలుస్తోంది. ప్రీమియర్ / బెనిఫిట్ షో కి 500 రూపాయిల టికెట్ రేట్స్, అదే విధంగా రెగ్యులర్ షోస్ కి సింగిల్ స్క్రీన్ థియేటర్స్ కి 100 రూపాయిలు, అదే విధంగా మల్టీ ప్లెక్స్ స్క్రీన్స్ కి 125 రూపాయిల వరకు టికెట్ రేట్స్ పెంచుకునేందుకు అనుమతి ని ఇవ్వాలని దరఖాస్తు చేసుకున్నారట.

అయితే ప్రీమియర్ / బెనిఫిట్ షోస్ కి చాలా తక్కువ టికెట్ రేట్స్ పెట్టారని అభిమానులు అనుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గత రెండు చిత్రాలకంటే ఇది చాలా తక్కువ. ‘హరి హర వీరమల్లు’ చిత్రానికి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ 700 రూపాయిల టికెట్ రేట్స్ పెట్టగా, ‘ఓజీ ‘ చిత్రానికి ఆంధ్ర ప్రదేశ్ లో 1000 రూపాయిలు, తెలంగాణ లో 800 రూపాయిలు పెట్టారు. అంత పెట్టినప్పటికీ ఈ టికెట్స్ హాట్ కేక్స్ లాగా అమ్ముడుపోయాయి. అలాంటిది ఇప్పుడు 500 లేక్ టికెట్ రేట్స్ విక్రయించేందుకు సిద్ధం అవుతున్నారు. ఇంత తక్కువ రేట్స్ పెట్టడానికి గల కారణం , సినిమా పై మార్కెట్ లో అనుకున్నంత బజ్ లేదు అనేది ఒక కారణమా అయితే, పవన్ కళ్యాణ్ కి ఒక సంవత్సర కాలంలో ఇది మూడవ సినిమా, కాబట్టి అందరికీ అందుబాటులో ఉండేలా టికెట్ రేట్స్ ఉంచడమే మంచిదని నిర్మాతలు ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఇక తెలంగాణ లో టికెట్ హైక్స్ వస్తాయా , లేదా అనేది ఈ వారం లోనే తేలనుంది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper