Homeఎంటర్టైన్మెంట్NTR: ఎన్టీఆర్ ను పక్కకి తప్పించిన స్టార్ హీరో...

NTR: ఎన్టీఆర్ ను పక్కకి తప్పించిన స్టార్ హీరో…

NTR: తెలుగు సినిమా ఇండస్ట్రీ దశ దిశా మార్చుకుంది. ఒకప్పుడు మూస ధోరణిలో సాగే కథలతో సినిమాలను చేసి ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసిన తెలుగు మేకర్స్ ఇప్పుడు వాళ్ళ పంథా ను మార్చుకున్నారు. యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని మెప్పించగలిగే కెపాసిటి ఉన్న స్టోరీలతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఇండియాలో చాలామంది హీరోలు మన దర్శకులతో పనిచేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు అంటే మన వాళ్ళ రేంజ్ ఏంటో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నిజానికి మన హీరోలతో సినిమాలు చేయడానికి ఇతర భాషల దర్శకులు సైతం ఆసక్తిని చూపిస్తున్నారు. మొత్తానికైతే యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని ఇప్పటివరకు శాసించగలుగుతున్న వాళ్లలో తెలుగు సినిమా ఇండస్ట్రీ కూడా మొదటి స్థానంలో ఉండటం అనేది నిజంగా చాలా గొప్ప విషయం… ఇక రాబోయే సినిమాలతో మరింత ముందుకు దూసుకెళ్లడానికి ప్రయత్నాలైతే చేస్తున్నారు. స్టార్ హీరోలందరు డిఫరెంట్ కథలను చేస్తూ ముందుకు దూసుకెళ్తున్నారు.

జూనియర్ ఎన్టీఆర్ లాంటి నటుడు సైతం ఈ మధ్యకాలంలో చేస్తున్న సినిమాలతో ఏ మాత్రం తన సత్తా చాటలేకపోతున్నాడు. ఇక ఇప్పుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేస్తున్న ‘ డ్రాగన్ ‘ సినిమాతో మరోసారి తన సత్తా ఏంటో చూపించడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు దూసుకెళ్తున్నాడు.

ఇక ఇదిలా ఉంటే ఒకప్పుడు జూనియర్ ఎన్టీఆర్ స్టార్ హీరోలందరికి పోటీని ఇచ్చాడు. యంగ్ హీరోల్లో తనే ముందు వరుసలో ఉండేవాడు. కానీ ఈ మధ్య కాలంలో తనకి అనుకున్న సక్సెస్ లు రాకపోవడంతో ఆయన కొంతవరకు వెనుకబడిపోయాడు. ముఖ్యంగా అల్లు అర్జున్ అలా వైకుంఠపురంలో, పుష్ప, పుష్ప 2 సినిమాలతో వరుసగా హ్యాట్రిక్ విజయాలను నమోదు చేసి తన మార్కెట్ ను పెంచుకున్నాడు. పాన్ ఇండియాలో తనను మించిన హీరోలెవరు లేరనెంతల ముందుకు దూసుకెళ్లాడు. ఒక రకంగా ఎన్టీఆర్ ను భారీ దెబ్బ కొట్టిన హీరో ఎవరైనా ఉన్నారు అంటే అది అల్లు అర్జున్ అనే చెప్పాలి.

ఎన్టీఆర్ మార్కెట్ మొత్తాన్ని తన వైపు తిప్పుకున్నాడు. అందుకే అల్లు అర్జున్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది… ఇప్పుడు డ్రాగన్ సినిమాతో అయిన ఎన్టీఆర్ అల్లు అర్జున్ క్రేజ్ ను బీట్ చేసే విజయాన్ని అందుకుంటాడా? నిజానికి జూనియర్ ఎన్టీఆర్ కి అంత మొత్తంలో కలెక్షన్లు వస్తాయా లేదా అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Tollywood Heroes Injuries

Tollywood Heroes Injuries: టాలీవుడ్ కు ఏంటీ శాపం.. హీరోల వరుస గాయాల వెనుక ఏముంది..?

Tollywood Heroes Injuries: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోలందరు బిజీగా ఉన్నారు. ఒక్కో సినిమాతో ప్రేక్షకులను మెప్పించడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు దూసుకెళుతున్న మన స్టార్ హీరోలు ఎలాంటి డూపులు...
AP Local Body Elections

AP Local Body Elections: ఏపీలో స్థానిక ఎన్నికలు.. 40 రోజుల్లోనే!

AP Local Body Elections: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్న తరుణంలో.. స్థానిక సంస్థల ఎన్నికలను సైతం...
AP BJP

AP BJP: ఏపీ బీజేపీకి ఏమైంది?!

AP BJP: ఏపీలో భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదు. ఆ పార్టీ అనుకున్న స్థాయిలో ముందుకెళ్లడం లేదు. పొత్తులో భాగంగా సీట్లు, ఓట్లు పెరిగాయే తప్ప.. గత...
AP Government Door To Door Campaign

AP Government Door To Door Campaign: చేసింది చెప్పేందుకు…ఏపీలో 45 రోజుల కూటమి ప్రచారం!

AP Government Door To Door Campaign: ఏపీలో టీడీపీ కూటమి పాలన రెండేళ్లు పూర్తి చేసుకుంది. మరో మూడేళ్ల పాలన ఉంది. తొలి రెండేళ్లు కూటమి పాలనపై సంతృప్తి శాతం అధికంగా...
Oktelugu Epaper