Aadarsha Kutumbam Trailer: ‘సంక్రాంతికి వస్తున్నాం’ లాంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్న తర్వాత విక్టరీ వెంకటేష్ నటించిన ‘ఆదర్శ కుటుంబం’ చిత్రం ఎట్టకేలకు విడుదలకు నోచుకుంది. అక్టోబర్ 2 న గాంధీ జయంతి సందర్భంగా ఈ చిత్రాన్ని విడుదల చేద్దామని అనుకున్నారు. కానీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చాలా వరకు బ్యాలన్స్ ఉండడం తో అక్టోబర్ 9 కి వాయిదా వేశారు. అప్పటికీ కూడా వర్క్ పూర్తి అవ్వకపోవడం తో , ఇప్పుడు ఈ చిత్రం అక్టోబర్ 30 న విడుదలకు సిద్ధమైంది. కాసేపటి క్రితమే ఈ సినిమాకు సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ని ఒక గ్రాండ్ లాంచ్ ఈవెంట్ తో విడుదల చేశారు. ఈ ట్రైలర్ కి ఫ్యాన్స్ , ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ప్రతీ షాట్ లోనూ త్రివిక్రమ్ మార్క్ పంచు డైలాగ్స్ ఉన్నాయి.
ఒక మధ్య తరగతి కుటుంబం అనుకోని క్రిమినల్ కేసులో ఇరుక్కోవడం , ఆ కారణం చేత ఆ కుటుంబానికి ఎదురైనా సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్టుగా ట్రైలర్ ని చూస్తుంటే అర్థం అవుతోంది. ఈ చిత్రం లో నారా రోహిత్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఆయన డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఒకపక్క త్రివిక్రమ్ మార్క్ కామెడీ , ఎమోషన్స్ ఉంటూనే , మరోపక్క జెన్ జీ ఆడియన్స్ కి బాగా ఇష్టమయ్యే యాక్షన్ సన్నివేశాలను కూడా ఈ చిత్రం లో జోడించినట్టు ట్రైలర్ ని చూస్తుంటే అర్థం అవుతోంది. ఇక తమన్ ఎప్పటి లాగానే తన మార్క్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో అదరగొట్టేసాడు అనే చెప్పొచ్చు. ఓవరాల్ గా ఒక పర్ఫెక్ట్ కమర్షియల్ ఎంటర్టైనర్ లాగా అనిపిస్తోంది. క్లిక్ అయితే వెంకటేష్ కెరీర్ లో మరో 300 కోట్ల గ్రాస్ సినిమా వచ్చి చేరుతుందని బలమైన నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు ట్రేడ్ విశ్లేషకులు.
ఇప్పటికే ఈ చిత్రం నుండి రెండు పాటలు విడుదలై మంచి రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈ ట్రైలర్ ఈ చిత్రం బజ్ ని మరింత పెంచేలా ఉందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఓవర్సీస్ లో మొదట్లో ఈ చిత్రానికి ఆశించిన స్థాయి హైప్ లేదు. కానీ ఇప్పుడు మాత్రం మంచి హైప్ తో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఓవరాల్ గా వెంకటేష్ కెరీర్ లోనే బెస్ట్ ఓపెనింగ్స్ ని రాబట్టే సినిమాగా నిలుస్తుందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. మరి ఆ అంచనాలను ఈ చిత్రం అందుకుంటుందో లేదో తెలియాలంటే మరో వారం రోజులు ఎదురు చూడాల్సిందే.