Special pujas at Peddamma temple : ఇండియా లో సల్మాన్ ఖాన్(Salman Khan) తర్వాత మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లిస్ట్ తీస్తే అందులో రెబల్ స్టార్ ప్రభాస్ పేరు కచ్చితంగా ఉంటుంది. ఈయన పెళ్లి వార్త కోసం అభిమానులు ఎంతో కాలం నుండి ఎదురు చూస్తున్నారు. ప్రభాస్(Rebel Star Prabhas) పెద్దమ్మ ని అడిగితే త్వరలోనే పెళ్లి చేయబోతున్నాము అంటూ చెప్పుకొస్తూనే ఉంది. ఏళ్ళు గడిచిపోతున్నాయి కానీ, ప్రభాస్ పెళ్లి మాత్రం జరగడం లేదు. సినిమాల్లో బిజీ గా ఉండడం వల్ల పెళ్లి చేసుకోవడం లేదని అభిమానులు అనుకుంటున్నారు. కానీ వాళ్లకు మా అభిమాన హీరో ఒక ఇంటి వాడు అయితే చూడాలని ఎంతో ఆశగా ఉంది. అయితే ఆ గడియలు ఎంతో దూరం లో లేవని లేటెస్ట్ గా జరుగుతున్న కొన్ని పరిణామాలను చూస్తే అర్థం అవుతుంది. ఈ ఏడాది కాకపోయినా , వచ్చే ఏడాది మొదట్లోనే ప్రభాస్ పెళ్లి చేసుకునే అవకాశాలు ఉన్నాయి.
Also Read: తన ఫస్ట్ లవ్ ఎవరో బయటపెట్టిన అనుష్క..
పెళ్లి కూతురు సినీ ఇండస్ట్రీ కి చెందిన అమ్మాయి కాదని, ప్రభాస్ సొంతూరు మొగళ్తూరుకి చెందిన అమ్మాయి అని, ఇది వరకే ప్రభాస్ పెద్దమ్మ అధికారిక ప్రకటన చేసింది. అయితే రీసెంట్ గానే ఆమె ఆంధ్ర ప్రదేశ్ లోని కాకినాడ జిల్లాలో తలుపులమ్మ ఆలయంలో ఉండే అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారిని దర్శించుకున్న తర్వాత ప్రభాస్ పేరిట ప్రత్యేక కుంకుమ అర్చన చేయించింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. మొక్కులు ఎప్పుడు చెల్లించుకుంటారు?, దేవుడిని ఏదైనా కోరిక కోరుకున్నప్పుడు అది నెరవేరితేనే కదా?, ఈ వయస్సు లో శ్యామల దేవి గారికి ఏమి కోరికలు ఉంటాయి?, ప్రభాస్ కి పెళ్లి జరగడం వంటి కోరికలే కదా?, ఇప్పుడు మొక్కులు చెల్లించుకొని ప్రత్యేకంగా ప్రభాస్ పేరిట అర్చనలు చేయించండంటే ప్రభాస్ పెళ్ళికి ముహూర్తం కుదిరినట్టే అని అభిమానులు అనుకుంటున్నారు.
Also Read : మహేష్ బాబు,రాజమౌళి చిత్రానికి సరికొత్త చిక్కులు..ఇలా అయితే కష్టమే!
ప్రస్తుతం ప్రభాస్ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. ఇవి తప్పనిసరిగా వెంటనే పూర్తి చేయాల్సిన సినిమాలు. అందులో మొదటిది రాజా సాబ్. రీసెంట్ గానే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ కూడా విడుదలై మంచి రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది. ఈ చిత్రాన్ని డిసెంబర్ 5 న విడుదల చేయబోతున్నట్టు అధికారిక ప్రకటన చేశారు మేకర్స్. ప్రభాస్ కి సంబంధించి ఇంకా నెల రోజుల షూటింగ్ బ్యాలన్స్ ఉంది. ఈ సినిమాతో పాటు సమాంతరంగా ఆయన హను రాఘవపూడి మూవీ షూటింగ్ లో కూడా పాల్గొంటున్నాడు. ఈ చిత్రాన్ని కూడా సెప్టెంబర్ నెలలోపు పూర్తి చెయ్యాలని చూస్తున్నాడు. ఈ రెండు సినిమాలు పూర్తి అయిన తర్వాత ఆయన సందీప్ వంగ దర్శకత్వం లో తెరకెక్కే ‘స్పిరిట్’ చిత్రం చేయనున్నాడు. ఈ మూడు సినిమాల షూటింగ్స్ పూర్తి అయ్యాక, కొన్ని రోజులు విశ్రాంతి తీసుకొని ,పెళ్లి పనులు మొదలు పెట్టే ఆలోచనలో ఉన్నాడట ప్రభాస్.