Mahesh Babu New Film: సూపర్ స్టార్ మహేష్ బాబు(Superstar Mahesh Babu), రాజమౌళి(SS Rajamouli) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా పై కేవలం అభిమానులు మాత్రమే కాదు, ప్రేక్షకులు కూడా ఎన్నో భారీ అంచనాలు పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఇది పాన్ ఇండియన్ చిత్రం కాదు, పాన్ వరల్డ్ చిత్రం. #RRR సినిమాతో హాలీవుడ్ లో తనకు వచ్చిన గుర్తింపుని గమనించిన రాజమౌళి, ఈసారి ఎక్కుపెడితే హాలీవుడ్ రికార్డ్స్ అన్ని బద్దలు అవ్వాలి అనే రేంజ్ లో ఈ చిత్రాన్ని ప్లాన్ చేశాడు. రెగ్యులర్ షూటింగ్ కార్యక్రమాలు రీసెంట్ గానే మొదలై రెండు మూడు షెడ్యూల్స్ ని కూడా పూర్తి చేసుకున్నారు. అయితే రాజమౌళి రీసెంట్ గానే కెన్యా లో ఒక భారీ షెడ్యూల్ ని ప్లాన్ చేశారు. ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్నప్పుడు రాజమౌళి అక్కడి అడవుల్లో రెక్కీ ని నిర్వహించి కొన్ని స్పాట్స్ ని కూడా సెలెక్ట్ చేసుకున్నాడు.
Also Read: అనసూయను ఏమంటే కాలుద్దో అదే అన్నారుగా!
అయితే ఇప్పుడు ఈ కెన్యా(Kenya) షెడ్యూల్ ని రద్దు చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. కారణం ఆ దేశంలో రీసెంట్ గా శాంతి భద్రతల సమస్యలు తలెత్తడం వల్లనే అట. ఇలాంటి పరిస్థితిలో అక్కడ షూటింగ్ చేసే అవకాశాలు లేకపోవడం తో ప్రస్తుతానికి రద్దు చేయడమే మంచిది అని రాజమౌళి నిర్ణయం తీసుకున్నాడట. భవిష్యత్తులో ఈ షెడ్యూల్ మళ్ళీ ప్లాన్ చేస్తారా?, లేకపోతే ఇక్కడే సెట్స్ వేసి ఆ సన్నివేశాలను తెరకెక్కిస్తారా అనేది చూడాలి. ఇప్పటికే కాశీ సెట్స్ ని రామోజీ ఫిలిం సిటీ లో నిర్మించారు. త్వరలోనే ఇక్కడ షూటింగ్ జరగబోతుంది. ఈ చిత్రం కోసం సుమారుగా వెయ్యి కోట్ల రూపాయిల బడ్జెట్ ని ఖర్చు చేస్తున్నారట. విజువల్స్ హాలీవుడ్ సినీ ఇండస్ట్రీ కూడా అవాక్కు అయ్యేలా ప్లాన్ చేసాడట డైరెక్టర్ రాజమౌళి. టాలీవుడ్ కి గ్రాండియర్ అనే పదాన్ని నేర్పించిన లెజెండ్ ఆయన, అలాంటి వ్యక్తి హాలీవుడ్ స్థాయిలో ఒక చిత్రాన్ని తెరకెక్కిస్తుంటే ఎలాంటి జాగ్రత్తలు విజువల్స్ కోసం తీసుకుంటాడో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.
Also Read: తెలుగు నటుడిని బండ బూతులు తిట్టిన షారుక్ ఖాన్.. వైరల్ వీడియో
ఈ చిత్రం డైనోసార్స్ కూడా ఉంటాయి. రామాయణం లో హనుమంతుడు లక్ష్మణుడి ప్రాణాలను కాపాడడం కోసం పారిజాత పుష్పాలను తీసుకొచ్చేందుకు ఒక పర్వతాన్ని తీసుకొస్తాడు కదా, అదే పర్వతం లో హీరో పారిజాత పుష్పాల కోసం కొనసాగించే వెటనే ఈ చిత్రం. అక్కడికి చేరుకోవడానికి మధ్యలో జరిగిన సంఘటనలను కనీవినీ ఎరుగని రేంజ్ లో , మన ఊహకు అందని విధంగా తీర్చి దిద్దే ప్లాన్ లో ఉన్నాడట రాజమౌళి. ఇందులో హనుమంతుడు క్యారెక్టర్ కూడా ఉంటుందట. ఆ క్యారక్టర్ ఎవరు చేస్తున్నారు అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ఇకపోతే ఇందులో హీరోయిన్ గా ప్రియాంక చోప్రా(Priyanka Chopra) నటిస్తుండగా, విలన్ గా మలయాళం స్టార్ హీరో పృథ్వీ రాజ్ సుకుమారన్(Prudhvi Raj Sukumaran) చేస్తున్నాడు. అదే విధంగా మహేష్ బాబు తండ్రి క్యారక్టర్ లో తమిళ హీరో మాధవన్(Ranganathan Madhavan) నటించబోతున్నట్టు టాక్.