Homeఎంటర్టైన్మెంట్Anushka Relationship News: తన ఫస్ట్ లవ్ ఎవరో బయటపెట్టిన అనుష్క..

Anushka Relationship News: తన ఫస్ట్ లవ్ ఎవరో బయటపెట్టిన అనుష్క..

Anushka Relationship News: స్టార్ లేడీ అనుష్క శెట్టి(Anushka Shetty )పై పలు ఎఫైర్ రూమర్స్ ఉన్నాయి. వారిలో కొందరు హీరోల పేర్లు ప్రముఖంగా వినిపించాయి. గతంలో హీరో గోపీచంద్ తో అనుష్క శెట్టి వరుస చిత్రాలు చేసింది. దాంతో వారిద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ అంటూ వార్తలు వచ్చాయి. అనుష్క-గోపీచంద్ వివాహం చేసుకోబోతున్నారని కథనాలు వెలువడ్డాయి. గోపీచంద్ వివాహంతో ఆ పుకార్లకు చెక్ పడింది. అనంతరం ప్రముఖ సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ ని అనుష్క ప్రేమించారంటూ పుకార్లు చక్కర్లు కొట్టాయి. ఇరు కుటుంబాల పెద్దలు అంగీకారం తెలిపారని, త్వరలో పెళ్లని వార్తలు వచ్చాయి.

Also Read: అనసూయను ఏమంటే కాలుద్దో అదే అన్న రోజా… వేదిక ఫైర్ బ్రాండ్స్ రచ్చ!

సెంథిల్ కుమార్ పెళ్ళికి స్వయంగా హాజరైన అనుష్క సదరు పుకార్లకు చెక్ పెట్టింది. ఇక ప్రభాస్ తో అనుష్క ప్రేమ, పెళ్లి పుకార్లు ఎవర్ గ్రీన్ అని చెప్పాలి. ప్రభాస్(Prabhas) తో అనుష్క నాలుగు సినిమాలు చేసింది. బాహుబలి సమయంలో వీరి మధ్య ప్రేమ చిగురించిందని, బాహుబలి 2 విడుదల అనంతరం వివాహం అంటూ కథనాలు వెలువడ్డాయి. సాహో మూవీ ప్రమోషన్స్ లో ప్రభాస్ కి ఈ ప్రశ్న పలు సందర్భాల్లో ఎదురైంది. అనుష్క తనకు బెస్ట్ ఫ్రెండ్ మాత్రమే అని ప్రభాస్ స్పష్టత ఇచ్చాడు.

అయితే అనుష్కకు స్కూల్ డేస్ నుండే లవ్ ప్రపోజల్స్ ఎదురయ్యాయట. ఆమె సిక్స్త్ క్లాస్ లో ఉండగా ఓ అబ్బాయి ఐ లవ్ యూ చెప్పాడట. ఐ లవ్ యూ అంటే అర్థం ఏమిటో కూడా తెలియని అనుష్క.. అతనికి ఓకే చెప్పిందట. అదే తన ఫస్ట్ లవ్ అని అనుష్క పరోక్షంగా చెప్పుకొచ్చింది. ఓ ఇంటర్వ్యూలో అనసూయ ఈ మేరకు ఆసక్తికర కామెంట్స్ చేసింది. నాలుగు పదుల వయసు దాటినా అనుష్క వివాహం చేసుకోకపోవడం కొసమెరుపు. ఆమె వివాహం చేసుకుంటారా లేదా అనే విషయంలో స్పష్టత లేదు.

Also Read: ఉదయ్ కిరణ్ చనిపోవడమే మంచిది.. ఎవరెవరు హింసించారో నాకు తెలుసు..

ప్రస్తుతం అనుష్క ఘాటీ టైటిల్ తో లేడీ ఓరియెంటెడ్ మూవీ చేస్తుంది. ఈ చిత్రంలో ఆమె లుక్ ఫెరోషియస్ గా ఉంది. దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తున్నారు. ఘాటీ మూవీ జులై 11న థియేటర్స్ లోకి రానుంది. ఘాటీ చిత్ర ప్రమోషన్స్ లో టీమ్ పాల్గొంటున్నారు.

RELATED ARTICLES

Most Popular