Homeఎంటర్టైన్మెంట్Sonu Sood Helping Indians In Gulf War Crisis: సోను సూద్‌ మరో మానవతా...

Sonu Sood Helping Indians In Gulf War Crisis: సోను సూద్‌ మరో మానవతా సాయం.. గల్ఫ్‌లో చిక్కుకున్నవారికి అండగా

Sonu Sood Helping Indians In Gulf War Crisis: ఇరాన్, అమెరికా–ఇజ్రాయెల్‌ యుద్ధం రోజు రోజుకూ ముదురుతోంది. గల్ఫ్‌ దేశాలపై ఇరాన్‌ వైమానిక దాడులు కొనసాగిస్తోంది. దీంతో ఉపాధి నిమిత్తం గల్ఫ్‌ దేశాలకు వెళ్లిన భారతీయుల కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి. ప్రధాని నరేంద్రమోదీ గల్ఫ్‌ దేశాలతో మాట్లాడుతున్నారు. విమానాల్లో అక్కడ చిక్కుకున్నవారిని స్వదేశానికి తీసుకువస్తున్నారు. అయితే గల్ప్‌ దేశాల్లో భారతీయులు సుమారు కోటి మంది వరకు ఉంటారు. యుద్ధం జరిగే ప్రాంతాల్లో ఉన్నవారిని తీసుకురావడం ఇబ్బందిగా మారింది. దీంతో నేనున్నానంటూ ముందుకు వచ్చాడు బాలీవడ్‌ నటుడు సోనూసూద్‌. గల్ఫ్‌లో చిక్కుకున్నవారికి రక్షణ కల్పిస్తానని ప్రకటించాడు. ఆపదలో ఉనర్నవారు తనను సంప్రదించాలని సూచించాడు.

Also Read: రాష్ట్ర రాజకీయాల్లో ముగిసిన నితీశ్‌ శకం.. బీజేపీ ఖాలాలోకి బిహార్‌!

యుద్ధ సందర్భంలో సహాయ ప్రకటన
గల్ఫ్‌ ప్రాంతంలో ఉద్రిక్తతలు తీవ్రమై, విమానల రద్దు, రోడ్ల మూసివేతలతో వేలాది మంది చిక్కుకున్నారు. దీంతో సోను సూద్‌ ఎక్స్, ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో పోస్ట్‌ చేసి, దుగాస్తా ప్రాపర్టీస్‌తో కలిసి బస కల్పిస్తానని తెలిపాడు. ‘మీరు ఎక్కడి నుంచైనా సంప్రదించయవచ్చని తెలిపారు. ఇది కోవిడ్‌ సమయంలో అతని సేవలకు గుర్తు చేస్తోంది.

దుబాయ్‌ తీవ్ర పరిస్థితి..
ఇరాన్‌ నుంచి దూసుకువస్తున్న క్షిపణులు, రాకెట్లు, జెట్‌ విమానాలు చూసి దుబాయ్‌లో చిక్కుకున్న భారతీయులు ఆందోళన చెందుతున్నారు. బాలీవుడ్‌ నటి లారా దత్త వంటి సెలబ్రిటీలు కూడా భయపెట్టుగా వీడియోలు పోస్ట్‌ చేశారు. సోనల్‌ చౌహాన్, ఈషా గుప్తా వంటి నటులు సురక్షితంగా భారత్‌కు చేరుకున్నారు. ప్రీతి జింటా ’రఫ్‌ వీక్స్‌’ అని పేర్కొన్నారు.

సోను సూద్‌ మానవత్వం..
కోవిడ్‌ సమయంలో ఇబ్బందుల్లో ఉన్నవారిని ఆదుకునేందుకు సోనూసూద్‌ ముందుకు వచ్చారు. ఉపాధి లేక ఆకలితో అలమటిస్తుననవారికి అండగా నిలిచారు. కోవిడ్‌ బారిన పడిన పేదలకు వైద్య ఖర్చుల కోసం ఆర్థిక సాయం చేశారు. ఆక్సిజన్‌ కొరతతో ఇబ్బంది పడుతున్నవారికి వెంటిలేటర్లు అందించారు. పంజాబ్‌ వరదల సమయంలోనూ సోనూసూద్‌ ఆర్థికసాయం చేశారు. దుబాయ్‌ ఎయిర్‌పోర్ట్‌లో ఒక వ్యక్తి గుండెపోటు రావడంతో సీపీఆర్‌ చేసి రక్షించాడు. ఈసారి యుద్ధ సమయంలో అందరికీ సహాయం అందిస్తూ మానవతా చిహ్నంగా నిలుస్తున్నాడు. భారత ప్రభుత్వం ఎవాక్యుయేషన్‌ లాంటి చర్యలు తీసుకుంటున్నా, సోను వ్యక్తిగత సహాయం ప్రత్యేకం.

సోను పోస్ట్‌ వైరల్‌ అవ్వడంతో వేలాది మంది సంప్రదించారు. దుబాయ్‌ ప్రభుత్వం పౌరుల సురక్షితంగా చూస్తోందని నటులు పేర్కొన్నారు. ఈ చర్య యుద్ధ సమయంలో సెలబ్రిటీల పాత్రను ప్రదర్శిస్తోంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular